నిన్ను కోరి ఫిబ్రవరి 4 ఎపిసోడ్: డాక్ట‌ర్‌లా మారి అర్జున్‌, చంద్ర‌క‌ళ సీక్రెట్ తెలుసుకున్న శాలిని.. పట్టించేందుకు ప్లాన్

నిన్ను కోరి సీరియల్ టుడే ఫిబ్రవరి 4 ఎపిసోడ్ లో చంద్రను అమ్మ, అర్జున్ ను నాన్న అని తేజు పిలవడం చూసి శాలిని షాక్ అవుతుంది. డాక్టర్ గెటప్ లో వెళ్లి నిజం తెలుసుకుంటుంది. భూమి పూజ కార్యక్రమంలోనే రెడ్ హ్యాండెడ్ గా పట్టిద్దామని ప్లాన్ చేస్తుంది. 

Published on: Feb 4, 2026, 07:46:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిన్ను కోరి సీరియల్ టుడే ఫిబ్రవరి 4 ఎపిసోడ్ లో తేజు అమ్మానాన్నగా చంద్రకళ, అర్జున్ ను చూసి శాలిని షాక్ అవుతుంది. చంద్రను అమ్మ, అర్జున్ ను నాన్న అని తేజు పిలవడం చూస్తుంది. అర్జున్ కు కూతురు ఉందా? తను చంద్రను అమ్మ అంటుందేంటీ? నాకు తెలియని సీక్రెట్ ఉంది. అదేంటో తెలుసుకోవాలని శాలిని అనుకుంటుంది.

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

డాక్టర్ గెటప్

శాలిని డాక్టర్ గెటప్ వేసుకుని లోపలికి వెళ్తుంది. వాళ్ల అమ్మ వచ్చినప్పటి నుంచి తేజు రికవర్ అవుతున్నట్లు కనిపిస్తోందని అర్జున్ అంటాడు. మా అమ్మ నాతో ఎక్కువ సేపు ఉండట్లేదు. అమెరికా నుంచి వచ్చింది. జాబ్ అంటూ ఈవెనింగ్ వెళ్లిపోతుంది. అమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంటున్నానని డాక్టర్ తో తేజు చెప్తుంది.

శాలినికి నిజం

తన తల్లి చనిపోతుందని తెలిస్తే నీ కూతురు ఏమైపోతుందేమోనని అమెరికాలో ఉందని చెప్పావు. ఇప్పుడు తల్లిలా వచ్చి ఈవిడ (చంద్రకళ) తేజును బతికిస్తోంది. పాప ప్రాణాన్ని నువ్వు నిలబెట్టావమ్మా అని డాక్టర్ అంటాడు. ఆవిడ నా బిజినెస్ పార్ట్ నర్, నా బిడ్డ కోసం తల్లిలా నటిస్తుందని జూనియర్ డాక్టర్లకు చెప్తాడు అర్జున్. ఇదంతా జూనియర్ డాక్టర్ గెటప్ లో ఉన్న శాలిని వింటుంది.

పాప పరిస్థితి తెలిసి చంద్రకళ కరిగిపోయినట్లుంది. ఈ విషయం విరాట్ బావకు తెలిసే ఛాన్స్ లేదు. ఇదంతా ఇంట్లోవాళ్లకు చెప్పాలని శాలిని అనుకుంటుంది.

పూజ ఏర్పాట్లు

భూమి పూజకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తుంది శ్యామల. కామాక్షిని అన్ని వస్తువులు తీసుకురమ్మని అడుగుతుంది శ్యామల. రేపు మన స్టాఫ్ తో పాటు క్లయింట్లను కూడా పిలుద్దామని విరాట్ కు రఘురాం చెప్తాడు. అప్పుడే శాలిని వస్తే పిన్నికి హెల్ప్ చేయమని చెప్తాడు రఘురాం. చంద్రకళ కూడా ఎంట్రీ ఇస్తుంది.

శాలిని ప్లాన్

రేపు లీవ్ పెట్టడమే కాదు అర్జున్ ను పూజకు ఇన్వైట్ చేశా. క్లయింట్ గా వస్తారు. పూజ కాగానే ఓ ఫ్లాట్ కు అడ్వాన్స్ కూడా ఇస్తారని చంద్ర చెప్తుంది. సూపర్ అమ్మ నువ్వు. బిజినెస్ గురించి ఆలోచించావని రఘురాం మెచ్చుకుంటాడు. పూజలో చంద్ర, అర్జున్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టిద్దామని శాలిని అనుకుంటుంది.

క్రాంతి బాధ

ముంబయి ప్రాజెక్ట్ విషయంలో ఏం చేయాలో అర్థం కావడం లేదు. అన్నయ్య నాకు సపోర్ట్ చేయలేదు. ప్రాజెక్ట్ చేజారిపోతున్నందుకు బాధగా ఉంది శాలిని. అన్నయ్య సక్సెస్ ను చూసి ఈర్ష్య పడుతున్నానని అనుకుంటారని రూమ్ లో ఉన్నానని శాలినితో క్రాంతి చెప్తాడు. నీకు నేను సపోర్ట్ గా ఉంటానని శాలిని అంటుంది.

రాజ్, సరోజా వచ్చేసరికి ఇంటి బయట ముష్టివాళ్లకు చికెన్ కర్రీతో భోజనం వడ్డిస్తుంది శ్రుతి. అది చూసి రాజ్, సరోజా షాక్ అవుతారు. మా ఇంట్లో ఉన్న ఇత్తడి బిందెలు అమ్మేసి మరీ కోడికూర వండిపెట్టానని శ్రుతి చెప్తుంది. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More