గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలు, మీనాకు యాక్సిడెంట్.. గుణకు ఎదురు తిరిగిన శివ.. మౌనికకు సంజూ టెస్టులు

గుండె నిండా గుడి గంటలు బుధవారం (ఫిబ్రవరి 18) ఎపిసోడ్ లో బాలు, మీనాలను గుణ కారుతో ఢీకొట్టాలని చూస్తాడు. దీంతో వాళ్లు కింద పడిపోతారు. అటు రవితో శృతి గొడవ, మౌనికకు సంజూ టెస్టులతో ఈ ఎపిసోడ్ ఆసక్తిగా సాగింది.

Feb 18, 2026, 08:10:03 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 622వ ఎపిసోడ్ లో బాలు, మీనాకు మరోసారి యాక్సిడెంట్ అవుతుంది. అయితే ఈ క్రమంలో వాళ్లకు మరో బామ్మ, తాత పరిచయం అవుతారు. అటు నీతూ విషయంలో రవి, శృతి మధ్య మరోసారి గొడవ జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూద్దాం.

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలు, మీనాకు యాక్సిడెంట్.. గుణకు ఎదురు తిరిగిన శి.. మౌనికకు సంజూ టెస్టులు
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: బాలు, మీనాకు యాక్సిడెంట్.. గుణకు ఎదురు తిరిగిన శి.. మౌనికకు సంజూ టెస్టులు

తన టైమ్ బాలేదంటూ బాధపడిన మీనా..

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (ఫిబ్రవరి 18) ఎపిసోడ్ నిద్రలో నుంచి లేచి మీనా బాధపడే సీన్ తో మొదలవుతుంది. తన టైమ్ బాలేదని రోహిణి చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. తలకు దెబ్బ తగిలింది.. రేపు ఏమవుతుందో అని టెన్షన్ పడుతుంది. ఇదే విషయాన్ని బాలుతో చెబితే అతడు లైట్ తీసుకుంటాడు. భవిష్యత్తును భయంతో చూస్తే అలాగే కనిపిస్తుందని, ధైర్యంతో చూడాలని అంటాడు. అలాంటి నమ్మొద్దని ఆమెకు సర్ది చెబుతాడు. ఎక్కువగా ఆలోచిస్తే తల నొప్పి వస్తుంది పడుకోమని అంటాడు.

రవికి నీతూ ఫోన్.. ఎగిరి తన్నిన శృతి

ఇటు రవికి రాత్రి వేళ నీతూ ఫోన్ చేస్తుంది. అప్పుడు రవి, శృతి గాఢ నిద్రలో ఉంటారు. ఆ సమయంలోనూ ఓ కొత్త వంటకం గురించి రవికి నీతూ చెబుతుంది. తన నిద్ర డిస్టర్బ్ చేయకు.. బయటకెళ్లి మాట్లాడుకో అంటూ రవిని తంతుంది శృతి. దీంతో అతడు వెళ్లి గది బయట పడతాడు. అక్కడ కూడా రెసిపీ గురించే మాట్లాడుతుంటాడు.

మీనా వంట.. బాలు గొడవ

మరోవైపు ఉదయాన్నే మీనా లేచి వంట చేస్తుంటే బాలు ఆమెతో గొడవ పడతాడు. ఈ పరిస్థితుల్లోనూ ఈ పనులు అవసరమా.. ఇంట్లో ఇంత మంది ఆడవాళ్లు ఉన్నారు కదా అని అంటాడు. కానీ మీనా మాత్రం తనకు బానే ఉందని చెబుతుంది. అంతేకాదు పూలు ఇవ్వడానికి బయటకు కూడా వెళ్లాలని అంటుంది. దీంతో బాలు మరింత మండిపడతాడు. నీతోపాటు పూల డెలివరీకి నేను కూడా వస్తానని అంటాడు. తప్పనిసరి పరిస్థితుల్లో మీనా సరే అంటుంది.

రవిపై అలిగి వెళ్లిన శృతి.. రోడ్డుపై క్షమాపణ చెప్పిన రవి

ఇటు రవి రెస్టారెంట్ కు వెళ్తుంది శృతి. బయట ఉండి ఫోన్ చేస్తుంది. కానీ నీతూతో రెసిపీ గురించి మాట్లాడుతూ.. అతడు ఫోన్ పదేపదే కట్ చేస్తుంటాడు. దీంతో లోనికి వచ్చి చూస్తుంది శృతి. నీతూతో అతడు మాట్లాడుతుండటంతో అలిగి వెళ్లిపోతుంది. దీంతో రవి ఆమె వెంట వెళ్లి రోడ్డుపై క్షమాపణ చెబుతాడు. గుంజిళ్లు తీస్తూ తప్పయింది.. క్షమించమంటాడు. దీంతో డేట్ కు తీసుకెళ్లమని శృతి అడుగుతుంది.

గుణ మనిషితో శివ గొడవ.. రోహిణికి గుణ ఫోన్

ఇటు బయట శివ టీ తాగుతూ ఉంటాడు. అదే సమయంలో తన మనిషితో కలిసి గుణ అక్కడికి వస్తాడు. వాడి టీ డబ్బులు ఇచ్చి తన విలువ ఏంటో తెలిసేలా చేయమని తన మనిషితో చెబుతాడు గుణ. అతడు ఆ పని చేయడానికి వెళ్తే శివ అడ్డుకుంటాడు. నీ అన్న లేకుండా నేను బతకలేననుకుంటున్నాావా.. అతని అవసరం లేదని వెళ్లి చెప్పు అంటూ అతనితో శివ గొడవ పడతాడు.

రవి, శృతి స్పెషల్ డేట్.. అక్కడ కూడా గొడవ

రవి, శృతి స్పెషల్ డేట్ కు వెళ్తారు. ఓ పంజాబీ రెస్టారెంట్ కు వెళ్లి అక్కడ తనకు నచ్చిన డిష్ ఆర్డర్ చేస్తాడు రవి. అది తిన్న శృతి చాలా బాగుందని అంటుంది. అయితే దీనిని తమ రెస్టారెంట్లోనూ స్టార్ట్ చేయాలని నీతూ చెప్పిందని రవి అనడంతో శృతి మళ్లీ గొడవ పడుతుంది. ఇక్కడ కూడా పని గురించి, మీ బాస్ గురించే మాట్లాడతావా అంటూ కోపంతో నీళ్లు రవి మొహాన కొట్టి వెళ్లిపోతుంది.

బాలు, మీనాలను ఢీకొట్టాలని చూసిన గుణ..

మీనాను పూల డెలివరీ కోసం బాలు తీసుకెళ్తాడు. ఇద్దరూ కలిసి ఓ చోట టీ తాగడం చూస్తాడు గుణ. తనకు రెండు చేతులూ లేకుండా చేసిన వాళ్లపై పగ తీర్చుకోవాలని అనుకుంటాడు. వాళ్లు బండిపై వెళ్తుంటే తన కారుతో ఢీకొట్టాలని తన మనిషికి చెబుతాడు. వేగంగా వాళ్ల వెంట వెళ్తారు. అది గమనించిన బాలు బండిని పక్కకు తీసే క్రమంలో కింద పడతారు. వాళ్లు తప్పించుకోవడంతో గుణ అసహనం వ్యక్తం చేస్తాడు. తమను గుణనే కావాలని ఢీకొట్టాలని చూశాడని బాలుకి అర్థం కాదు. అయితే ఈ క్రమంలో బాలు బండి వెళ్లి రోడ్డు పక్కనే ఉన్న ఇద్దరు ముసలివాళ్లను ఢీకొడుతుంది. దీంతో వాళ్లు గాయపడతారు. వాళ్ల దగ్గరికి వెళ్లి క్షమాపణ చెప్పి డబ్బులు ఇస్తాడు బాలు. తమ పిల్లలను పెంచి ప్రయోజకులను చేస్తే.. వాళ్లు ఇలా వదిలేసి వెళ్లారని వాళ్లు చెప్పడంతో బాలు, మీనా బాధపడతారు.

మౌనికకు సంజూ టెస్టులు

మరోవైపు మౌనికను టెస్టులంటూ సంజూ హాస్పిటల్ కు తీసుకెళ్తాడు. ఏం టెస్టులు చేయించావని తల్లి అడిగితే.. తమకు పిల్లలు పుడతారో లేదో అని తెలుసుకోవడానికంటాడు. నువ్వు కాపురం చేస్తే తెలుస్తుంది కదా అని తల్లి అంటుంది. కానీ లోపం ఎవరిలో ఉందో తెలుసుకోవాలి కదా అని మౌనికపై అనుమానం వ్యక్తం చేస్తాడు సంజూ. అతనికి తండ్రి కూడా సపోర్ట్ చేస్తాడు. దీంతో మౌనిక షాక్ తింటుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More