గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలు మంచం కింద రోహిణి- నీతూతో రవిని చూసిన శోభన- మీనా బొమ్మలకొలువు- మనోజ్ పాట్లు!
గుండె నిండా గుడి గంటలు ఫిబ్రవరి 19 ఎపిసోడ్‌లో బాలు, మీనా ముసలివాళ్లలా మారిపోతారు. మనోజ్ చనిపోయినట్లు మాట్లాడుకుంటారు. సూపర్ మార్కెట్‌లో నీతూతో రవిని చూసి షాక్ అవుతుంది శోభన. మౌనికకు పిల్లలు పుట్టరని డాక్టర్‌తో రిపోర్ట్ వచ్చేలా ప్లాన్ చేస్తాడు నీలకంఠం. 5 వందల రూపాయల కోసం మనోజ్ పాట్లు పడతాడు.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో టెస్ట్ చేయకుంటే లోపం ఎవరి దగ్గరి ఉందో తెలియదు కదా అని సంజు అంటే తండ్రి నీలకంఠం సపోర్ట్ చేస్తాడు. దాంతో మౌనిక షాక్ అవుతుంది. ఇప్పుడు మీ ఇంట్లో ముగ్గురు ఉన్నారు. ఎవరికి పిల్లలు పుట్టలేదు కదా. అందుకే డౌట్ వచ్చి చేయించమని చెప్పానని నీలకంఠం అంటాడు.

వారించిన సంజు
నా గురించి ఇలా ఆలోచిస్తున్నారేంటీ మావయ్య అని నీలకంఠంపై అరుస్తుంది మౌనిక. దాంతో సంజు వారిస్తాడు. పోనీరా, ఎక్కువ టెన్షన్ పడిన పిల్లలు పుట్టరట అని సంజును తీసుకెళ్తాడు నీలకంఠం. ఏంటీ అత్తయ్య అని మౌనిక అంటే.. మనిషి రూపంలో ఉన్న రాక్షసులు. నాతోపాటు నీకు ఆ దేవుడు శిక్ష వేసాడు అని అత్త అంటుంది.
నాకు మాత్రం పిల్లలు పుట్టాలని ఉండదా. ఆయన దగ్గరికి వస్తే కదా అని మౌనిక అంటుంది. వాడిని మార్చేందుకు చాలా ట్రై చేశావ్ కానీ. వాడు మారట్లేదని మౌనికను ఓదారుస్తుంది అత్త. మరోవైపు డాక్టర్‌కు కాల్ చేసిన నీలకంఠం డబ్బులు అందాయిగా, నేను చెప్పినట్లుగానే మౌనికకు పిల్లలు పుట్టరని రిపోర్ట్ వస్తుందిగా అని అంటాడు. దాంతో అవును అని డాక్టర్ చెబుతాడు.
అదే విషయం సంజుకు చెబుతాడు నీలకంఠం. అది అడ్డుపెట్టుకుని తనను ఇంట్లో వదిలేయొచ్చు. అప్పుడు, బాలు వాళ్లు ఏం చేయలేరంటాడు. మరోవైపు వచ్చిన ఆదాయం గురించి లెక్కలు వేసుకుంటారు బాలు, మీనా. ముందు చూపు లేకుండానే తాత, బామ్మ రోడ్డున పడ్డారు. మనం అలా కాకూడదు. పిల్లల మీద ఆధారపడకుండా నీకు నేను నాకు నువ్వు అనేలా ఉండాలని మీనా అంటుంది.
ముసలివాళ్లలాగా బాలు మీనా
ఒక్కసారిగా ముసలివాళ్లం అయితే అని బాలు అంటాడు. దాంతో బాలు, మీనా ముసలి వాళ్లలాగా మారిపోతారు. పెద్దోడు పది ఎకరాలు మింగాడు. పదకొండో ఎకరం కావాలంటుందని బాలు అంటాడు. కూతురు ఫోన్ చేసి తన చిన్నకూతురుకు కాసుల పేర్లు చేయించమంటుందని మీనా అంటుంది. ఇలా చేసే మనోజ్ గాడు విషం తాగి చచ్చాడు. మనం అలా కాకూడదు అని బాలు అంటాడు.
ఇలాగే ఉందామని మీనా అంటుంది. ఇప్పటికీ మనం పైన రూమ్ కట్టలేదు. రూమ్ లేకుండానే పిల్లలం కన్నాం. ఇక రూమ్ ఎందుకు అని బాలు అంటాడు. మీ అమ్మ కాపురం సరిగా చేయనిచ్చిందా అని మీనా అంటే.. ఈ లీలావతి చచ్చి పైన ఏ లోకంలో ఉందో అని బాలు అంటాడు. తర్వాత రియాలిటీలోకి వచ్చి ఇద్దరు నవ్వుకుంటారు.
బాలు పడుకున్న చోటుకు వచ్చిన రోహిణి వీడియో కోసం వెతుకుతుంది. ఇంతలో బాలు లేచి అయ్యో టైమ్ 8 అయింద, ఫోన్‌లో ఛార్జింగ్ లేదే అంటూ మీనాపై అరుస్తూ వెళ్లిపోతాడు బాలు. త్వరగా టిఫిన్ చేయి నేను ఫోన్ ఛార్జింగ్ పెట్టి వెళ్లిపోతానంటాడు బాలు. రోహిణి అటు ఇటు తిరిగితే డౌట్ వచ్చి అడుగుతాడు బాలు. కవర్ చేస్తుంది రోహిణి.
బాలు, మీనా రొమాన్స్
బాలు ఫోన్‌కి ఛార్జింగ్ పెట్టి బాత్రూమ్‌లోకి వెళ్లిపోతాడు బాలు. రోహిణి వచ్చి ఫోన్ చూస్తుంది. ఇంతలో మీనాను బాలు పిలుస్తాడు. మీనా వస్తుంది. భయపడి మంచం కిందకు ఫోన్‌తో వెళ్లి దాక్కుంటుంది. మీనా వచ్చి టవల్ ఇచ్చి వెళ్తుంది. తర్వాత ప్రభావతి వచ్చి వెళ్లిపోతుంది. బాలు బాత్రూమ్ నుంచి వచ్చి మీనాను పిలుస్తాడు. మీనాతో రొమాన్స్ చేస్తాడు బాలు.
బాలు మంచం కిందే రోహిణి ఉండిపోతుంది. బాలు తల తుడుస్తుంది మీనా. అయ్యో వీళ్ల రొమాన్స్ చూడాలస్తుందని రోహిణి అనుకుంటుంది. బాలు పాట పాడుతాడు. మీనా నడుముపై బాలు చేయి వేస్తే వద్దంటుంది. దాంతో బాలు డోర్ వేస్తాడు. మరోవైపు రోహిణి కోసం మనోజ్ వెతుకుతాడు. ప్రభావతిని ఐదు వందలు అడుగుతాడు మనోజ్.
తన దగ్గర లేవని, సత్యంను అడగమంటుంది ప్రభావతి. మరోవైపు మీనాను పూరి తీసుకొచ్చి తినిపించమని పంపిస్తాడు బాలు. మంచం కింద ఉన్న రోహిణికి బాలు ఫోన్‌లో వీడియో దొరుకుతుంది. పంపించుకోవాలని చూసేలోపు ఫోన్ స్విచ్ఛాఫ్ అవుతుంది. ఇప్పుడెలా అని కంగారుపడుతుంది రోహిణి. కింద రోహిణి కోసం మనోజ్ వెతుకుతుంటాడు.
బాలు మొరటు సరసం
సత్యం వస్తే ఐదు వందలకు చిల్లర అడుగుతాడు. ముందు 5 వందలు ఇవ్వమంటాడు సత్యం. లేవని సత్యం పంపిస్తాడు. మనోజ్ 5 వందల కోసం పాట్లు పడుతూనే ఉంటాడు. బాలు దగ్గరికి వెళ్లి రోహిణి కావాలని మనోజ్ అడుగుతాడు. ఇక్కడ లేదని బాలు చెబుతాడు. ఇంతలో మీనా వస్తే మనోజ్ వెళ్లిపోతాడు. పూరిని బాలుకు తినిపిస్తుంది మీనా. చేయి కొరుకుతాడు బాలు. ఏంటండి ఈ మొరటు సరసం అని మీనా అంటుంది.
తర్వాత ఫోన్ కోసం బాలు వెతుకుతాడు. మంచం కింద పడిందేమో అని మీనా అంటే.. అదేమైనా బాల్ ఆ అని బాలు అంటాడు. బాలు, మీనా కిందకు వెళ్తారు. వెంటనే మంచం కిందనుంచి లేచి తీసిన చోట పెట్టి వెళ్లిపోతుంది రోహిణి. కింద ఫోన్ కోసం బాలు అడుగుతుంటే మనోజ్‌ను చూసి వీడే ఐదు వందల కోసం నొక్కి ఉంటాడని బాలు అంటాడు.
మీనా వచ్చి ఫోన్ అక్కడే ఉందని ఇస్తుంది. రవి ఉన్న సూపర్ మార్కెట్‌లోకి నీతూ వస్తుంది. రెస్టారెంట్‌లో అన్ని ఓల్డ్‌గా ఉన్నాయని డిషెస్ చూస్తారు అని నీతూ అంటుంది. ఇద్దరు కలిసి ప్లేట్స్ చూస్తారు. అక్కడికి శ్రుతి తల్లి శోభన వస్తుంది. వాళ్లిద్దరిని చూసి ఎవరామ్మాయి అని డౌట్ పడుతుంది శోభన. అత్తను చూసిన రవి వెళ్లి పలకరిస్తాడు.
నీతూతో రవిని చూసిన శోభన
ఇంతలో నీతూ వచ్చి బేబీ అంటూ ప్లేట్స్ గురించి అడుగుతుంది. ఏదో లవర్‌ను పిలిచినట్లు పిలుస్తుందేంటీ అని శోభన అనుకుంటుంది. నీతూని తన బాస్ అని పరిచయం చేస్తాడు రవి. రవిని తీసుకెళ్తుంది నీతూ. ఇది అల్లుడిని వలలో వేసుకునేలా ఉంది. జాగ్రత్తగా ఉండమని శ్రుతికి కాల్ చేసి డబ్బింగ్ స్టూడియోకు వెళ్తుంది శోభన.
మరోవైపు శివ మార్పు గురించి పార్వతి, సుమతి సంతోషిస్తారు. ఇంతలో మీనా వస్తుంది. శివకు ఐదు వందలు ఇస్తుంది మీనా. అవి తీసుకుని శివ ఫ్రెండ్ బైక్‌పై వెళ్లిపోతాడు. ఇంతలో ఒకావిడ వచ్చి తన కూతురుకు కవలలు పుట్టారని, ఇంట్లో బొమ్మలకొలువు పెట్టినందుకే పిల్లలు పుట్టారని చెబుతుంది.
నువ్వు కూడా బొమ్మల కొలువు పెట్టొచ్చుగా అని మీనాతో అంటాడు పంతులు. తనకు ఈ మధ్య ఏం బాగుండట్లేదు అని పార్వతి అంటే.. బొమ్మల కొలువు పెట్టు. నీకు కూడా పిల్లలు కలుగుతారు అని పంతులు నమ్మకంగా చెబుతాడు.
మీనా బొమ్మల కొలువు
దాంతో మీనా ఆలోచిస్తుంది. పార్వతి, సుమతి కూడా పెట్టమంటారు. ఆయనకు చెబుతాను. ఓకే అంటే పెడతాను అని మీనా అంటుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

E-Paper












