నిన్ను కోరి ఫిబ్రవరి 14 ఎపిసోడ్: చంద్రకళ కాళ్లపై శాలిని, క్షమా భిక్ష-ఇక నుంచి లెక్క వేరన్న శ్యామల- వాలంటైన్స్ డే వేడుకలు
నిన్ను కోరి సీరియల్ ఫిబ్రవరి 14 ఎపిసోడ్‌లో నిజం బయటపడంతో శాలిని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అందరి కాళ్లపై పడుతుంది. దాంతో చంద్రకళ అవకాశం ఇస్తుంది. ఇక నుంచి శాలినికి చుక్కలే అని, లెక్క వేరేలా ఉంటుందని శ్యామల అంటుంది. ఇంట్లో వాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ చేస్తాడు రఘురాం. 3 జంటలు కేక్ కట్ చేయాలంటాడు.
నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో నిజం తెలిసిపోవడంతో కన్నీళ్లు పెట్టుకుంటూ డ్రామా చేస్తుంది శాలిని. క్రాంతి ప్రేమను వాడుకున్నాను కానీ క్రాంతి మీద ప్రేమ అబద్ధం కాదని, క్రాంతిని విడిచిపెట్టి ఉండలేనని, ఆడదంటే నీలా ఉండాలని, నేను ఓడిపోయానని అంటుంది శాలిని.

అందరి ప్రేమను పొందాలి
వదిన తనను వెళ్లమను. నా మనసు మారొచ్చు అని క్రాంతి అంటే.. అది నాకోసం మారొచ్చుగా. చంద్రలా అందరి ప్రేమను పొందాలని ఉంది. ప్రాణ భిక్ష పెట్టిన దేవత చంద్రకు రుణం తీర్చుకోవాలనుకుంటున్నానని శాలిని అంటుంది. కానీ, క్రాంతి వినడు. నేను మారానని నీకు తెలిసేలా చేసే వెళ్తాను అని గన్ తీసుకుని కాల్చుకోవాలనుకుంటుంది శాలిని.
కానీ, చంద్రకళ ఆపుతుంది. పశ్చాత్తాపం లేని బతుకు ఎందుకు, నేను మారానని ప్రూవ్ చేసుకుంటాను చంద్ర, నాకు ఒక్క అవకాశం ఇవ్వు క్రాంతి అని వేడుకుంటుంది శాలిని. వదిన తను డ్రామా చేస్తుందన క్రాంతి అంటాడు. సరే నువ్వన్నట్లే నీకు అవకాశం ఇస్తాను. కానీ, దానికి నీ వల్ల బాధపడ్డ నా భర్త అనుమతి కావాలి అని జగదీశ్వరి అంటుంది.
దాంతో రఘురాం కాళ్లపై పడి తనకు అవకాశం ఇవ్వమని వేడుకుంటుంది శాలిని. నమ్మొద్దని క్రాంతి, మెడపట్టి గెంటేయమని శ్యామల, కామాక్షి అంటారు. ఆగండి. అవకాశం ఇవ్వాల్సిందే. శాలిని వల్ల ఇంట్లో అందరికంటే ఎక్కువ బాధపడింది చంద్ర. తను ఒప్పుకుంటే ఇస్తానని రఘురాం అంటాడు. దాంతో చంద్రకళ కాళ్లపై పడుతుంది శాలిని.
నీ భర్త మనసు గెలుచుకో
ఆ తర్వాత విరాట్ కాళ్లపై పడుతుంది శాలిని. సరే క్రాంతి సంతోషం కూడా ముఖ్యమే అని చంద్రకళ అంటుంది. లేదు ఇంట్లో ఉండాలన్ని మీ నిర్ణయం, కానీ నా జీవితంలో ఉండాలనేది నా నిర్ణయం. నేను మనిషిలానే చూడను అని క్రాంతి అంటాడు. అన్ని మర్చిపోయి నీ భర్త మనసు గెలుచుకో అని చంద్రకళ అంటుంది. దాంతో శాలిని ఇంట్లోకి వెళ్తుంది.
ఇంకోసారి తోక జాడించాలని చూస్తే ఊరుకోనని వార్నింగ్ ఇస్తుంది జగదీశ్వరి. చంద్రకళను ప్రేమగా హగ్ చేసుకుని మురిసిపోతుంది జగదీశ్వరి. తర్వాత శాలిని గురించి చెబుతూ షాక్ అవుతారు కామాక్షి, శ్రుతి. అలాంటి దాన్ని ఉంచుకోవడం కూడా రిస్కే. అత్తయ్య మావయ్య తప్పు చేశారనిపిస్తుందని శ్రుతి అంటుంది. నిజం తెలిసిపోయింది కాబట్టి శాలిని అలా చేయదు. అందరి కాళ్ల మీద పడి క్షమించమని అడిగింది కదా అని కామాక్షి అంటుంది.
శాలినికి హెల్ప్ చేసినందుకు మనం కూడా బుక్ అయిపోతామని శ్రుతి అంటుంది. ఏది ఏమైనా నా తప్పు నేను సరిదిద్దుకోవాలని శ్రుతి అంటే.. ఇంత మెచ్యూరిటీ ఎప్పుడు వచ్చిందే అని కామాక్షి అంటుంది. సిచ్యువేషన్స్ అని వెళ్లిపోతుంది శ్రుతి. క్రాంతి కోసమే శాలినిని వదిలేసానని రఘురాంతో అంటుంది జగదీశ్వరి.
ఇప్పుడు లెక్క వేరు
శాలిని వల్ల తాను కోల్పోయిన విలువైన క్షణాల గురించి చెప్పిన రఘురాం తనకంటే చంద్రకళ ఎక్కువ బాధలు అనుభవించిందని చెబుతాడు. చంద్ర మనసు చాలా గొప్పది అని శ్యామల మెచ్చుకుంటుంది. తను నా మేనకోడలు. నా ఇంటి దీపం అని జగదీశ్వరి అంటుంది. క్రాంతి మనసు ముక్కలు అయిందని అనుకుంటారు. ఇక శాలినికి చుక్కలే. నేను తొక్కిపెట్టి నార తీస్తాను. ఇప్పుడు లెక్క వేరు అని శ్యామల అంటుంది.
చంద్ర మీద ప్రేమ వర్షంలా కురిపిస్తానంటుంది శ్యామల. మరోవైపు విరాట్‌ను వెనుక నుంచి హగ్ చేసుకుంటుంది చంద్రకళ. అంతా మంచే జరిగింది. శాలిని మారింది. ఒక క్రాంతినే కోపంగా ఉన్నాడు. మనసు ప్రశాంతంగా ఉంది అని చంద్రకళ అంటుంది. ఇక బుజ్జి పిల్లాడు ఇంట్లో సందడి చేయాలని పిల్లల గురించి చెబుతూ శోభనం, కమిట్ అవ్వడం గుర్తు చేస్తాడు విరాట్.
ఈరోజు బ్రెయిన్ హీటెక్కిపోయింది. కాబట్టి ఇవాళ వద్దు. దానికి మంచి ప్లానింగ్, అట్మాస్పియర్ కావాలి అని చంద్రకళ అంటుంది. చక్కెర, పాయసం తీయగా ఉన్నా పాయసం తింటే వచ్చే ఫీల్ వేరు. అలాంటప్పుడు చక్కెర కోసం కక్రుత్తి పడతావేంటీ బావ అని చంద్రకళ అంటుంది.
వాలంటైన్స్ డే వేడుకలు
తర్వాత కన్నీళ్లు పెట్టుకుంటూ చంద్రను క్షమించమని అడుగుతుంది శ్యామల. తర్వాత ఇంట్లో వాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతాయి. మూడు జంటలు కేక్ కట్ చేయాలని కేక్ తెప్పిస్తాడు రఘురాం. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


