నిన్ను కోరి ఫిబ్రవరి 2 ఎపిసోడ్: శాలిని ప్లాన్‌ను తిప్పికొట్టిన విరాట్- తేజుకు అమ్మగా చంద్రకళ- శాలినికి తెలిసిపోయిన నిజం!
నిన్ను కోరి సీరియల్ ఫిబ్రవరి 2 ఎపిసోడ్‌లో బాంబే కాంట్రాక్ట్ పోవడం గురించి క్రాంతి అసహనం వ్యక్తం చేస్తాడు. నీకు చెప్పమని శాలినికి చెప్పినట్లు విరాట్ అంటాడు. దాంతో శాలిని డ్రామా ప్లే చేస్తుంది. శాలిని ప్లాన్‌ను విరాట్ తిప్పికొడతాడు. తేజును కాపాడిన శాలిని తన అమ్మనాన్న చంద్ర, అర్జున్ అని తెలుసుకుంటుంది.
నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఫోన్ చేసిన వెంటనే ఫైల్ పంపించకుండా మమ్మల్ని అంటే ఎలా అని క్రాంతిపైనే రివర్స్ అవుతుంది మంత్రి పీఏ. అదే విషయం శాలినికి చెబుతాడు క్రాంతి. అన్నయ్యకు పీఏ కాల్ చేసి ఫైల్ పంపించమన్నారట. కానీ, అన్నయ్య నాకు చెప్పనేలేదు అని క్రాంతి అంటాడు.

అన్నయ్య మీద డిపెండ్ కావొద్దు
మన పని మీద వేరేవాళ్లకు ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటది. అందుకే మీ అన్నయ్య మీద డిపెండ్ కావొద్దనంటున్నా అని ఎక్కిస్తుంది శాలిని. ఇంత పెద్ద విషయం అన్నయ్య నాకు ఎందుకు చెప్పలేదో ఇప్పుడే అడుగుతా అని క్రాంతి అంటాడు. ఈ మంట చాలు సంతోషం ఆవిరి అవ్వడానికి అని శాలిని అనుకుంటుంది.
విరాట్‌ను అంతా పొగుడుతారు. క్రాంతి కూడా కంగ్రాట్స్ చెబుతాడు. దాంతో శాలిని షాక్ అవుతుంది. సొంత తమ్ముడికి ఇచ్చిన మాటను ఈజీగా మర్చిపోతావ్ అని క్రాంతి అంటాడు. దాంతో అంతా షాక్ అవుతారు. ఆ బాంబే కాంట్రాక్ట్ మనకు రాదని క్రాంతి అంటాడు. ఏమైందని అడిగితే టెండర్ వేయాలిగా. దానికి ల్యాండ్, అందుకు పర్మిషన్ ఉండాలిగా అని క్రాంతి అంటాడు.
పర్మిషన్‌కు ఫైల్ పంపించమని ఆయన చెప్పారుగా అని చంద్రకళ అంటుంది. ఎప్పుడు అని క్రాంతి అంటే.. కలగని ఉంటారని శాలిని అంటుంది. అదేంటీ శాలిని. నిన్న రాత్రే నీకు చెప్పమని చెప్పానుగా అని విరాట్ అంటాడు. నాకు ఎప్పుడు చెప్పారు. నన్ను అసలు కలవనలేదుగా అని శాలిని అంటుంది.
నా మీద నిందలు వేయకండి
నిన్న రాత్రి క్రాంతి గురించి అడిగితే 2 గంటల దాకా రాడని అన్నావ్. నీకు చెప్పమని చెప్పానుగా అని విరాట్ అంటాడు. మీరు అనవసరంగా నా మీద నిందలు వేయకండని శాలిని అంటుంది. అర్థమైంది శాలిని మా ఇద్దరి మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నావ్ అనుకున్న విరాట్ క్రాంతికి సింపుల్‌గా సారీ చెబుతాడు. నేనే మర్చిపోయి ఉంటాను అని అంటాడు.
దాంతో శాలిని షాక్ అవుతుంది. అలా శాలిని ప్లాన్ ఫెయిల్ అవుతుంది. ల్యాండ్ మినిస్టర్ బంధువుకు వెళ్లిపోయిందట. అన్నయ్యల నేను ఎవరి మీద ఆధారపడకుండా ఉండాల్సింది అని వెళ్లిపోతాడు క్రాంతి. విరాట్ ఫీల్ అవుతాడు. అంతా వెళ్లిపోతారు. శాలిని ప్లాన్‌ను భలే తిప్పికొట్టావ్ బావ అని చంద్రకళ మెచ్చుకుంటుంది.
మరోవైపు పది గంటలకు నిద్ర లేచిన శ్రుతి ఇంట్లో ఎవరు లేరని చూస్తుంది. బయట నుంచి తాళం వేసి ఉంటుంది. శ్రుతిని ఇంట్లో బంధించి రాజ్, తన తల్లి వెళ్లిపోతారు. కానీ, నేను వదులుతానా అనుకున్న శ్రుతి రాజ్‌కు కాల్ చేస్తుంది. రాజ్ భయపడితే తల్లి లిఫ్ట్ చేస్తుంది. గళ్లా పెట్టే మాది వంట నీది. ఉంటే ఉండు లేకుంటే వెళ్లు అని అత్త అంటుంది.
బ్యాడ్ టైమ్ స్టార్ట్
రాజ్ ప్రేమగా మాట్లాడి కూల్ చేస్తాడు. ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి. మీకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందని శ్రుతి అనుకుంటాడు. మరోవైపు విరాట్, క్రాంతి విషయం గురించి చర్చించుకుంటారు శ్యామల, కామాక్షి. శాలిని కావాలనే క్రాంతికి చెప్పట్లేదనుకుంటా అని గతంలో చేసింది శ్యామలకు చెబుతుంది కామాక్షి. ఆ మాటలు శాలిని వింటుంది.
శ్యామల నమ్మదు. ఎక్కడికో వెళ్లిపోతావ్ అని వెళ్లిపోతుంది. కామాక్షిని వచ్చి శాలిని నిలదీస్తుంది. పార్టీ మార్చే ప్రయత్నం చేస్తున్నావా. నా గురించి ఏమనిపించిన మనసులోనే అనుకో. లేకుంటే సిమెంట్ లారీ గుర్తుంది అనుకుంటా అని కామాక్షికి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది శాలిని.
మరోవైపు చంద్రకళతో శాలిని గురించి విరాట్ మాట్లాడుతాడు. గొడవ జరిగితే తనే గెలిచినట్లు అవుతుంది. శాలిని ఇలా చేస్తుందనుకోలేదు అని విరాట్ అంటాడు. తర్వాత హాస్పిటల్‌లో తేజు కిందపడితే శాలిని పట్టుకుంటుంది. అమ్మనాన్న గురించి శాలిని అడుగుతుంది.
శాలినికి తెలిసిన నిజం
దాంతో చంద్రకళను, అర్జున్‌ను తన అమ్మనాన్న అని తేజు చెబుతుంది. అది చూసి శాలిని షాక్ అవుతుంది. తేజు అమ్మ నాన్న చంద్రకళ, అర్జున్ ఏంటని అవాక్కవుతుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


