గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: రోహిణి గతంపై మనోజ్, ప్రభావతి చేతికి లెటర్.. చింటుని దత్తత తీసుకోమన్న ప్రభావతి
గుండె నిండా గుడి గంటలు బుధవారం (ఫిబ్రవరి 4) ఎపిసోడ్ లో చింటుని ఎట్టి పరిస్థితుల్లోనూ దత్తత తీసుకోకుండా రోహిణి ప్రయత్నాలు మొదలుపెడుతుంది. అయితే ఆమె గతంపై ఓ వ్యక్తి మనోజ్ చేతికి ఓ లెటర్ ఇచ్చి వెళ్తాడు.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 612వ ఎపిసోడ్ లో ట్విస్టుల మీద ట్విస్టుల ఉన్నాయి. చింటు దత్తత కోసం బాలు, మీనా ప్రయత్నించడం, దానికి అడ్డుకట్ట వేయడానికి రోహిణి ప్రయత్నాలు, ప్రభావతి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఈ ఎపిసోడ్ లో చూడొచ్చు.

సుగుణ దగ్గరికి బాలు, మీనా..
గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (ఫిబ్రవరి 4) ఎపిసోడ్ సుగుణ దగ్గరికి బాలు, మీనా వెళ్లే సీన్ తో మొదలవుతుంది. ఆమె ఆరోగ్యం గురించి తెలుసుకొని వాళ్లు ఆందోళన చెందుతారు. ఎందుకు చెప్పలేదని నిలదీస్తారు. చింటు గురించి ఆరా తీస్తే సుగుణ అబద్ధం చెబుతుంది. వాడిని బంధువుల ఇంటికి పంపించానని, ఇక అక్కడే ఉంటాడని అంటుంది. ఆ విషయం తెలిసి బాలు, మీనా బాధపడతారు.
చింటుని దత్తత తీసుకుంటామన్న మీనా..
అదే సమయంలో చింటుని దత్తత తీసుకుంటామని సుగుణతో మీనా చెబుతుంది. అతనికి తండ్రి లేడు.. తల్లి ఉన్నా లేనట్లే.. తాము అతని బాధ్యత తీసుకుంటామని బాలు అంటాడు. సుగుణ చాలా సంతోషిస్తుంది. కానీ ఈ విషయం కల్యాణికి తెలిస్తే గొడవ అవుతుందని భయపడుతుంది.
తన తర్వాత చింటు పరిస్థితి ఏమవుతుందో అని ఆందోళన చెందానని, ఆ దేవుడు మీ రూపంలో పంపించాడని సుగుణ అంటుంది. అయితే ఈ విషయం తన కూతురిని అడిగి చెబుతానని అంటుంది. సరే అని వాళ్లు వెళ్లిపోతారు.
రోహిణికి సుగుణ ఫోన్.. నోటికొచ్చినట్లు మాట్లాడిన కూతురు
ఆ వెంటనే రోహిణికి సుగుణ ఫోన్ చేసి బాలు, మీనా వచ్చిన విషయం చెబుతుంది. చింటుని దత్తత తీసుకుంటామని మరోసారి అడిగారని అంటుంది. అనుకున్నాను.. నువ్వు మాత్రం వాళ్లను తిట్టి పంపించావు కదా అని రోహిణి అడుగుతుంది.
తానెలా తిడతానని, వాళ్లు చింటు పట్ల నీకన్నా బాధ్యతగా ఉన్నారని, ఆ ఇంటికి వస్తే నీ కళ్ల ముందే చింటు ఉంటాడు కదా అని చెబుతుంది. అది విని రోహిణి మండిపడుతుంది. నీకు ఇప్పుడు నా కొడుకు భారమయ్యాడా.. వదిలించుకుందామని చూస్తున్నావా.. నా ఇంటికి వచ్చి వాడు నన్ను అమ్మ అని పిలిస్తే పరిస్థితి ఏంటి అని రోహిణి నానా మాటలు అంటుంది.
ప్రభావతిని రెచ్చగొట్టాలని చూసిన రోహిణి
ఇక లాభం లేదనుకొని తన అత్త ప్రభావతిని రెచ్చగొట్టడానికి రోహిణి వెళ్తుంది. బాలు, మీనా ఆ చింటుని దత్తత తీసుకోవడానికి వెళ్లారని చెబుతుంది. అలా జరగకుండా చూడాలని, వాళ్లు అతన్ని దత్తత తీసుకోకూడదని రోహిణి అంటుంది.
ప్రభావతి మాత్రం రివర్స్ అవుతుంది. వాళ్లు దత్తత తీసుకుంటే తీసుకోని.. వాళ్లకే ఇక్కడ గతి లేదు.. అతన్ని సాకుగా చూపించి ముగ్గురినీ ఇంట్లో నుంచి గెంటేస్తానని ప్రభావతి అనడంతో రోహిణి షాక్ తింటుంది. అదే జరిగితే చింటు కూడా రోడ్డున పడతాడు.. మరో ప్లాన్ ఆలోచించాలని అనుకుంటుంది.
చింటు కోసం కొత్త స్కూల్.. దత్తత తీసుకోవాలన్న విద్య
చింటుని బాలు, మీనా దత్తత తీసుకోకుండా ఉండాలంటే వాళ్లను ఊరి నుంచి తీసుకురావడమే పరిష్కారమని భావించిన రోహిణి ఓ కొత్త స్కూల్ చూస్తుంది. విద్యతో కలిసి వెళ్తుంది. ఇదంతా ఎందుకే.. చింటుని నువ్వే దత్తత తీసుకోవచ్చు కదా.. అప్పుడు వాడు ఇంట్లోనే నిన్ను అమ్మ అని పిలిచినా ఎవరూ ఏమీ అనరు కదా అని విద్య అంటుంది. కానీ అందుకు మనోజ్ అంగీకరించడని రోహిణి చెబుతుంది.
వాళ్లను ఇక్కడికి తీసుకురావడమే మంచిది.. ఇక్కడ బాలు, మీనా కంటపడకుండా చూసుకుంటానని రోహిణి అంటుంది. మధ్యలో అయినా స్కూల్లో సీటు ఇస్తారా అని స్కూలు వాళ్లను అడిగితే ఇస్తామని వాళ్లు చెబుతారు. దీంతో అందుకు రోహిణి ఏర్పాట్లు చేసి అదే విషయం సుగుణకు ఫోన్ చేసి చెబుతుంది. ఆమె చాలా సంతోషిస్తుంది.
ఇటు హాల్లోనే బాలు, మీనా రొమాన్స్ కు రెడీ అవుతుంటారు. అటు మేడ మీద ప్రభావతికి మనోజ్ మరో షాకిస్తాడు. రోహిణి గతం గురించి ఎవరో తనకు లెటర్ ఇచ్చి వెళ్లారని చెబుతాడు. మరో లెటరా అని ఆమె షాక్ తింటుంది. రోహిణిని పిలిచి ఆ లెటర్ చూపిస్తే ఇది దినేష్ చేసిన పనే కావచ్చని ఆమె ఆందోళన చెందుతుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


