నిన్ను కోరి ఫిబ్రవరి 3 ఎపిసోడ్: డాక్టర్ గొంతుమీద కత్తిపెట్టిన శాలిని- తేజుకు తల్లిగా చంద్రకళ- అది చూసి శాలిని షాక్

నిన్ను కోరి సీరియల్ టుడే ఫిబ్రవరి 3 ఎపిసోడ్ లో తేజు కోసం అర్జున్ ఇంటికి వెళ్తుంది చంద్రకళ. బిచ్చగాడి సాయంతో ఇంట్లో నుంచి శ్రుతి బయటపడుతుంది. శాలినిని బెదిరించాలని డాక్టర్ ట్రై చేస్తుంది. తేజు అమ్మానాన్నలుగా చంద్ర, అర్జున్ ను చూసి షాక్ అవుతుంది శాలిని. 

Published on: Feb 3, 2026, 07:53:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిన్ను కోరి టుడే ఫిబ్రవరి 3 ఎపిసోడ్ లో క్రాంతికి మళ్లీ నా మీద నెగెటివ్ ఇంప్రెషన్ రాకుండా చూసుకోవాలని చంద్రతో విరాట్ అంటాడు. కింద పడ్డ ఫైల్స్ తీయబోతూ చంద్ర, విరాట్ తలలు ఢీకొట్టుకుంటారు. ఒకసారి గుద్దితే కొమ్ములు వస్తాయి ఇంకోసారి రిపీట్ చేయాలని విరాట్ ను గుద్దుతుంది చంద్ర.

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

చిన్నపిల్లల్లా

డోర్ బయటే ఉన్న శ్యామల విరాట్ ను పిలుస్తుంది. లోపల మీరిద్దరు ఏదో మాట్లాకుంటున్నారు. భూమి పూజకు ఎల్లుండి బాగుంది. గొడవలు పడితే పడ్డారు కానీ చిన్నపిల్లల్లా కొట్టుకోకండని చెప్పి శ్యామల వెళ్లిపోతుంది. ఫోన్లో చూస్తూ తేజు చెప్పినట్లుగా అర్జున్ వంట చేస్తాడు. అప్పుడే చంద్ర వస్తుంది.

భూమి పూజ

స్టవ్ వెలిగించకుండానే వంట చేస్తున్నారని చంద్ర చెప్తుంది. పాప కోసం నేనే వంట చేస్తానని చంద్రకళ అంటుంది. నా వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారని అర్జున్ అంటాడు. ఈ రోజు పాపను స్పెషలిస్ట్ డాక్టర్ కు చూపిస్తానని అర్జున్ చెప్తాడు. మా ఆయన వెంచర్ కు రేపు భూమి పూజ, మీరు తప్పకుండా రావాలని అర్జున్ కు చెప్తుంది చంద్ర.

బిచ్చగాడి సాయంతో

మరోవైపు ఇంట్లో ఉన్న శ్రుతి హెల్ప్ కోసం చూస్తుంది. అప్పుడే ఓ బిచ్చగాడు వస్తాడు. ఎందుకు లోపల ఉంచి తాళం వేశారని అడుగుతుంది. బాబాయ్, నేను ఈ ఇంటి ఆయన భార్యను. తాళం వేసి మా ఆయన మార్కెట్ కు వెళ్లిపోయారు. ఓ సారి తాళం పగలగొట్టవా? నీకు చికెన్ కర్రీ వండి పెడతా బాబాయి అని శ్రుతి అడుగుతుంది. బాబాయి అనే మాటకైనా తాళం పగలగొట్టాలని ఆ బిచ్చగాడు తాళం పగలగొడతాడు.

డబ్బు డిమాండ్

శాలిని హాస్పిటల్ కు వెళ్తుంది. ఏంటి సడెన్ గా రమ్మని కాల్ చేశారని శాలిని అడుగుతుంది. నేనో విల్లా కొందామని ప్లాన్ చేస్తున్నా. సిటీ సెంటర్ లో చాలా బాగుంది. దానికి రూ.50 లక్షలు తక్కువ పడుతున్నాయి. అవి నిన్ను అడుగుదామని అనుకున్నానని డాక్టర్ చెప్తుంది. అప్పు తీసుకుంటే సరిపోదు రెండు శాతం ఇంట్రెస్ట్ ఇవ్వాలని శాలిని అంటుంది.

నిజం చెప్పేస్తానని

అప్పు ఏంటీ? మళ్లీ తిరిగి ఇస్తానని ఊహించకు. మీ బావ కొత్త వెంచర్ లో కార్నర్ ఫ్లాట్ నా పేరు మీద బుక్ చేసి అడ్వాన్స్ పే చేయి. నీ ప్రెగ్నెన్సీ డ్రామా బయటపడుతుందని ఎంత టెన్షన్ పడ్డావో నాకు తెలుసు. కానీ కాపాడిందే నేను. మీ ఇంట్లోవాళ్లను మోసం చేశావని తెలిస్తే నీ పరిస్థితేంటో ఆలోచించమని డాక్టర్ చెప్తుంది. ఏంటీ బెదిరిస్తున్నావా? ఆల్రెడీ రూ.10 లక్షలు ఇచ్చాను కదా అని శాలిని అంటుంది. ఈ సీక్రెట్ విలువ నీ లైఫ్ శాలిని. ఆ సీక్రెట్ బయటకు రావొద్దంటే నేను కోరుకున్నది నాకు దక్కాలని డాక్టర్ అంటుంది.

వెంటనే డాక్టర్ గొంతు మీద శాలిని కత్తి పెడుతుంది. నాకు సాయం చేశావనే కన్సర్న్, సీసీ కెమెరాలో రికార్డు అవుతుందని వదిలేస్తున్నా. లేదంటే ప్రాణాలు గాల్లో కలుస్తాయని బెదిరించి శాలిని వెళ్లిపోతుంది.

తేజు ఆడుకుంటూ

అదే హాస్పిటల్ కు తేజును తీసుకుని అర్జున్, చంద్ర వస్తారు. విరాట్ కాల్ చేస్తే పాపను జనరల్ చెకప్ కు తీసుకొచ్చానని చంద్ర చెప్తుంది. రొమాంటిక్ గా మాట్లాడతాడు విరాట్. కామాక్షి చూస్తుందని టోన్ ఛేంజ్ చేస్తాడు. తేజు బాల్ తో ఆడుకుంటూ వెళ్లి శాలిని ముందు పడిపోతుంది. మీ పేరెంట్స్ ఎక్కడా? అని శాలిని అడుగుతుంది. వాళ్ల దగ్గరకు తీసుకెళ్తానని అంటుంది.

వాళ్లే మా అమ్మానాన్న అని చంద్రకళ, అర్జున్ ను చూపిస్తుంది తేజు. దీంతో శాలిని షాక్ అవుతుంది. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More