గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: కోడళ్లను ఆటపట్టించిన సత్యం- ఎమ్మెల్యే కాలర్ పట్టుకున్న మనోజ్- ప్రభావతికి అవస్థలు

గుండె నిండా గుడి గంటలు ఫిబ్రవరి 5 ఎపిసోడ్‌లో మీనా, శ్రుతి ప్రేమగా మాట్లాడుకుంటుంటే సత్యం ప్రాంక్ చేసి నవ్వుతాడు. ప్రభావతి కోసం బిర్యానీ తీసుకెళ్తుంది మీనా. అది తిన్న ప్రభావతి అజీర్తితో అవస్థలు పడుతుంది. ఇది హోటల్ నుంచి తీసుకొచ్చిన బిర్యానీ అని మీనాను తిడుతుంది ప్రభావతి.

Published on: Feb 5, 2026, 08:40:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో మీనా వంటలను శ్రుతి పొగుడుతుంది. వాళ్లు మాట్లాడుకోవటం చూసి రా ప్రభా తిందాం అని సత్యం కావాలనే అంటాడు. దాంతో శ్రుతి, మీనా గొడవ పడతారు. దాంతో సత్యం నవ్వుతాడు. ప్రభ పేరు చెప్పగానే భలే గొడవ పడుతున్నారే అని సత్యం అంటే.. మీరు కూడా ప్రాంక్ చేశారా మావయ్య అని శ్రుతి అంటుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఫిబ్రవరి 5 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఫిబ్రవరి 5 ఎపిసోడ్‌

కోడళ్లను ఆట పట్టించిన సత్యం

నా భార్యను మోసం చేస్తున్నారు. నేను ఆ మాత్రం ఆట పట్టించకూడదా అని సత్యం అంటాడు. అంకుల్ కూడా ఆంటీ పార్టీనే అని శ్రుతి అంటుంది. మీరు ఆడుతుంది నాటకం అని తెలిస్తే ప్రభ రంకెలేస్తుంది జాగ్రత్త అని సత్యం అంటాడు. ప్రభావతికి లంచ్ క్యారేజ్ తీసుకెళ్తుంది మీనా.

మీనాను ఎందుకు ఆంటీ ఆడిపోసుకుంటుంది అని శ్రుతి అడిగితే.. మీనాను ఇంటికి తీసుకురావడం మీ ఆంటీకి ఇష్టంలేదు. అందుకే ఇలా చేస్తుందని సత్యం అంటాడు. మరోవైపు మనోజ్‌ను ఒక వ్యక్తి కలుస్తాడు. లవ్ లెటర్ అని చెప్పి ఓ లెటర్ ఇస్తాడు అతను. ఎవరు మీరు అని మనోజ్ అడిగితే ఎమ్మెల్యే అని చెప్పి మంచి లక్ష్మణాలు ఉన్న అబ్బాయి అని అంటాడు.

ఆ లెటర్ చదువుతాడు మనోజ్. మీ అమ్మకు గుండెపోటు వస్తుంది, తమ్ముడు హంతకుడు అవుతాడు, నువ్వు ఆత్మహత్య చేసుకుంటావ్ అని మనోజ్ చదివి షాక్ అవుతాడు. లెటర్ ఇచ్చిన వ్యక్తి కోసం వెతుకుతాడు. అతన్ని పట్టుకుని ఎవడ్రా నువ్వు, ఇదంతా ఏంటీ అని నిలదీస్తాడు మనోజ్. ఎమ్మెల్యే కాలర్ పట్టుకుని అడుగుతాడు మనోజ్.

జైలు నుంచే వచ్చాడు

టీ బిల్లు కట్టు చెబుతా అంటాడు ఎమ్మెల్యే. మనోజ్ టీ డబ్బులు కట్టి వచ్చేలోపు ఎమ్మెల్యే ఉండడు. దాంతో పక్కన ఉన్నతన్ని అడుగుతాడు మనోజ్. వాడు పెద్ద దొంగ. జైలు నుంచి మొన్నే వచ్చాడు. నువ్వు షాప్ ఓనర్‌వా. అయితే జాగ్రత్త. పోయి పోయి వాడికే దొరికావా అని భయపెడతాడు ఆ వ్యక్తి. మరోవైపు మీనా కోసం బాలు ఎదురుచూస్తుంటాడు.

మీనా క్యారేజ్ పట్టుకుని వస్తుంది. బాలు రాసిన ఓ లిస్ట్ కారులో పడిపోతుంది. ఇంతలో మీనాకు పూల ఆర్డర్ వస్తుంది. మరోవైపు ప్రభావతి డ్యాన్స్ చేపిస్తుంటే ప్రేమ్ కుమార్ రాధిక వైపు చూస్తాడు. దాంతో ప్రభావతి వారిస్తుంది. మీనాను డ్రాప్ చేసి బాలు వెళ్లిపోతాడు. లేట్ ఎందుకు వచ్చావని ప్రభావతి అడిగితే.. తెలియదని మీనా కౌంటర్స్ ఇస్తుంది.

మీ అత్త మొదటి నెల జీతంతో మంచి వాచ్ కొనిపెడుతుంది. ఐదారు వేలల్లో అని కామాక్షి అంటుంది. అర్జంట్‌గా పూలు ఇవ్వాలని మీనా అంటే.. వడ్డించి వెళ్లమని వారిస్తుంది ప్రభావతి. మరోవైపు రాధిక, ప్రేమ్ కుమార్ మాట్లాడుకుంటారు. రాత్రి ఎందుకు ఫోన్ చేశావ్. మా నాన్న పేరు అసలే మంగపతి అని రాధిక అంటుంది.

మీనా బిర్యానీతో ప్రభావతికి అవస్థ

కామాక్షి చేసిన వంట ప్రయోగం గురించి చెబుతుంది. అదంతా ఎందుకు ఇద్దరికి బిర్యాని తీసుకొచ్చాను అని మీనా అంటుంది. మీనాను మెచ్చుకుంటుంది కామాక్షి. ప్రేమ్‌కు రాధిక తినిపిస్తుంది. అది వెళ్లేటప్పుడు మీనా చూస్తుంది. బుద్ధిగా నాట్యం నేర్చుకో అని ప్రేమ్ కుమార్‌కు బుద్ధి చెప్పి వెళ్తుంది మీనా. కట్ చేస్తే అజీర్థితో నానా అవస్థలు పడుతుంది ప్రభావతి.

ఇంతలో మీనా వస్తుంది. సత్యం వచ్చి అడిగితే.. అత్తయ్యకు తిన్నది అరగలేదట అని మీనా చెబుతుంది. ఇంట్లో అందరూ తిన్నారు వారికేం కాలేదు. నీకెందుకు అయిందని సత్యం అంటాడు. ఇది హోటల్ నుంచి తెప్పించింది. ఇదిగోండి బిల్ అని ప్రభావతి ఇస్తుంది. నేను ఇంట్లో చేసిందే ఇచ్చాను అని మీనా అంటుంది. ఇంతలో బాలు వస్తాడు.

మీనాను రోహిణి కూడా తప్పుబడుతుంది. మరి ఇంట్లోంచి తీసుకెళ్లిన క్యారేజ్ ఏం చేసి ఉంటాను అని మీనా ఎదురు ప్రశ్న వేస్తుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More