వాళ్లు తీస్తే బూతు.. మీరు తీస్తే సినిమానా.. టాక్సిక్ టీజర్‌పై వస్తున్న విమర్శలపై స్పందించిన డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్
యశ్ నటిస్తున్న టాక్సిక్ మూవీ టీజర్ పై ఇప్పటికీ సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. ఇందులో చాలా బోల్డ్ సీన్ ఉండటంపై మహిళా డైరెక్టర్ అయిన గీతూ మోహన్‌దాస్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆమె వాటిపై సెటిరికల్ గా స్పందించింది.
యశ్ లేటెస్ట్ సినిమా 'టాక్సిక్' టీజర్‌లోని ఓ ఇంటిమేట్ సీన్‌పై రేగిన దుమారానికి దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ చెక్ పెట్టింది. "స్త్రీల ఆనందం, సమ్మతి గురించి జనం ఇంకా చర్చిస్తూనే ఉన్నారు.. నేను మాత్రం చిల్ అవుతున్నా" అంటూ విమర్శలకు ఘాటుగా బదులిచ్చింది. దీనిపై ఆర్జీవీ ప్రశంసలు కురిపించగా.. సోషల్ మీడియాలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.

టాక్సిక్ టీజర్ ఇలా..
రాకింగ్ స్టార్ యశ్ పుట్టినరోజు కానుకగా జనవరి 8న విడుదలైన 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' (Toxic: A Fairy Tale for Grown-Ups) టీజర్ సోషల్ మీడియాను కుదిపేస్తోంది. అయితే ఇందులో యశ్ కనిపించిన తీరు కంటే.. టీజర్‌లో చూపించిన ఒక బోల్డ్ సీన్ పైనే ఇప్పుడు రచ్చ జరుగుతోంది.
బయట తుపాకుల మోత మోగుతుండగా.. కారులో హీరో రాయ (యశ్), ఓ యువతితో శృంగారంలో పాల్గొంటున్నట్లు చూపించిన షాట్ తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ఎట్టకేలకు మౌనం వీడింది. అయితే ఆమె సెటైరికల్ గా రియాక్ట్ అయింది.
నేను 'చిల్' అవుతున్నా: గీతూ మోహన్‌దాస్
టాక్సిక్ మూవీ టీజర్ విడుదలైనప్పటి నుంచి వస్తున్న విమర్శలకు ఆమె తనదైన శైలిలో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా బదులిచ్చింది. "మహిళల ఆనందం, వారి సమ్మతి, వ్యవస్థలతో స్త్రీలు ఆడుకోవడం.. వీటన్నింటిని జనం ఇంకా అర్థం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు.. నేను మాత్రం చిల్ అవుతున్నా" అంటూ ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది.
ఆ సీన్ కేవలం శృంగారం కాదని, అది స్త్రీల స్వేచ్ఛకు, వారి అనుభవాలకు అద్దం పట్టే అంశమని ఆమె చెప్పకనే చెప్పింది. అంతేకాకుండా ఆ సీన్ లో ఉన్న యువతి పేరు బీట్రిస్ బాచ్ అని, ఆమెను తన "సిమెట్రీ గర్ల్" అని గీతూ పరిచయం చేసింది.
అక్కడ చేస్తే బూతు అంటారు..
టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. గతంలో సినిమాల్లో మహిళలను అశ్లీలంగా చూపించడంపై, సెక్సిజంపై గీతూ మోహన్‌దాస్ చాలా గట్టిగా గళం వినిపించింది. "మరి ఇప్పుడు సొంత సినిమాలో ఆ పని ఎందుకు చేశారంటూ" కొందరు ఆమెను ప్రశ్నిస్తున్నారు.
ఇది ఆమె ద్వంద్వ వైఖరి (Hypocrisy) అని, కొత్తదనం పేరుతో పాత మూస దృశ్యాలనే చూపించారని మరికొందరు విమర్శిస్తున్నారు. అయితే ఆమె అభిమానులు మాత్రం.. ఇది "పెద్దల కోసం తీసిన సినిమా" అని, దర్శకురాలి సృజనాత్మక స్వేచ్ఛను గౌరవించాలని సమర్థిస్తున్నారు.
వేదాంత్ కౌశిక్ అనే ఓ యూట్యూబర్ అయితే దీనిపై మరింత ఘాటుగా స్పందించాడు. భోజ్‌పురిలో ఇదే తీస్తే బూతు అంటారు.. మీరు తీస్తే సినిమానా అంటూ ట్వీట్ చేశాడు.
టాక్సిక్ సినిమా గురించి..
గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాను కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. యశ్ సరసన నయనతార, హుమా ఖురేషి, కియారా అద్వానీ, తారా సుతారియా వంటి భారీ తారాగణం ఇందులో ఉంది. కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇతర భారతీయ భాషల్లోకి డబ్ చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మార్చి 19న విడుదల కానుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


