నిన్ను కోరి ఫిబ్రవరి 6 ఎపిసోడ్: శాలిని కుట్ర- అందరి ముందు చంద్రకళను అమ్మా అని పిలిచిన తేజు- నిజం చెప్పేసిన చంద్ర
నిన్ను కోరి సీరియల్ టుడే ఫిబ్రవరి 6 ఎపిసోడ్ లో విరాట్, చంద్రకళ భూమి పూజ చేస్తున్న ప్లేస్ కు తేజును తీసుకుని డాక్టర్ వస్తుంది. దీంతో అర్జున్, చంద్రకళ, విరాట్ షాక్ అవుతారు. పాపను ఆపి మరీ శాలిని నిజాలు చెప్పిస్తుంది. చంద్రకళను చూసి తేజు అమ్మా అని పిలవడంతో అంతా షాక్ అవుతారు. చంద్ర నిజం చెప్పేస్తుంది.
నిన్ను కోరి సీరియల్ టుడే ఫిబ్రవరి 6 ఎపిసోడ్ లో.. శాలిని ముఖానికి నల్ల రంగు పూసి మార్కెట్లోకి తీసుకెళ్తారు రాజ్, సరోజ, మరోవైపు విరాట్, చంద్రకళ భూమి పూజ చేస్తుంటారు. అప్పుడే తేజును తీసుకుని డాక్టర్ వస్తుంది. అది చూసి అర్జున్, విరాట్, చంద్ర షాక్ అవుతారు.

అర్జున్ కూతురు
అర్జున్ కాస్త ముందుకు వచ్చి ఎందుకు వచ్చావు తేజు? డాక్టర్ ఎందుకు తీసుకొచ్చారు? అని అడుగుతాడు. ఎవరో యాక్సిడెంట్ అయిందని చెప్తే వచ్చామని డాక్టర్ అంటుంది. అర్జున్ ఈ పాప నిన్ను నాన్న అని పిలుస్తుందేంటీ అని జగదీశ్వరి అడుగుతుంది. ఈ పాప నా కూతురే అని అర్జున్ నిజం చెప్పేస్తాడు. మరి మాకెందుకు చెప్పలేదని శ్యామల అడిగితే, నేను త్వరలో చచ్చిపోతానని నా గురించి ఎవరికీ చెప్పడు నాన్న అని తేజు అంటుంది.
తేజును ఆపిన శాలిని
తేజుకు క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ అని అర్జున్ చెప్పగానే అందరూ బాధపడతారు. తేజును బయటకు తీసుకురావడం మంచిది కాదని ఎవరికి చెప్పను. మీ పూజ డిస్టర్బ్ చేయడం నాకిష్టం లేదు. వెళ్తొస్తానని తేజును తీసుకుని అర్జున్ వెళ్లాలని చూస్తాడు. కానీ తేజును ఆపాలని శాలిని హాయ్ పాప అని పలకరిస్తుంది. పూజ చూసి వెళ్లమని ఆపుతుంది. తేజు కూడా ఉంటానని మొండిగా బిహేవ్ చేస్తుంది. రఘురాం వచ్చి మీరు పూజ పూర్తయ్యేసరికి ఉండాల్సిందేనని తేజును తీసుకుని పూజ దగ్గరకు వస్తాడు.
చంద్రను అమ్మా అని
ఏం చేయాలోనని విరాట్, చంద్రకళ టెన్షన్ పడతారు. చంద్రకళ దాక్కునే ఉంటుంది. కానీ పూజ చేయాల్సి ఉండటంతో చంద్రకళ ముందుకు వస్తుంది. వెంటనే తేజు అమ్మా అంటూ చంద్రకళ దగ్గరకు పరుగెత్తి హత్తుకుంటుంది. అదేంటి అర్జున్.. మీ పాప చంద్రను అమ్మా అంటుందని జగదీశ్వరి అడుగుతుంది. కాస్త ఓపికగా ఉండండి అంతా క్లియర్ అవుతుందని అర్జున్ చెప్తాడు.
అయిపోయావ్ చంద్ర, అడ్డంగా దొరికిపోయావని శాలిని అనుకుంటుంది. శాలిని పాపను ఆపి మరీ అన్ని విషయాలు చెప్పిస్తుంది. ఏమిటి ఇదంతా, నాకేం అర్థం కావడం లేదని జగదీశ్వరి అంటుంది. మీకు చంద్ర మీద కోపం రావడం సహజమే. కానీ ఇప్పుడు నిజాలు తెలిస్తే పాప ప్రాణానికే ప్రమాదమని అర్జున్ అంటాడు. పాపను విరాట్ తో మాట్లాడమని పంపించి చంద్ర నిజం చెప్తుంది.
నిజం చెప్పిన చంద్ర
పాప నన్ను చూసి తన కన్నతల్లి అనుకుంది. అది నిజం కాదని చెప్తే ఆ పసి మనసు తట్టుకోలేక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆ భయంతోనే తేజుకు తల్లిగా యాక్ట్ చేస్తున్నా. ఈ నాటకం వెనుక పాప కోలుకోవాలనే ఉద్దేశం తప్ప దురుద్దేశం లేదు. పూజ పూర్తయ్యాక మీ సందేహాలన్నింటికీ సమాధానాలు చెప్తానని చంద్ర రిక్వెస్ట్ చేస్తుంది.
తేజును తీసుకుని అర్జున్ వెళ్లిపోతాడు. ఎవరు లేని అర్జున్ కు పాప ఉండటం ఏంటీ? నువ్వు తల్లిగా నటించడం ఏంటో? అని శాలిని అడుగుతుంది. తల్లిగా అంటే పగలు, రాత్రి వాళ్ల ఇంట్లోనే ఉంటుందా ఏంటీ? అని అక్కడికి వచ్చిన ఆడవాళ్లు అడుగుతారు. ముందు పూజ కంప్లీట్ చేద్దామని విరాట్ అరుస్తాడు. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


