నిన్ను కోరి ఫిబ్రవరి 9 ఎపిసోడ్: మోసం చేశావ‌ని విరాట్‌పై క్రాంతి ఫైర్‌- ఇంటికే వ‌చ్చిన డాక్ట‌ర్‌- శాలినికి టెన్షన్

నిన్ను కోరి సీరియల్ టుడే ఫిబ్రవరి 9 ఎపిసోడ్ లో తనను మోసం చేశావని విరాట్ తో క్రాంతి అంటాడు. కొడుకులు గొడవ పడటం చూసి రఘురాం, జగదీశ్వరి ఫీల్ అవుతారు. మరోవైపు డాక్టర్ డైరెక్ట్ గా ఇంటికి వచ్చి డబ్బు కోసం శాలినిని బ్లాక్ మెయిల్ చేస్తుంది. 

Feb 9, 2026, 07:27:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిన్ను కోరి సీరియల్ టుడే ఫిబ్రవరి 9 ఎపిసోడ్ లో.. క్రాంతి నీ మనసులో ఉన్న బాధ నీతో ఇలా మాట్లాడిస్తోంది. ప్రేమను నిరూపించుకునేందుకు ఈ అన్నయ్యకు ఒక్క అవకాశం ఇవ్వురా అని విరాట్ అడుగుతాడు. శాలినికి ఒక అవకాశం ఇచ్చా. తను మారి నాకు సపోర్ట్ గా నిలుస్తుందని క్రాంతి చెప్తాడు.

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

మోసం చేశావ్

నువ్వు రియలైజ్ అయ్యావని నీకు అవకాశం ఇచ్చా. కానీ నువ్వు దాన్ని వాడుకుని నన్ను మోసం చేశావ్. నాకు సపోర్ట్ గా ఉన్నట్లు నటిస్తూనే ముందడగు వేయకుండా అడ్డుకున్నావు. నేను మాత్రం నిన్ను ఇంకోసారి నమ్మను. రేపు వెన్నుపోటు పొడిస్తే భరించలేను అన్నయ్య. అందుకే నా బిజినెస్ విషయంలో నువ్వు ఇన్వాల్స్ అవొద్దని విరాట్ తో క్రాంతి అంటాడు.

చంద్ర ఫైర్

నా మాటలు క్రాంతి మీద బాగానే పనిచేశాయి. మొత్తానికి క్రాంతి నా గుప్పిట్లోకి వచ్చాడని శాలిని అనుకుంటుంది. అప్పుడే చంద్రకళ వచ్చి శాలిని మీద ఫైర్ అవుతుంది. క్రాంతి నా కంట్రోల్ లోకి వచ్చాడు. నేను ఆడించినట్లే ఆడతాడు. టైమ్ నాకు కలిసొచ్చింది. హాస్పిటల్ లో అందుకే నా కంట్లో పడ్డావు. అందరి ముందు నీ సీక్రెట్ బయటపెట్టానని శాలిని అంటుంది. అప్పుడే డాక్టర్ నుంచి శాలినికి పదేపదే కాల్స్ వస్తుంటాయి.

నేను చేసింది మంచి పనేనని అత్తయ్య, మామయ్య నాకు సపోర్ట్ గా మాట్లాడారు. ఆ విషయంలో నాకు ఎలాంటి గిల్టీ ఫీలింగ్ లేదు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. క్రాంతి ఎన్నాళ్లు నీ మాయలో ఉంటాడో చూస్తానని శాలినితో చంద్రకళ అంటుంది. దమ్ముంటే నిజాయతీ ప్రూవ్ చేసుకో అని శాలిని ఛాలెంజ్ చేస్తుంది.

రఘురాం బాధ

అన్నదమ్ములు కలిసి ఉంటారని అనుకున్నా. క్రాంతికి విరాట్ మీద కోపం పెరిగిపోయింది. క్రాంతి తగ్గేలా లేడు. నేను కంట్రోల్ చేసేందుకు ట్రై చేస్తే తప్పు చేసినవాడికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావని నిలదీశాడని జగదీశ్వరితో చెప్తూ రఘురాం బాధపడతాడు. భార్యల కోసం వాళ్లిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. కాలమే అన్నింటికి సమాధానం చెప్తుందని జగదీశ్వరి కూడా ఫీల్ అవుతుంది.

నాకు సపోర్ట్

అర్జున్ ఇంటికి వెళ్లిన చంద్రకళ జరిగింది తలుచుకుంటూ బాధపడుతుంది. నన్ను మా ఇంట్లోవాళ్లు అసహ్యించుకునేలా చేయాలని శాలిని ఏదో ఒకటి చేస్తుంది. అత్తయ్య, మామయ్య నాకు సపోర్ట్ చేశారు కాబట్టి సరిపోయింది. లేదంటే పెద్ద ఇష్యూ అయ్యేదని అర్జున్ తో చంద్రకళ చెప్తుంది.

శాలిని ఎందుకు హాస్పిటల్ కు వచ్చిందని అర్జున్ అడుగుతాడు. తనకు హెల్ప్ చేసిన గైనకాలిజిస్ట్ ను కలిసేందుకు వచ్చిందేమోనని చంద్రకళ అంటుంది. నిన్న నైట్ ఆ గైనకాలజిస్ట్ ఫోన్ చేస్తే శాలిని చిరాకుగా కట్ చేసింది. వాళ్లిద్దరి మధ్య ఏదో విభేధాలు వచ్చాయి. ఇది బయటపెట్టాలని చంద్రకళ అంటుంది.

ఇంటికి డాక్టర్

ఇదే విషయాన్ని ఇంటికి వెళ్లి విరాట్ కు చెప్తుంది. అప్పుడే ఆ డాక్టర్ విరాట్ వాళ్ల ఇంటికి వస్తుంది. డాక్టర్ ను చూసి శాలిని షాక్ అవుతుంది. కొత్త వెంచర్ స్టార్ట్ చేశారు కదా అందులో ఓ ప్లాట్ ఇప్పించమని శాలినిని అడిగానని అందరి ముందు డాక్టర్ చెప్పేస్తుంది. ట్యాబ్లెట్స్ సరిగ్గా వాడమని చెప్తుంది.

టెస్టు చేస్తానని శాలినిని గదిలోకి తీసుకెళ్తుంది డాక్టర్. శాలిని వెళ్లి డాక్టర్ పీక పట్టుకుంటుంది. ఏంటి బెదిరిస్తున్నావా? అని శాలిని అంటుంది. అవును, బెదిరించడానికి వచ్చా. ప్రెగ్నెంట్, అబార్షన్ అబద్దమని చెప్పి నన్ను డాక్టర్ సేవ్ చేసిందని అందరితో చెప్తావా? రూ.50 లక్షలు ఇవ్వమని బ్లాక్ మెయిల్ చేసింది, అందుకే చంపేశానని చెప్తావా? అని డాక్టర్ అనడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.