నిన్ను కోరి ఫిబ్రవరి 11:శాలిని అసలు రంగు బయటపెట్టిన చంద్రకళ-డాక్టర్ ఇంటికి వెళ్లిన క్రాంతికి దిమ్మతిరిగే షాక్-భార్య మోసం
నిన్ను కోరి సీరియల్ టుడే ఫిబ్రవరి 11 ఎపిసోడ్ లో రూ.10 లక్షల ట్రాన్సాక్షన్ ద్వారా చంద్రకళ వేసిన మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయ్యింది. డాక్టర్ గన్ తో శ్రుతి బెదిరిస్తుంది. భార్య నిజ స్వరూపం తెలిసి క్రాంతి షాక్ అవుతాడు.
నిన్ను కోరి సీరియల్ టుడే ఫిబ్రవరి 11 ఎపిసోడ్ లో.. క్రాంతి ల్యాప్ టాప్ వాడి అతని అకౌంట్ నుంచి డాక్టర్ అకౌంట్ కు చంద్రకళ రూ.10 లక్షలు పంపిస్తుంది. శాలిని ఈ రోజుతో నీ ఆటలకు ఫుల్ స్టాప్ పడబోతుందని చంద్ర అనుకుంటుంది.

డాక్టర్ కు కాల్
శాలిని రూమ్ లోకి వచ్చి గన్ తీసి బ్యాగ్ లో పెట్టుకుంటుంది. డాక్టర్ కు కాల్ చేసి కలిసేందుకు వస్తున్నానని చెప్తుంది. ఇదంతా చంద్రకళ చూస్తుంది. మనం క్రాంతిని ఆ గైనకాలజిస్ట్ ఇంటికి వెళ్లేలా చేస్తే మన ప్లాన్ సక్సెస్ అయినట్లేనని చంద్రతో విరాట్ అంటాడు. క్రాంతి రాగానే విరాట్, చంద్ర డ్రామా స్టార్ట్ చేస్తాడు.
విరాట్, చంద్ర డ్రామా
అకౌంట్ నుంచి రూ.10 లక్షలు ట్రాన్స్ ఫర్ అయినట్లు ఫోన్ కు వచ్చిన మెసేజ్ చూసి క్రాంతి షాక్ అవుతాడు. మరోవైపు ఏంటి చంద్ర నువ్వు అనేది, శాలినికి ప్రాబ్లం ఉండటం ఏంటీ? అని విరాట్ గట్టిగా అరుస్తాడు. శాలినికి ప్రాబ్లం ఉంది. నిన్న డాక్టర్ ఇంటికి వచ్చినప్పుడు శాలిని కంగారు పడింది. ఆ డాక్టర్ ప్రాబ్లం గురించి చెప్పేస్తుందేమో అనుకుంది. ఈ రోజు డాక్టర్ ను ఇంట్లోనే కలిసేందుకు శాలిని వెళ్లిందని చంద్ర అంటుంది.
క్రాంతికి డౌట్
క్రాంతికి చెప్తే శాలిని ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటాడు కదా అని చంద్ర అంటుంది. వద్దు చంద్ర మనం చెప్తే మళ్లీ వాళ్ల మధ్యలో గొడవ పెట్టామనే నింద వస్తుంది. క్రాంతి మనల్ని నమ్మడు అని విరాట్ అంటాడు. ఈ మాటలను క్రాంతి వింటాడు. ఇదంతా చూస్తే శాలినికి నిజంగానే ఏదో ప్రాబ్లం ఉందనిపిస్తుంది, అదేంటో తెలుసుకోవాలని క్రాంతి వెళ్తాడు.
డాక్టర్ కు శాలిని వార్నింగ్
రూ.50 లక్షలు ఇవ్వకపోతే నా విషయాలన్నీ మా ఇంట్లో వాళ్లకు చెప్పేస్తానంటావు అంతే కదా. నిజం తెలిస్తే రోడ్డు మీద పడతానని అనుకుంటున్నావా? మా అమ్మకు ఉన్న స్టేటస్ లో నీది పావల వంతు కూడా కాదని డాక్టర్ తో శాలిని సీరియస్ గా మాట్లాడుతుంది. అప్పుడే క్రాంతి డాక్టర్ ఇంటికి వస్తాడు.
క్రాంతి షాక్
శాలిని గన్ తీసి డాక్టర్ కు గురి పెడుతుంది. నీ కూతురి నుంచి నీకు ఫోన్ కాల్ రాదు. నేను తనను టార్చర్ పెట్టే వీడియోలు వస్తాయి. నా సీక్రెట్ నీ మనసులోనే ఉండిపోవాలని శాలిని అంటుంది. నాకు ప్రెగ్నెన్సీ లేకపోయినా ఉందని నా ఫ్యామిలీని నమ్మించావు. అబార్షన్ డ్రామాలో సపోర్ట్ చేశావు. చంద్ర కారణంగానే అబార్షన్ జరిగిందని నమ్మేలా చేశావని శాలిని అంటుంది. ఈ మాటలన్నీ క్రాంతి విని షాక్ అవుతాడు. అక్కడి నుంచి శాలిని వెళ్లిపోతుంది.
నిజం బట్టబయలు
శాలిని ప్రెగ్నెన్సీ, అబార్షన్ అంతా అబద్దమా అని క్రాంతి డాక్టర్ ను అడుగుతాడు. అప్పుడే విరాట్, చంద్ర వస్తారు. ఈ చంద్రపై ఉన్న కోపంతో తనను ఇంట్లో నుంచి పంపించాలని అలా చేసింది. మీ అన్నయ్య, వదినను బ్యాడ్ చేసేందుకే అబార్షన్ డ్రామా ఆడిందని డాక్టర్ చెప్తుంది. ఆ డ్రామా అంతా నిజం అనుకుని మీపై నిందలు వేసి, మిమ్మల్ని బాధపెట్టాను వదిన అని క్రాంతి ఎమోషనల్ అవుతాడు.
ఇదంతా తెలియాలనే నీ అకౌంట్ నుంచి డాక్టర్ కు రూ.10 లక్షలు పంపించాం. నిన్ను ఇక్కడికి రప్పించేలా చేశామని క్రాంతితో విరాట్ చెప్తాడు. శాలిని మీద కోపంతో క్రాంతి కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు. ఆ ట్యాబ్లెట్స్ విషయంలో కూడా క్లారిటీ తీసుకోవాలని అనుకుంటాడు. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


