గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: నువ్వు కూడా డాడీ ఫ్రెండ్‌తో వెళ్లావుగా- తల్లితో శ్రుతి- మీనాను ఇరికించిన ప్రేమ్!

గుండె నిండా గుడి గంటలు ఫిబ్రవరి 20 ఎపిసోడ్‌లో రవితో నీతూను చూశానని, అలాంటి వాళ్లు రవిని మార్చేస్తారని శ్రుతితో తల్లి శోభన చెబుతుంది. నువ్వు కూడా డాడీ ఫ్రెండ్‌తో షాపింగ్‌కు వెళ్లావుగా అని షాక్ ఇస్తుంది శ్రుతి. ప్రభావతి ముందు మీనాను ప్రియురాలితో ఇరికిస్తాడు ప్రేమ్. దాంతో మీనాను అత్త తిడుతుంది.

Feb 20, 2026, 09:08:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో డబ్బింగ్ స్టూడియోలో శ్రుతి డబ్బింగ్ చెబుతుంది. తనతోపాటు మరొకరు చెబుతారు. ఇద్దరు భర్త, కాపురం, మరో అమ్మాయితో తిరగడం గురించి డబ్బింగ్ ఉంటుంది. ఇంతలో శోభన వస్తుంది. శ్రుతి వెళ్లి మాట్లాడుతుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఫిబ్రవరి 20 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఫిబ్రవరి 20 ఎపిసోడ్‌

డాడీ ఫ్రెండ్‌తో వెళ్లావుగా

ఇప్పుడు నువ్వు చెప్పిన డైలాగే నీ జీవితానికి సంబంధించేలా ఉందని, సూపర్ మార్కెట్‌లో మరో అమ్మాయితో రవిని చూశానని శోభన చెబుతుంది. ఇద్దరు కలిసి ప్లేట్స్ చూస్తున్నారు. అది నాకు ముందే రవి చెప్పాడు అని శ్రుతి అంటుంది. ఆ అమ్మాయి వాలకం బాగోలేదు. నలుగురు చూస్తే బాగుండదు. అలాంటి అమ్మాయిలు రవి లాంటి మంచోళ్లను మార్చేస్తారే అని శోభన అంటుంది.

రవి అలా కాదు. నువ్వు కూడా డాడీ ఫ్రెండ్‌ ఒకాయనతో షాపింగ్‌కు వెళ్లావు కదా దాని గురించి నేను ఎప్పుడైనా ఏమైనా మాట్లాడానా అని రివర్స్‌లో తల్లినే అంటుంది శ్రుతి. దానికి షాక్ అయిన శోభన అతను మన ఫ్యామిలీ ఫ్రెండ్. పైగా నాకంటే చిన్నవాడు అని అంటుంది. తప్పు చేయడానికి వయసుతో సంబంధం లేదు. చేయాలనుంటే చాలు. నేను నిన్ను తప్పు పట్టట్లేదు అని శ్రుతి అంటుంది.

అల్లుడును కంట్రోల్‌లో పెట్టకు. ఆ అమ్మాయి కొత్త బ్రాంచ్‌లు పెడుతుందట. అల్లుడు కొత్త బ్రాంచ్ పెట్టకుండా చూసుకో అని హెచ్చరిస్తుంది శోభన. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మోసుకెస్తే స్టూడియోలకు రానివ్వొద్దని చెబుతానని వెళ్లిపోతుంది శ్రుతి. మరోవైపు మీనాను వెనుక నుంచి బాలు పట్టుకుంటాడు. వెంటనే బాలును కత్తితో పొడవబోతుంది మీనా.

బొమ్మల కొలువు గురించి

నేనే అని బాలు ఆపుతాడు. దొంగ అనుకున్నాని మీనా అంటుంది. బొమ్మల కొలువు గురించి బాలుకు మీనా చెప్పి పెడదామంటుంది. సరేనని బాలు అంటాడు. వెళ్లి శ్రుతితో చెప్పు తనే మా అమ్మను ఒప్పిస్తుందని బాలు అంటాడు. ఇప్పుడు మేమిద్దరం గొడవ పడుతున్నాం కదా అని మీనా అంటుంది. అయితే మా నాన్నే ఆవిడను ఒప్పిస్తాడని సత్యం దగ్గరికి వెళ్తారు ఇద్దరు.

మీనా బొమ్మల కొలువు పెట్టాలనుకుంటుందని, నాన్న నువ్వే ఒప్పించాలని చెబుతాడు బాలు. ఇంతలో అంతా వస్తారు. ప్రభావతితో మీనా బొమ్మల కొలువు గురించి సత్యం చెబుతాడు. ఇంటికి వారసులు వస్తారని సత్యం అంటాడు. అయితే, రోహిణితో ముందు పెట్టిద్దామని ప్రభావతి అంటుంది. ఎవరైనా వారసులేగా అని సత్యం అంటాడు.

పాటలు పాడాలి రోజు అని ప్రభావతి అంటుంది. నువ్వు బాగా పాడుతావుగా పబ్బి, పెళ్లి చూపుల రోజు నాడు పాడావుగా మెచ్చుకుంటాడు సత్యం. దాంతో పొంగిపోయిన ప్రభావతి బొమ్మల కొలువు పెట్టేందుకు ఒప్పుకుంటుంది. తర్వాత అమ్మ వీక్ పాయింట్ పట్టుకుని భలే లాగావు నాన్న అని బాలు అంటాడు. బొమ్మల కొలువు రోజు మీరు ఎవరిని ఏమనొద్దు అని మీనా అంటుంది.

దాంతోపాటు యాగం కూడా

సుశీలకు చెబుదామని బాలు అంటుంటే.. సత్యం వచ్చి కాల్ చేస్తాడు. బొమ్మల కొలువు గురించి సత్యం చెబుతాడు. దాంతోపాటు ఒక యాగం కూడా చేయాలని ఊరిలో పంతులు చెప్పాడని, కీడు ఏదైనా ఉంటే పోతుందని, సంతానం కలుగుతుందని సుశీల చెబుతుంది. మౌనికను, వాళ్ల ఆయన్ను రమ్మని చెప్పండి. అంతా కలిసి యాగం చేయాలని సుశీల అంటుంది.

మరోవైపు కామాక్షితో బొమ్మల కొలువు గురించి చెప్పి ఏదైనా స్థలం ఉంటే చెప్పు అని అడుగుతుంది ప్రభావతి. సరేనని కామాక్షి చెబుతుంది. మరోవైపు తన లవర్‌పై చేతులు వేసి రొమాంటిక్‌గా ప్రేమ్ ఉంటాడు. అది మీనా చూసి ఇద్దరిని తిడుతుంది. పవిత్రమైన డ్యాన్స్ స్కూల్‌లో ఏంటిది అని మీనా వార్నింగ్ ఇస్తుంది.

దాంతో ప్రేమ్ రివర్స్ ప్లాన్ వేస్తాడు. లవర్ ఏడుస్తూ వెళ్లి మీనా అనవసరంగా తిట్టిందని ప్రభాతికి చెబుతుంది. మీనా ఊరికే తిట్టదని కామాక్షి అంటుంది. వీళ్లు చనువుగా ఉన్నారని మీనా అంటుంది. డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే తిట్టిందని అమ్మాయి చెబుతుంది. దాంతో మీనాను తిడుతుంది. దానికి ఏదో ఒకరోజు ఇది మీ మెడకే చుట్టుకుంటుంది జాగ్రత్త అని వెళ్లిపోతుంది మీనా.

చిల్లి గవ్వ ఇవ్వొద్దు

ప్రభావతిని మాటలు అనేసి వెళ్లిపోతుంది కామాక్షి. మరోవైపు బాలు బొమ్మలు తీసుకొస్తాడు. మనోజ్ వచ్చి రోహిణిని బాలు బొమ్మల గురించి అడిగితే.. బొమ్మల కొలువు గురించి చెబుతుంది. దానికి మనోజ్ చిరాకుపడతాడు. వాళ్లు డబ్బులు అడిగితే చిల్లి గవ్వ ఇవ్వకని మనోజ్ అంటాడు. మూడు చీరలు కొనమని రోహిణి అడిగితే.. నా దగ్గర డబ్బులేవంటాడు మనోజ్.

నా దగ్గర రెండు ఉన్నాయి. ఒక్కటి కొనిస్తే చాలని రోహిణి అంటుంది. క్రెడిట్ కార్డ్‌తో పెట్టుకో అని మనోజ్ చెబుతాడు. మరోవైపు ఇది ఇంట్లో అందరికోసం చేస్తున్నది కాబట్టి అంతా డబ్బులు ఇవ్వాల్సిందే అని బాలు అంటాడు. మనోజ్ దగ్గరికి వెళ్లి ఐదు వేలు ఇవ్వమంటాడు బాలు. సరేనని రోహిణి డబ్బు ఇస్తానంటుంది. మరోవైపు రవి హిందీ పాటలు వింటుంటాడు.

అది శ్రుతి అడుగుతుంది. కారులో ఈ పాట విన్నాను. నచ్చింది మళ్లీ వింటున్నానని రవి చెబుతాడు. ఇద్దరు రవి, శ్రుతి వాదులాడుకుంటుంటే మీనా, బాలు వస్తారు. మేము చాలా బొమ్మలు కొన్నామని బాలు చెబితే.. రవి, శ్రుతి మీకు పిల్లలు పుట్టబోతున్నందుకు కంగ్రాట్స్ చెబుతారు. అది కాదని బొమ్మల కొలువు గురించి చెబుతారు బాలు, మీనా.

తోడి కోడళ్ల గొడవ

దాంతో రవి, శ్రుతి సరేనని డబ్బు ఇస్తారు. మరుసటి రోజు బాలు, మీనా బొమ్మలు పేర్చుతారు. ప్రభావతి రాగానే బాలు, మీనా-రవి, శ్రుతి గొడవ పెట్టుకుంటారు. అది చూసి ప్రభావతి సంతోషిస్తుంది. ప్రభావతిది మంచి మనసు అని శ్రుతి అంటుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More