నిన్ను కోరి ఫిబ్రవరి 19 ఎపిసోడ్: అత్తను చంపుతానన్న శ్రుతి-శోభనం ముహూర్తం-ఆశగా ఇంటికి వచ్చిన విరాట్ అప్‌సెట్-ముద్దు
నిన్ను కోరి సీరియల్ టుడే ఫిబ్రవరి 19 ఎపిసోడ్ లో అత్తను చంపేస్తానని శ్రుతి భయపెడుతుంది. విరాట్, చంద్రకళ శోభనం కోసం ముహూర్తం చూస్తారు. ఎల్లుండి రాత్రి బాగుందని పంతులు చెప్తాడు. ఆశతో ఇంటికి వచ్చిన విరాట్ ఈ విషయం తెలుసుకుని అప్ సెట్ అవుతాడు.
నిన్ను కోరి సీరియల్ టుడే ఫిబ్రవరి 19 ఎపిసోడ్ లో.. శ్రుతితో కామాక్షి ఫోన్లో మాట్లాడుతుంది. ఈ రోజు విరాట్, చంద్రకళకు శోభనం ఫిక్స్ చేస్తున్నారని తల్లి చెప్తే, ఇంకా వాళ్ల మధ్య శోభనం జరగలేదా? అని శ్రుతి అడుగుతుంది. ఆ చంద్ర అలా చెప్పి మాయ చేసిందని కామాక్షి అంటుంది.

చంపేస్తానన్న శ్రుతి
ఏ నిద్రలోనే దిండు ముఖం పెట్టి నొక్కేస్తాను, చంపేస్తానని సరోజాతో శ్రుతి అంటుంది. రాజ్ వచ్చాడని చూసి డ్రామా స్టార్ట్ చేస్తుంది. ఏడ్చుకుంటూ రెస్టారెంట్ కు తీసుకెళ్లమని అడుగుతుంది. రాజ్ సరేనంటాడు.
శోభనం ముహూర్తం
మరోవైపు విరాట్, చంద్రకళ శోభనం కోసం పంతులుతో ముహూర్తం పెట్టిస్తారు. శాలిని రాగానే శ్యామల సీరియస్ అవుతుంది. ఈవిడ గారు వారసుణ్ని ఇస్తున్నారని మురిసిపోయాం. కాలు కింద పెట్టకుండా చూసుకున్నాం. కానీ అవన్నీ డ్రామాలే అని శ్యామల అంటుంది. పంతులు ఎందుకు వచ్చారని చంద్రకళ వచ్చి అడుగుతుంది. కాసేపు ఆగితే తెలుస్తుందని శ్యామల చెప్తుంది.
వెయిట్ చేస్తామని
ఈ రోజు కుదరదండీ. రేపేమో శివరాత్రి, ఎల్లుండి రాత్రి 8 గంటలకు బాగుందని పంతులు చెప్తాడు. రాత్రి బాగుందంటున్నారు, ఇంతకీ ముహూర్తం దేనికి అని చంద్ర మళ్లీ అడుగుతుంది. ముహూర్తం మీ శోభనం కోసం. నువ్వు, మీ ఆయన మాట్లాడుకోవడం నేను విన్నానని శ్యామల చెప్తుంది. ఎల్లుండి దాకా వెయిట్ చేస్తామని చంద్ర అంటుంది.
విరాట్ అప్ సెట్
విరాట్ ఏమో మల్లెపూలు, స్వీట్లు తీసుకుని ఆశగా వస్తాడు. చంద్ర వెనకాల నుంచి వచ్చి హగ్ చేసుకుంటుంది. కానీ ఆమె రెడీ కాకపోవడం చూసి విరాట్ అప్ సెట్ అవుతాడు. నేను ప్రెషప్ అయి వస్తా రెడీగా ఉండమని విరాట్ అంటాడు. విధి నీతో ఆడుకుంటుంది బావ. ఈ రోజు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది బావ అని చంద్ర చెప్తుంది.
ముద్దు అయినా
ఇంట్లోవాళ్లు ఈ రోజు వద్దన్నారు. మనం మాట్లాడుకుంటుంటే శ్యామల పిన్ని వినేసింది. అత్తయ్యతో డిస్కస్ చేసి ముహూర్తం కూడా పెట్టించారని చంద్ర చెప్తుంది. ఎల్లుండి దాకా ఆగాలా? అని విరాట్ ఢీలా పడిపోతాడు. కనీసం ముద్దయినా ఇస్తావా అని విరాట్ అడిగితే, అత్తయ్యను అడిగొస్తానని చంద్ర అంటుంది. చంద్ర, వెనకాల విరాట్ బయటకు పరుగెత్తుతారు. బయటే శ్యామల ఉంటుంది. అమ్మాయి నువ్వు ఈ రోజు నా గదిలో పడుకో. ఏరా ఎల్లుండి దాకా పిచ్చివేషాలు వేశావంటేనా అని విరాట్ తో శ్యామల అంటుంది.
కడుపు మంట
అక్కడ నా కూతురు కష్టాలు పడుతుంటే, నువ్వు సంతోషంతో ఊగిపోతున్నావు. ఎవరి స్వార్థానికి వాళ్లు నా కూతురిని బలి పశువు చేశారని చంద్రతో కామాక్షి అంటుంది. జల్ రాజ్ ను నమ్మి శ్రుతి మోసపోయింది. నీకు నిజంగా ఏం చేయాలో తోచడం లేదు. అందుకే మీ బుర్ర పనిచేయడం లేదు. ఆరు నెలలు తీర్థయాత్రలకు వెళ్లు. నోర్మూసుకుని ఉండమని కామాక్షికి చంద్ర చెప్తుంది.
డ్రామాలు ఆపు
ఉదయం క్రాంతి టిఫిన్ చేయడానికి వచ్చి వదినను వడ్డించమని అడుగుతాడు. నేను వడ్డిస్తానని శాలిని అంటుంది. ఎందుకు ఇందులో ఏమన్నా కలిపావా? నా ముందు డ్రామాలు వేయడం మానుకో అని క్రాంతి సీరియస్ అవుతాడు. నన్ను ప్రేమించిన నువ్వు నన్ను క్షమించలేవా క్రాంతి అని శాలిని ఫీల్ అవుతుంది. నువ్వు ఇంట్లో ఉండటమే భరించలేకపోతున్నానని క్రాంతి అనడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

E-Paper












