గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బావబామ్మర్దులను చంపేందుకు గుణ స్పాట్- రోహిణితో కలిసి ప్లాన్- గతం మర్చిపోయిన మీనా!

గుండె నిండా గుడి గంటలు ఫిబ్రవరి 17 ఎపిసోడ్‌లో కొట్టినందుకు పగ తీర్చుకోవాలని బాలు, శివ ఇద్దరిని చంపేందుకు స్పాట్ పెట్టాలని గుణ అంటాడు. ఇంతలో రోహిణి వచ్చి దినేష్ గురించి హెల్ప్ అడుగుతుంది. దానికి బదులుగా శివ దొంగతనం గురించి చెప్పి వీడియో తీసుకురమ్మని చెబుతాడు గుణ. రోహిణి ఒప్పుకుంటుంది.

Feb 17, 2026, 13:00:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో మీనా తలకు దెబ్బ తగలడంతో తానే వంట చేస్తానని వంట గదిలోకి వెళ్తుంది ప్రభావతి. అది చూసి సత్యం, బాలు, మీనా అంతా ఆశ్చర్యపోతారు. కిచెన్ మొత్తం మార్చేసిందని అనుకుంటుంది ప్రభావతి.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఫిబ్రవరి 17 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఫిబ్రవరి 17 ఎపిసోడ్‌

మీనానే పిలుస్తూ

ఉప్పు, కారం ఎక్కడ పెట్టావంటూ మీనాను పిలుస్తూనే ఉంటుంది ప్రభావతి. దాంతో బాలు వెళ్లి ఈ మాత్రం దానికి వంట చేస్తానని రావడం ఎందుకు అంటాడు. మా అమ్మ అరిచి గీ పెట్టిన బయటకు రావొద్దని మీనాను తీసుకెళ్తాడు బాలు. మరోవైపు రెండు చేతులకు కట్టులతో ఉంటాడు గుణ.

ఇన్నాళ్లు నేను ఇచ్చిన డబ్బులు తీసుకుని నాతోనే గొడవ పెట్టుకుని వెళ్లాడురా శివ గాడు. పైకి పంపించాలి. బావ బామ్మర్దులిద్దరికి స్పాట్ పెట్టాలని గుణ అంటాడు. ఇంతలో రోహిణి వచ్చి డబ్బు కాదు హెల్ప్ అడుగుతుంది. దినేష్ మళ్లీ వచ్చి లక్షల్లో అడుగుతున్నాడని, ఇంకోసారి వాడు నా వైపు రావొద్దని, ఎంత డబ్బు అయిన ఇస్తాను అని రోహిణి అంటుంది.

మీకోసం నేను డబ్బు తీసుకోకుండా చేస్తాను. కానీ మీరు నాకు ఒక చిన్న పని చేసి పెట్టాలని గుణ అంటాడు. బాలు మీ మరిదే కదా. ఇంతకుముందు మీ అత్తగారు రోడ్డు మీద వెళ్తుంటే ఎవరో డబ్బులు కొట్టేశారు కదా. ఆ దొంగతనం చేసింది ఎవరో కాదు మీనా తమ్ముడు శివ. మీ అత్త దొంగ అని ముద్ర వేసినందుకు అలా చేశాడు. అది తెలిసి శివ చేయి విరగగొట్టాడు బాలు అని గుణ.. శివ గుట్టు రట్టు చేస్తాడు.

వీడియో తీసుకురా

మీరు చెప్పిన దినేష్ గాడి సంగతి నేను చూసుకుంటా. శివగాడు దొంగతనం చేసిన వీడియో బాలు ఫోన్‌లో ఉంది. అది తీసుకొచ్చి ఇవ్వు. నేను మీ పర్సనల్ విషయం అడగకూడదంటే ఇది చేయాలని గుణ కండిషన్ పెడతాడు. సరే అని వెళ్లిపోయిన రోహిణి విద్యను కలిసి అంతా చెబుతుంది. గుణ చెప్పింది చేస్తేనే దినేష్ గోల, బాలు గోల తప్పుతుందని రోహిణి అంటుంది.

అది కాకుండా బాలుకు నీ గతం గురించి చెబితే అర్థం చేసుకుని సహాయం చేస్తాడేమోనే అని విద్య సలహా ఇస్తుంది. సీక్రెట్స్ తెలిస్తే పులి నోట్లో తల పెట్టినట్లే. శివ వీడియో సంపాదించి వాడి నిజ స్వరూపం బయటపెట్టాలని రోహిణి అంటుంది. మరోవైపు శ్రుతి, రవి మీనాను చూసి బాలుని తిడతారు. స్కూటీ మీద నుంచి పడిందని బాలు అంటాడు.

ఇవాళ అమ్మ వంట చేసింది. మీకు కూడా కష్టాలు వచ్చాయని బాలు అంటాడు. మీనాను లేపి జావా ఇస్తాడు బాలు. ఎవరు మీరు, మీరెవరు, నేనెవరు అని గతం మర్చిపోయినట్లు మీనా అంటుంది. నా పేరు ఏంటి, ఇక్కడే ఎక్కడో పెట్టానంటుంది మీనా. దెబ్బకు గతం మర్చిపోయినట్లుందని బాలు కంగారుపడతాడు. నేను నీ మొగుడుని, ముళ్లకంపను, నువ్వు నా పూలగంపవు అని బాలు అంటాడు.

జోక్ చేసిన మీనా

బాలు కంగారు చూసి నవ్వి జోక్ చేసినట్లు చెబుతుంది మీనా. ట్యాబ్లెట్స్ వేసుకుంటుంది మీనా. శివ నాకు మాటిచ్చాడని, మారుతాడని మీనా అంటుంది. రాజేష్ విషయంలో చెప్పింది విననందుకు సారీ చెబుతాడు బాలు. మీనాను ప్రేమగా చూసుకుంటాడు బాలు. మరోవైపు నీలకంఠ ఇంటికి రాజు అనే పొలిటిషియన్ వచ్చి మనవడి బారసాలకు ఇన్వైట్ చేస్తాడు.

మౌనిక వచ్చి కాఫీ ఇస్తే మెచ్చుకుంటాడు రాజు. మీరెప్పుడు వారసుడుని ఇస్తారని రాజు అంటే సంజుకు పొలమారుతుంది. రాజు వెళ్లిపోతాడు. మీకు ఇంకా పిల్లలు పుట్టడం లేదేంట్రా అని నీలకంఠ అడుగుతాడు. పిల్లల గురించి ఎందుకు అడుగుతున్నారు. నీ పెళ్లాన్ని ఇంట్లోంచి గెంటేసే అవకాశం వచ్చింది. తనకు పిల్లలు పుట్టట్లేదని పంపించేయ్ అని ప్లాన్ చెబుతాడు నీలకంఠం. అలా మౌనిక ఆపదలో పడుతుంది.

మీనా బాగోగుల గురించి రవి, శ్రుతి ప్రేమగా అడుగుతారు. ఇంతలో ప్రభావతి వస్తుందని తెలిసి కోప్పడినట్లు బిహేవ్ చేస్తారు రవి, శ్రుతి. అందుకే నేను వంట చేశాను అని ప్రభావతి అంటుంది. ఇంతలో రోహిణి వచ్చి ఏమైందని అడిగితే యాక్సిడెంట్ గురించి సత్యం చెబుతాడు. ప్రభావతిని రోహిణి పొగిడితే బాలు సెటైర్లు వేస్తాడు.

బాలు కౌంటర్లు

మీనా, బాలుకు టైమ్ బాలేదని, మీనాకు బ్యాడ్ జరుగుతుందని స్వామిజీ చెప్పాడని రోహిణి అంటుంది. దాంతో మీ నాన్న జైలు నుంచి వస్తాడని చెప్పాడా అని కౌంటర్లు వేస్తాడు బాలు. తర్వాత నా చేతి వంట తిని ఇన్నాళ్లు ఆ మీనా వంట తిన్నందుకు బాధపడాలని ప్రభావతి అనుకుంటుంది. తినడానికి అందరిని ప్రభావతి ఎంత అరిచిన ఎవరు రారు.

దాంతో ప్లేట్ పట్టుకుని సౌండ్ చేస్తుంది ప్రభావతి. అంతా వస్తారు. అందరి అదృష్టం పరీక్షించుకుందామని బాలు అంటాడు. ఇంటి పని మనిషి లీవ్ పెట్టిందా అని మనోజ్ అంటాడు. దాంతో ప్లేట్‌తో కొడతాడు బాలు. అలా అన్నందుకు తినాల్సిందేనని సత్యం అంటాడు. అందరూ తినకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారు.

రోహిణి మాత్రం సపోర్ట్ చేస్తూ తింటుంది. నోట్లో పెట్టుకుని అదోలా ఫేస్ పెడుతుంది. పైకి మాత్రం చాలా బాగుందని అంటుంది రోహిణి. ఇదేదో విషప్రయోగంలా ఉందమ్మ అని మనోజ్ అంటాడు. నీ ఐదోతనం సాక్షిగా నాకు చాలని సత్యం ఎస్కేప్ అవుతాడు. బాలు కూడా వెళ్లిపోతాడు. మనోజ్‌కు బలవంతంగా వడ్డిస్తుంది ప్రభావతి.

సత్యం, ప్రభావతి రొమాన్స్

దమ్ముంటే ఒకే ఒక్క ముద్ద నువ్వు తిను అని మనోజ్ అంటాడు. అది తిన్న ప్రభావతి మెలికలు తిరుగుతూ కాసేపు ఆగి ఒకేసారి కారం అని గట్టిగా అరుస్తుంది. నీళ్ళు తాగిన చల్లారదు. తర్వాత పడుకున్న సత్యం దగ్గరికి వెళ్లి రొమాంటిక్‌గా పిలుస్తుంది. కానీ, సత్యం మాత్రం హడలెత్తిపోతాడు. మీకోసం స్వీట్ చేసి తీసుకొచ్చానని ఇస్తుంది ప్రభావతి.

స్వీట్ వద్దని, ప్రభావతి వంట గురించి నిజాలు చెబుతాడు సత్యం. బలవంతం పెట్టకంటాడు. సత్యం బుగ్గ మీద గిల్లి పేరు పెట్టి పిలిచి రొమాంటిక్‌గా అడుగుతుంది. దాంతో కరిగిపోయిన సత్యం రొమాంటిక్‌గా తింటానంటాడు. నీలాగే కాస్తా స్వీటుగా, ఘాటుగా ఉంది పబ్బి అని సత్యం రొమాంటిక్‌గా అంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More