యశ్‌తో శృంగార సీన్- ఇన్‌స్టా‌గ్రామ్ అకౌంట్ డిలీట్ చేసిన నటి- టాక్సిక్ టీజర్ దుమారం!

కన్నడ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’ టీజర్‌లోని ఒక శృంగార సన్నివేశం వివాదాస్పదమైంది. మహిళా సంఘాల ఫిర్యాదులతో ఈ విషయం దుమారం రేగగా, ఆ సన్నివేశంలో నటించిన బ్రెజిల్ మోడల్ బీట్రిజ్ టౌఫెన్‌బాచ్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్‌ను డిలీట్ చేసింది. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.

Jan 14, 2026, 10:39:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఒక్క శృంగార సీన్ ఎంత పనిచేసింది అని అనుకుంటున్నారు నెటిజన్స్. హీరోతో చేసిన సెక్స్ సీన్ నటి జీవితాన్నే మార్చేసింది. అయితే, అది ఆమెను సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండకుండా కూడా చేసేసింది.

యశ్‌తో శృంగార సీన్- ఇన్‌స్టా‌గ్రామ్ అకౌంట్ డిలీట్ చేసిన నటి- టాక్సిక్ టీజర్ దుమారం!
యశ్‌తో శృంగార సీన్- ఇన్‌స్టా‌గ్రామ్ అకౌంట్ డిలీట్ చేసిన నటి- టాక్సిక్ టీజర్ దుమారం!

ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది టాక్సిక్ సినిమా గురించే. కేజీఎఫ్ స్టార్ యశ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రమే ఈ ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. లేడి డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన టాక్సిక్ టీజర్ విడుదలై సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

ఒక్క సీన్‌తో

అయితే ఈ టాక్సిక్ టీజర్‌లో శ్మశానం వెలుపల కారులో చిత్రీకరించిన హీరో యశ్‌తో చిత్రీకరించిన శృంగార సీన్ ఇప్పుడు తీవ్ర వివాదాలకు దారితీసింది. టాక్సిక్ టీజర్ విడుదలైనప్పటి నుంచి ఆ సన్నివేశంలో యశ్‌తో కలిసి నటించిన నటి ఎవరనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

మొదట ఆమె నటాలీ బర్న్ అని ప్రచారం జరిగినప్పటికీ, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ స్పందిస్తూ ఆ బ్యూటీ బ్రెజిల్ నటి బీట్రిజ్ టౌఫెన్‌బాచ్ అని పరిచయం చేశారు. అయితే, ఆ ఒక్క సెక్స్ సీన్‌తో టాక్సిక్ టీజర్‌పై దుమారం రేగింది.

ఆ దృశ్యంపై నెటిజన్ల నుంచి విమర్శలు రావడంతో బీట్రిజ్ టౌఫెన్‌బాచ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను డిలీట్ చేసేసింది. ప్రస్తుతం ఆమె ప్రొఫైల్ కోసం వెతికితే ‘పేజీ అందుబాటులో లేదు’ అని చూపిస్తోంది. దీంతో కారులో యశ్‌తో శృంగార సీన్ నటి బీట్రిజ్ జీవితాన్నే మార్చేసిందని నెటిజన్స్ అనుకుంటున్నారు.

మహిళా కమీషన్‌కు ఫిర్యాదు

టాక్సిక్ టీజర్‌లోని అశ్లీలతపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మహిళా విభాగం కర్ణాటక రాష్ట్ర మహిళా కమీషన్‌కు ఫిర్యాదు చేసింది. "ఈ టీజర్‌లోని అశ్లీల దృశ్యాలు మహిళల గౌరవానికి భంగం కలిగిస్తున్నాయి. కన్నడ సంస్కృతిని కించపరిచేలా ఉన్న ఈ టీజర్‌ను వెంటనే తొలగించాలి" అని ఆప్ రాష్ట్ర కార్యదర్శి ఉషా మోహన్ డిమాండ్ చేశారు.

దీనిపై స్పందించిన మహిళా కమీషన్, తగిన చర్యలు తీసుకోవాలని సెన్సార్ బోర్డుకు (CBFC) లేఖ రాసింది. మరోవైపు సామాజిక కార్యకర్త దినేష్ కల్లహళ్లి కూడా అభ్యంతరకర దృశ్యాలపై సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. ఇలా ఆ ఒక్క సీన్‌తో టాక్సిక్ వివాదంలో చిక్కుకుంది. చివరికి నటి బీట్రిజ్ సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పేవరకు దారి తీసింది.

Beatriz Taufenbach has deleted her Insta account.
Beatriz Taufenbach has deleted her Insta account.

కియారా అద్వానీ-నయనతార

ఇకపోతే ‘టాక్సిక్’ సినిమాకు యశ్ స్వయంగా కథను అందించారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషి, రుక్మిణి వసంత్, తార సుతారియా వంటి అగ్ర తారలు నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన టాక్సిక్ మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More