గుండె నిండా గుడి గంటలు: ఇల్లు కోసం దాచిన డబ్బు రాజేష్‌కి- బాలు మాట లెక్కచేయని మీనా-నిజమైన బాలు పీడకల-సంతోషంలో ప్రభావతి

గుండె నిండా గుడి గంటలు లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో రాజేష్ తన తల్లిదండ్రులకు షష్టిపూర్తి చేయాలనుకుంటాడు. కానీ, డబ్బులేక కుమిలిపోతాడు. దాంతో ఆ డబ్బును బాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తాడు. ఇల్లు కట్టడానికి దాచుకున్న డబ్బులను రాజేష్‌కు ఇస్తానని బాలు అంటాడు. కానీ, మీనా మాత్రం ఆ మాటలు లెక్కచేయదు.

Published on: Feb 8, 2026, 12:47:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో నిద్రలో నుంచి బాలు ఉలిక్కిపడి లేస్తాడు. వెంటనే మీనా నీళ్లు ఇస్తుంది. ఏమైందని అడుగుతుంది. మనిద్దరికి చాలా పెద్ద గొడవ అయిందని పీడకల వచ్చిందని బాలు అంటాడు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో
గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో

మీనా సెటైర్లు

మనం రోజు గొడవ పడుతూనే ఉంటాం కదా. కలలో మీరు అసలు నన్ను మాట్లాడినిచ్చారా అని సైటెర్లు వేస్తుంది మీనా. ఇది అలా కాదు. చాలా అరుచుకున్నామట అని బాలు అంటాడు. ఇద్దరు వాదించుకుంటారు. ఇప్పుడే గొడవ పడేలా ఉన్నామని, పడుకోండని మీనా అంటుంది. మీనాపై బాలు కాలు వేస్తాడు. ఏంటని అడిగితే చేయి కూడా వేస్తాడు.

అలా రొమాంటిక్‌గా బాలు, మీనా నైట్ సాగిపోతుంది. మరుసటి రోజు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు బాలు. అక్కడ బాలు ఫ్రెండ్ రాజేష్ మత్తులో స్తంభానికి ఒరిగి పడుకుంటాడు. అది చూసిన బాలు వీడేంటీ ఇలా పడుకున్నాడు అని మిగతా వాళ్లను అడుగుతాడు. పీకల దాకా తాగితే అలాగే పడుకుంటారు మరి అని మరో ఫ్రెండ్ చెబుతాడు.

పీకల దాకా తాగాడా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తాడు బాలు. నువ్వు మరి విచిత్రంగా అడక్కు. తాగడం వాడికేమైనా కొత్తా అని అతను అంటాడు. లేదురా. ఈ మధ్య మందుకు దూరంగా ఉంటున్నాం కదా. పైగా నేను లేకుండా వీడు మందు ముట్టుకునే అవకాశమే లేదు. ఎందుకు తాగి ఉంటాడు అని బాలు అంటాడు.

పేదోడిగానే చావాలి

లేపి నువ్వే తెలుసుకో అని మరో ఫ్రెండ్ చెబుతాడు. రేయ్ రాజేష్ లేరా అని పిలుస్తాడు బాలు. ఈ బతుకులు మారవురా. పేదోడిగా పుట్టి పేదోడిగానే చావాలి అని రాజేష్ అంటాడు. ఏమంటున్నాడురా వీడు అని మళ్లీ గట్టిగా పిలిచి రాజేష్‌ను లేపుతాడు బాలు. కాసేపు పిలిచాకా లేస్తాడు రాజేష్.

ఏమైందిరా, ఎందుకు తాగావు అని అడుగుతాడు బాలు. ఏం చేయలేక, స్పృహలో ఉంటే బాధ కలుగుతోంది. ఇలా మత్తులో ఉంటేనైనా లోకాన్ని మర్చిపోవచ్చు అని తాగాను అని రాజేష్ అంటాడు. ఇంతకీ ఏమైందిరా అని బాలు అడుగుతాడు. మా అమ్మనాన్నలకు షష్టిపూర్తి వస్తోంది. అది చేద్దామంటే నా దగ్గర డబ్బులు లేవు. పైగా నా భార్య కూడా అందుకు ఒప్పుకోవడం లేదని రాజేష్ చెబుతాడు.

దానికే ఇంతలా తాగాలా అని బాలు అంటాడు. నీకు తెలియదురా. డబ్బు ఏమాత్రం లేదు. అప్పు కూడా పుట్టట్లేదు. గుణ గాడికి ఇదివరకే బాకీ ఉన్నాను. నా భార్య కూడా ఒప్పుకోవట్లేదు. కానీ, మా అమ్మ నాన్నల కోసం ఏదైనా చేయాలిరా. నాకోసం వాళ్లు చాలా కష్టపడ్డారు. వాళ్ల కోసం ఏం చేయలేకపోతున్నానే బాధ చంపేస్తోందిరా అని రాజేష్ తన ఆవేదన చెప్పుకుంటాడు.

హామీ ఇచ్చిన బాలు

దాంతో చలించిపోయిన బాలు తాను డబ్బు ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తాడు. నువ్వేలా ఏర్పాటు చేస్తావురా అని రాజేష్ అడుగుతాడు. నేను ఎలాగోలా అరెంజ్ చేస్తాను. నువ్విలా తాగకు అని భరోసా ఇస్తాడు బాలు. దాంతో రాజేష్ సంతోషిస్తాడు. తర్వాత బాలు ఇంటికి వెళ్తాడు. వెళ్లి మీనాతో మాట్లాడుతాడు.

రాజేష్ గాడు వాళ్ల అమ్మ నాన్నలకు షష్టిపూర్తి చేయాలనుకుంటున్నాడు. కావాలిసిన ఏర్పాట్లు చేసుకోమన్నాను. నేను డబ్బు సర్దుతానని అన్నాను బాలు అంటాడు. మీ దగ్గర డబ్బులు ఎక్కడివి అని మీనా అడుగుతుంది. మనం ఇల్లు కట్టాలని దాచుకున్నాం కదా. ఇల్లు సంగతి తర్వాత చూసుకుందాం. ఇంటి కోసం దాచిన డబ్బును రాజేష్‌కు ఇద్దాం అని బాలు అంటాడు.

మనం ఇల్లు కట్టడం ముఖ్యమా అందరికి బిర్యానీ పెట్టించడం ముఖ్యమా అని మీనా రివర్స్ అవుతుంది. బాలు ఎంత చెప్పిన మీనా ఒప్పుకోదు. దాంతో నాకు కోపం తెప్పించకు అని బాలు అంటాడు. వెళ్లి కుదరదు అని చెప్పండి అని బాలు మాట లెక్కచేయకుండా మీనా అంటుంది. ఆ మాటలన్నీ విన్న ప్రభావతి తెగ సంతోషపడుతుంది. ఇప్పుడు బాలు గాడిని రెచ్చగొడితే ఇద్దరు గొడవ పడతారు అని అనుకుంటుంది ప్రభావతి.

చవట దద్దమ్మలా

వెళ్లి బాలుతో మాట్లాడుతుంది ప్రభావతి. పెళ్లాం దగ్గరికి వెళ్లేసరికి చవట దద్ధమ్మలా మ్యావ్ అంటావేంట్రా. నీ డబ్బులే నీకు ఇవ్వడానికి ఇలా మాట్లాడుతోంది. ఇలాగే వదిలేస్తే నీ నెత్తి మీద అది డ్యాన్స్ స్కూల్ పెట్టి తైతక్కలాడటం మొదలుపెడుతుంది అని వెటకారంగా, సంతోషంగా చెబుతుంది ప్రభావతి. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More