నిన్ను కోరి ఫిబ్రవరి 5 ఎపిసోడ్: భూమి పూజలో విరాట్, చంద్ర- శాలిని కన్నింగ్ ప్లాన్- అర్జున్‌కు యాక్సిడెంట్ అని కాల్
నిన్ను కోరి సీరియల్ టుడే ఫిబ్రవరి 5 ఎపిసోడ్ లో ఇంట్లో ఉన్న ఇత్తడి బిందెలు అమ్మి ముష్టివాళ్లకు చికెన్ వండిపెడుతుంది శ్రుతి. మరోవైపు భూమి పూజ సమయంలోనే చంద్రకళను రెడ్ హ్యాండెడ్ గా పట్టించేందుకు శాలిని ప్లాన్ వేస్తుంది. అర్జున్ కు యాక్సిడెంట్ అని తేజును చూసుకునే డాక్టర్ కు కాల్ చేయిస్తుంది.
నిన్ను కోరి సీరియల్ టుడే ఫిబ్రవరి 5 ఎపిసోడ్ లో.. ఇంట్లో ఉన్న ఇత్తడి బిందెలు అమ్మి మరి ముష్టివాళ్లకు చికెన్ వండిపెడుతుంది శ్రుతి. మా పుట్టింటివాళ్లు పెట్టిన బిందెలు అమ్మేసిందని సరోజా ఫీల్ అవుతుంది. గల్లాపెట్టె దగ్గర కూర్చోనివ్వలేదని నా ఇల్లు గుల్ల చేస్తావా? అని శ్రుతిని అడుగుతుంది సరోజా.

శాలినికి తెలిసిన నిజం
అప్పులవాళ్లను కూడా శ్రుతి పిలుస్తుంది. ఎంత మంచిదానివి చెల్లి, చాలా సంతోషంగా ఉంది బావ అని అప్పులవాళ్లు అంటారు. సరోజా కొంగున కట్టుకున్న డబ్బులను ఇచ్చేస్తుంది. మరోవైపు పాపను హాస్పిటల్ కు తీసుకెళ్లారు కదా ఏమైందని చంద్రకళను అడుగుతాడు విరాట్. పాప కోలుకుంటుందని చంద్ర చెప్తుంది. ఈ మాటలను విన్న శాలిని.. ఈ పాయింట్ ను వాడుకుని మీ ఇద్దరితో ఎలా ఆడుకుంటానో వెయిట్ అండ్ వాచ్ అని అనుకుంటుంది.
నా బిజినెస్ వేరు
క్రాంతి రెడీ కాకుండా వర్క్ చేసుకుంటాడు. పూజకు టైమ్ అవుతుంది కదా రెడీ అవ్వమని రఘురాం, విరాట్ చెప్తారు. నాది ల్యాండ్ కు సంబంధించిన బిజినెస్ కాదు నాన్న. దానికదే భూమ్ అయి తిరిగి సక్సెస్ అయ్యేందుకు అని క్రాంతి అంటాడు. ఇది మన బిజినెస్ అని విరాట్ అంటాడు. అంత జాలి నా మీద చూపించొద్దు అన్నయ్య. నా బిజినెస్ వేరు అని క్రాంతి అంటాడు.
బావకు ప్రేమ
సరే నీ ఇష్టం, నువ్వు వచ్చినా రాకపోయినా పూజ అయితే ఆగదని రఘురాం అంటాడు. ఒక్క నిమిషం, క్రాంతి నువ్వు రాకపోవడానికి కారణం నీ పనా? లేకపోతే జెలసీనా? అని శాలిని అడుగుతుంది. ఒకరి సక్సెస్ ను చూసి ఓర్వలేని వాడిని కాదని క్రాంతి అంటాడు. అయితే వెళ్లి రెడీ అవ్వు. బావకు నీ మీద వల్లమాలిన ప్రేమ. ఆయన సారీ కూడా చెప్పారు కదా అని శాలిని అంటుంది. సారీ అన్నయ్య అని క్రాంతి రెడీ అయి వస్తాడు.
అర్జున్ ఎంట్రీ
విరాట్, చంద్ర కలిసి భూమి పూజ స్టార్ట్ చేస్తారు. అప్పుడే అర్జున్ వస్తాడు. ఇక శాలిని ప్లాన్ స్టార్ట్ చేస్తుంది. అర్జున్ మీరు ఒక్కరే వచ్చారా? ఫ్యామిలీని తీసుకురాలేదా? అని అడుగుతుంది. అర్జున్ అనాథ కదా అని కామాక్షి అంటే, అవును మర్చిపోయానని శాలిని అంటుంది. కాసేపట్లో ఈ ఆనందం మాయమైపోతుందని శాలిని అనుకుంటుంది.
యాక్సిడెంట్ అయిందని
ఓ వ్యక్తితో కొత్త సిమ్ వేయించి తేజును చూసుకునే డాక్టర్ కు కాల్ చేయిస్తుంది శాలిని. అర్జున్ అనే వ్యక్తికి యాక్సిడెంట్ అయింది. తేజు తేజు అని కలవరిస్తున్నాడు. త్వరగా రండి. పాపం ప్రాణాలు పోయేలా ఉన్నాయి. తేజును తీసుకొని రమ్మని చెప్తాడు ఆ వ్యక్తి. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది గేమ్ అని శాలిని అనుకుంటుంది.
మరోవైపు శ్రుతిని ఎలా కట్టడి చేయాలోనని రాజ్, సరోజా ప్లాన్ వేస్తారు. నువ్వు మార్కెట్ కు రావొద్దు బేబీ అని రాజ్ అంటాడు. ముష్టివాళ్లకు, అప్పులవాళ్లకు కాల్ చేయాలా? అని శ్రుతి అంటుంది. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


