గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలుతో ఆడుకున్న మీనా.. క్షమాపణ చెప్పిన పార్వతి.. ప్రభావతి కళ్లలో ఆనందం
గుండె నిండా గుడి గంటలు శుక్రవారం (జనవరి 16) ఎపిసోడ్ లో బాలు, మీనా గొడవ పడతారు. అతనితో మీనా ఆడుకుంటుంది. దీంతో ప్రభావతి కళ్లలో ఆనందం కనిపిస్తుంది. అటు పార్వతి కూడా అల్లుడికి క్షమాపణ చెబుతుంది.
గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 599వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. తాను వద్దన్నా తమ్ముడి బర్త్ డే కోసం వెళ్లిన మీనాతో బాలు తాగొచ్చి గొడవ పడతాడు. అది చూసి ప్రభావతి ఎంతో సంతోషిస్తుంది. వాళ్లకు గొడవకు తామే కారణం అంటూ పార్వతి, సుమతి వెళ్లి బాలుకి క్షమాపణ చెబుతారు.

తాగొచ్చి మీనాతో బాలు గొడవ
గుండె నిండా గుడి గంటలు శుక్రవారం (జనవరి 16) ఎపిసోడ్ మీనాతో బాలు గొడవ పడే సీన్ తో మొదలవుతుంది. బాలు బాగా తాగి వస్తాడు. ఇంటి బయటే మీనాతో గొడవ పడతాడు. తన మాట కాదని గుడికి వెళ్లిన మీనాపై మండిపడతాడు. తన తమ్ముడిపై ప్రేమతోనే తాను వెళ్లానని, వాడు తండ్రి లేని పిల్లాడని మీనా అంటుంది.
అంటే నా మీద ప్రేమ లేదా.. వాడు గొప్పగా చదువుతున్నాడు.. నేను కేవలం డ్రైవర్ అనే ఇలా చేస్తున్నావా అని బాలు మరింత చెలరేగుతాడు. అతన్ని బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్తుంది. బాలు మాత్రం తినమన్నా తినకుండా అలాగే పడుకుంటాడు.
వాళ్ల గొడవ చూసి సంతోషించిన ప్రభావతి
బాలు, మీనా గొడవ చూసిన ప్రభావతి ఎంతో సంతోషిస్తుంది. మీకు ఇప్పుడు తృప్తిగా ఉందా అని ప్రభావతిని మీనా నిలదీస్తుంది. మీరు ఇలా గొడవ పడుతుంటే తనకు చాలా సంతోషంగా ఉందని ప్రభావతి అంటుంది. కొడుకు తాగి వస్తే సంతోషించే తల్లిని మిమ్మల్నే చూస్తున్నానని మీనా అన్నా కూడా ఆమె పట్టించుకోదు. వాడు మారడని, మళ్లీ రోజూ ఇలాగే గొడవ పడుతూ ఉండండి అంటూ ప్రభావతి వెళ్లిపోతుంది.
బాలుతో ఆడుకున్న మీనా.. నిలదీసిన సత్యం
మరుసటి రోజు ఉదయం బాలుకి మీనా కాఫీ ఇవ్వబోతే అతడు తీసుకోడు. ఇక నుంచి నీ చేత్తో ఏం ఇచ్చినా తీసుకోను అని బాలు అంటాడు. దీంతో అతనితో ఆడుకోవాలని మీనా డిసైడవుతుంది. కారు కీస్ తీసి దాస్తుంది. తర్వాత బాలు వాటి కోసం వెతుకుతుంటే.. సత్యం ఏం జరిగిందని అడుగుతాడు.
రాత్రి తాగొచ్చావా అని బాలుని నిలదీస్తాడు. మీనాను అదే విషయం అడుగుతాడు. కానీ ఆమె ఏమీ చెప్పదు. ప్రభావతి మాత్రం అసలు విషయం చెప్పడంతో కారు కీస్ కూడా మరచిపోయి వచ్చేంత తాగావా అంటూ బాలుని అడుగుతాడు. ఇక నుంచి తాగి వస్తే బాగుండదని కూడా వార్నింగ్ ఇస్తాడు.
మళ్లీ గొడవ పడిన బాలు, మీనా
తర్వాత మీనా కారు కీస్ తీసుకొచ్చి సత్యం ముందు పెడుతుంది. కిచెన్ లో మరచిపోయాడని అంటుంది. దీంతో సత్యం మరింత కోప్పడతాడు. తర్వాత కిచెన్ లోకి వెళ్లి మీనాతో మరోసారి బాలు గొడవ పడతాడు. ఎందుకు అబద్ధం చెప్పావు.. అసలు నేను కిచెన్ లోకే రాలేదు కదా అని అంటాడు.
ఇద్దరి మధ్యా మరోసారి మాటామాటా పెరుగుతుంది. మీనా కూడా బాలుకి ఎదురు తిరుగుతుంది. అందరూ బాగానే ఉన్నారు.. మధ్యలో తనను ఎందుకు ఇలా వేధిస్తున్నారని అడుగుతుంది. పెళ్లి చేసుకుంటే ఆడపిల్ల పూర్తిగా పుట్టింటికి దూరమవ్వాలా అని బాలుని నిలదీస్తుంది. అతడు అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
బాలుకి క్షమాపణ చెప్పిన పార్వతి
ఇటు మీనా మాటలను గుర్తు చేసుకొని బాలు బాధపడుతుంటాడు. అప్పుడే పార్వతి, సుమతి అక్కడికి వస్తారు. మీనాపై కోపంగా ఉన్న విషయం గుర్తించి అల్లుడికి పార్వతి క్షమాపణ చెబుతుంది. తాను అలాంటివేవీ కోరుకోవడం లేదని బాలు అంటాడు. శివ తప్పుడు దారిలో వెళ్తుంటే మీరు వాడికి పుట్టిన రోజులు జరపాల్సిన అవసరం ఉందా అని నిలదీస్తాడు. దీంతో పార్వతి మరోసారి క్షమాపణ చెప్పగా.. తనకు ట్రిప్ వచ్చిందని చెప్పి బాలు వెళ్లిపోతాడు.
ఇటు తన ఫ్రెండ్ రాజేష్ తో మీనా గురించి చెప్పి బాలు బాధపడతాడు. అటు పూలు అల్లుతూ అక్కడి వాళ్లతో మీనా కూడా ఇంట్లో జరిగింది చెప్పి బాధపడుతుంది. ఇద్దరూ వెనక్కి తగ్గాలని వాళ్లు చెబుతారు. దీంతో మీనా కోసం బాలు ఓ సర్‌ప్రైజ్ తీసుకెళ్లగా.. బాలు కోసం మీనా గుమగుమలాడే వంట చేసి పెడుతుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


