ఆ మాటల్నీ ఎడమ కాలితో తిప్పికొట్టింది.. కొడుకు సక్సెస్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు.. నిర్మాత రాజేష్ దండా కామెంట్స్

ఆది సాయి కుమార్ నటించిన సరికొత్త హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ శంబాల. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న శంబాల మూవీ సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో నిర్మాత రాజేష్ దండా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Published on: Jan 4, 2026, 11:50:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ హీరోగా నటించిన ‘శంబాల’ చిత్రం ప్రస్తుతం విజయవంతంగా దూసుకుపోతోంది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద ఈ మూవీని మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మించారు.

ఆ మాటల్నీ ఎడమ కాలితో తిప్పికొట్టింది.. కొడుకు సక్సెస్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు.. నిర్మాత రాజేష్ దండా కామెంట్స్
ఆ మాటల్నీ ఎడమ కాలితో తిప్పికొట్టింది.. కొడుకు సక్సెస్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు.. నిర్మాత రాజేష్ దండా కామెంట్స్

సూపర్ హిట్ టాక్‌తో శంబాల

యుగంధర్ ముని దర్శకత్వం వహించిన శంబాల డిసెంబర్ 25న విడుదలై మంచి హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల శంబాల విజయోత్సవ వేడుక డివైన్ బ్లాక్ బస్టర్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రాజేష్ దండా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.

ఎడమ కాలితో తిప్పి కొట్టింది

రాజేష్ దండా మాట్లాడుతూ .. "శంబాల లాంటి మంచి సినిమాను మీడియానే జనాల వరకు తీసుకెళ్లింది. చిన్న చిత్రాల్ని చూసేందుకు థియేటర్లకు రావడం లేదు అనే మాటల్ని ఎడమ కాలితో తిప్పి కొట్టింది ‘శంబాల’. ప్రివ్యూలో ఈ మూవీని చూసి హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్‌లో ఏదో ఒకటి అవుతుందని చెప్పాను" అని అన్నారు.

డీవియేట్ కాకుండా

"కథను ఎక్కడా డీవియేట్ కాకుండా దర్శకుడు అద్భుతంగా తీశారు. కంటెంట్‌ను నమ్మి ఆది సాయి కుమార్ గారు ఈ మూవీని చేశారు. ఆ కంటెంట్‌ నచ్చి జనాలు బ్లాక్ బస్టర్ స్టేటస్‌ను ఇచ్చారు. కొడుకు సక్సెస్‌ను చూసి సాయి కుమార్ గారు చాలా ఎంజాయ్ చేస్తున్నారు" అని రాజేష్ దండా తెలిపారు.

ఇంతకంటే మంచి గిఫ్ట్

"కె ర్యాంప్ చిత్రంతో సాయి కుమార్ గారితో నాకు మంచి బంధం ఏర్పడింది. ఓ కొడుకుగా తండ్రికి ఇంత కంటే మంచి గిఫ్ట్ ఎవ్వరూ ఇవ్వలేరు. ఎంత కాంపిటీషన్‌ ఉన్నా కూడా మంచి డిస్ట్రిబ్యూటర్లకు సినిమాను ఇచ్చి నిలబెట్టిన నిర్మాతలకు కంగ్రాట్స్. వారెప్పుడూ ఇలానే మంచి చిత్రాల్ని తీయాలని కోరుకుంటున్నాను" అని నిర్మాత రాజేష్ దండా పేర్కొన్నారు.

మరిన్ని రికార్డ్స్ క్రియేట్

ఉషా పిక్చర్స్ సురేష్ మాట్లాడుతూ .. "శంబాల మూవీని మాకు ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్. ఆదికి బ్లాక్ బస్టర్ హిట్ రావడం ఆనందంగా ఉంది. మున్ముందు ఈ మూవీ మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుంది. రెండో వారంలో కలెక్షన్లు పెరుగుతాయి" అని జ్యోస్యం చెప్పారు.

ముఖ్య అతిథిగా అల్లు అరవింద్

కాగా, శంబాల సక్సెస్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ హాజరయ్యారు. ఈ సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశానని, సాయి కుమార్‌తో మూడు తరాల బంధం అని అల్లు అరవింద్ పేర్కొన్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More