నిన్ను కోరి ఫిబ్రవరి 10 ఎపిసోడ్: రూ.50 లక్షలు డిమాండ్ చేసిన డాక్టర్- క్రాంతికి డౌట్- శాలిని బండారం బయటపడేలా చంద్ర ప్లాన్

నిన్ను కోరి సీరియల్ టుడే ఫిబ్రవరి 10 ఎపిసోడ్ లో తనకు కచ్చితంగా రూ.50 లక్షలు ఇవ్వాల్సిందేనని, లేదంటే ఫ్యామిలీ ముందు బండారం బయటపెడతానని శాలినిని డాక్టర్ బెదిరిస్తుంది. ఇదంతా విన్న చంద్రకళ ఓ ప్లాన్ వేస్తుంది. క్రాంతి అకౌంట్ నుంచి రూ.10 లక్షలు పంపించి శాలినిని ఇరికించాలని చూస్తుంది. 

Published on: Feb 10, 2026, 07:22:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిన్ను కోరి సీరియల్ టుడే ఫిబ్రవరి 10 ఎపిసోడ్ లో.. నీ బండారం మొత్తం బయటపడుతుంది శాలిని. నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు. తెగింపు లేకుండానే నీతో చేతులు కలుపుతానా? నాకు ఆ ఫ్లాట్ కచ్చితంగా కావాలి. నేను అడిగిన రూ.50 లక్షలు తీసుకుని రేపు హాస్పిటల్ కు రా. లేకపోతే నీ గురించి మీ ఫ్యామిలీ ముందు బయటపెట్టాల్సి వస్తుందని డాక్టర్ చెప్పడంతో శాలిని టెన్షన్ పడుతుంది.

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

శాలినిపై డౌట్

ఇదంతా కిటికీలో నుంచి చంద్రకళ వింటుంది. బయటకు వచ్చాక జనరల్ చెకప్ అని శాలిని అబద్దం చెప్తుంది. నువ్వు హాస్పిటల్ కు ఎందుకు వెళ్లావ్ శాలిని? ఏదైనా దాస్తున్నావా ఏంటీ? అని కామాక్షి, శ్యామల అడుగుతారు. అలాంటిదేం లేదు, శాలిని కాస్త స్ట్రెస్ లో ఉంది. ఏం ప్రాబ్లం లేదని డాక్టర్ చెప్తుంది. నువ్వు నా మాట విని తీరాలని శాలినితో డాక్టర్ చెప్పి, వెళ్లిపోతుంది.

అబద్దం చెప్తున్నావని

డాక్టర్ ఇష్యూను వెంటనే క్లియర్ చేయాలని శాలిని అనుకుంటుంది. అప్పుడే క్రాంతి వచ్చి.. నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? నువ్వు అబద్దం చెప్తున్నావ్ శాలిని. ఏం దాస్తున్నావో చెప్పు. ఎప్పుడు లేనిది నువ్వు ఒక్కదానివే హాస్పిటల్ కు వెళ్లావు. ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? అని అడుగుతాడు. నీ దగ్గర ఏం దాచను అని ప్రామిస్ చేశా కదా అని శాలిని అంటుంది.

చంద్ర ప్లాన్

శాలిని రూ.50 లక్షలు ఎలా ఇస్తుంది చంద్ర? శాలిని దీనికి పర్మినెంట్ సొల్యూషన్ ప్లాన్ చేస్తుందని విరాట్ అంటాడు. దీన్ని ఎలా వాడుకోవాలా అని ఇద్దరు ఆలోచిస్తారు. క్రాంతి అకౌంట్ నుంచి మనమే డబ్బులు పంపించి శాలినిని ఇరికిద్దామని విరాట్ కు చంద్ర ప్లాన్ చెప్తుంది. దీంతో చంద్రను శభాష్ అంటూ విరాట్ మెచ్చుకుంటాడు.

50 పర్సెంట్

ముఖానికి ప్యాక్ వేసుకున్న శ్రుతిని చూసి దెయ్యం అని రాజ్, సరోజ భయపడతారు. నా అందం వల్లే మీ బిజినెస్ నడుస్తుందని శ్రుతి అంటుంది. నువ్వు మార్కెట్ కు రాకుండా ఇంట్లోనే ఉంటే నీకు 50 పర్సెంట్ ఇస్తా. నీ కోసం ఇంట్లో స్మార్ట్ టీవీ పెట్టిస్తానని రాజ్ అంటాడు. దీనికి శ్రుతి ఓకే అని చెప్తుంది. అప్పుడే కామాక్షి కాల్ చేసి చంద్ర, అర్జున్ గురించి శ్రుతికి చెప్తుంది.

మార్నింగ్ క్రాంతి అకౌంట్ నుంచి డాక్టర్ అకౌంట్ కు రూ.10 లక్షలు పంపేలా చంద్ర, విరాట్ ప్లాన్ చేస్తారు. క్రాంతి గదిలోకి వెళ్లి ల్యాప్ టాప్ ఓపెన్ చేస్తుంది చంద్ర. అప్పుడే హాల్లో ఉన్న శాలిని వస్తుంది. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More