OTT Release: ఓటీటీలోకి ఒక్కరోజే ఒకేదాంట్లో ఏకంగా 6 సినిమాలు- తెలుగులో 3 ఇంట్రెస్టింగ్- హారర్ టు క్రైమ్ కామెడీ- ఎక్కడంటే?
OTT Release Movies On Amazon Prime: ఓటీటీ ప్రేక్షకుల కోసం ఇంటివద్దే వినోదాన్ని అస్వాదించేందుకు అమెజాన్ ప్రైమ్ వీడియో ఏకంగా ఆరు సరికొత్త చిత్రాలను అందుబాటులోకి తెచ్చింది. క్రైమ్ కామెడీ నుంచి రొమాంటిక్ డ్రామా వరకు అన్ని రకాల జోనర్ల సినిమాలు ప్రైమ్‌లో మే 29 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
OTT Release Movies On Amazon Prime: వారాంతం వచ్చిందంటే చాలు ఓటీటీ లవర్స్ సరికొత్త సినిమాల కోసం డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ వైపు ఆసక్తిగా చూస్తుంటారు. ప్రేక్షకులను అస్సలు బోర్ కొట్టించకుండా అలరించేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ముందుకు వచ్చింది.

తెలుగులో 3 ఇంట్రెస్టింగ్‌గా
మే 29 శుక్రవారం రోజున ఒకేసారి ఆరు డిఫరెంట్ జోనర్ల చిత్రాలను ఓటీటీ స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చింది. వీటిలో తెలుగులో 3 ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి. హారర్ నుంచి క్రైమ్ కామెడీ, రొమాంటిక్ డ్రామా వరకు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ ఆరు సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
1. గోదారి గట్టుపైన (తెలుగు) - విలేజ్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా
థియేటర్లలో మంచి బజ్ క్రియేట్ చేసిన 'మేమ్ ఫేమస్' ఫేమ్ సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా నటించిన స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథే ఈ 'గోదారి గట్టుపైన'. ఈ చిత్రానికి సుభాష్ చంద్ర దర్శకత్వం వహించారు.
కథ: భీమవరం సమీపంలోని ఒక పల్లెటూరిలో ఆటో నడుపుకునే రాజు (సుమంత్ ప్రభాస్) అనే యువకుడు, కాలేజీ విద్యార్థిని మాయ (నిధి ప్రదీప్) ప్రేమలో పడతారు. అయితే, మాయ తండ్రి శ్యామ్ బాబు (జగపతి బాబు) కూతురంటే విపరీతమైన ప్రాణం పెట్టే ఒక స్ట్రిక్ట్ తండ్రి. కూతురు ఎక్కడ ప్రేమలో పడి తనకు దూరమవుతుందోననే భయం ఆయనది. ఈ క్రమంలో రాజు, మాయల ప్రేమకథ ఎలాంటి మలుపులు తిరిగింది? తండ్రి, కూతుళ్ల మధ్య ఎమోషన్స్ ఎలా పండాయనేదే మిగిలిన కథ.
2. లీడర్ 2026 (తెలుగు డబ్బింగ్) - స్పై యాక్షన్ థ్రిల్లర్
తమిళంలో 'లెజెండ్' శరవణన్ హీరోగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన పాన్-ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'లీడర్'. ఆర్. ఎస్. దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్ల తర్వాత ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు ఆడియన్స్‌ను ఓటీటీ రిలీజ్ ద్వారా పలకరిస్తోంది.
స్టోరీ: తూత్తుకుడిలో ఒక సాధారణ మెకానిక్‌గా కూతురితో కలిసి జీవించే శక్తివేల్ (శరవణన్) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇంటర్నేషనల్ మాఫియా, పోర్ట్ అటాక్ ప్లాన్స్ వెనుక ఉన్న కుట్రలను ఛేదించే క్రమంలో శక్తివేల్ తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాల్సి వస్తుంది. ఒకప్పుడు ఇండియాలోనే అత్యంత పవర్‌ఫుల్ అండర్‌కవర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా పనిచేసిన శక్తివేల్, దేశాన్ని, తన కుటుంబాన్ని ముఠా నాయకుల నుంచి ఎలా కాపాడుకున్నాడనేదే ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా.
3. నవాబ్ కేఫ్ (తెలుగు) - ఫ్యామిలీ కామెడీ ఎమోషనల్ డ్రామా
యువ హీరో శివ కందుకూరి, తేజు అశ్విని జంటగా, రాజీవ్ కనకాల కీలక పాత్రలో నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'నవాబ్ కేఫ్'. ప్రమోద్ హర్ష ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు.
ప్లాట్: ఇంజనీరింగ్ పూర్తి చేసి ఎలాగైనా అమెరికా వెళ్లిపోవాలని కలలు కనే రాజా (శివ కందుకూరి) అనే కుర్రాడి కథ ఇది. రాజా తండ్రి రంగనాథ్ (రాజీవ్ కనకాల) హైదరాబాద్‌లో 400 ఏళ్ల వంశపారంపర్య చరిత్ర కలిగిన 'నవాబ్ కేఫ్' అనే టీ దుకాణాన్ని నడుపుతుంటాడు. ఆ స్థలాన్ని అమ్మేసి రూ.50 కోట్లు తీసుకోవాలని కొడుకు ఆశపడినా, తండ్రి మాత్రం కస్టమర్ల ముఖంలో ఆనందం కోసమే బతుకుతుంటాడు. అయితే హఠాత్తుగా తండ్రి చనిపోవడంతో రాజా ఆ కేఫ్‌ను ఎలా సెంటిమెంట్‌గా మార్చుకుని, తండ్రి అందించిన చాయ్ రుచిని కాపాడాడనేది హృదయానికి హత్తుకునేలా చూపిస్తుంది.
4. సీట్ ఎడ్జ్ (కన్నడ) - మైండ్ బ్లోయింగ్ హారర్ థ్రిల్లర్
కన్నడ బాక్సాఫీస్ వద్ద విమర్శకుల ప్రశంసలు అందుకున్న సిట్యుయేషనల్ హారర్ థ్రిల్లర్ 'సీట్ ఎడ్జ్'. చేతన్ శెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
కథ: యూట్యూబ్‌లో వైరల్ కంటెంట్, క్రియేటివ్ వ్లాగ్స్ చేస్తూ క్రేజ్ తెచ్చుకున్న సిద్ధు (సిద్ధు మూలిమని) అనే వ్లాగర్ అనుకోకుండా ఒక ఊహించని ప్రమాదంలో చిక్కుకుంటాడు. ఒక క్లోజ్డ్ స్పేస్ లో తను ఎదుర్కొన్న భయానక పరిస్థితులు, ప్రతి క్షణం ప్రాణాలు అరచేతిలో పెట్టుకునేలా సాగే సీన్లు ప్రేక్షకులను తీవ్ర థ్రిల్‌కి గురిచేస్తాయి. అక్కడ నుంచి తప్పించుకోవడానికి సమయస్ఫూర్తి, ధైర్యం ఎలా ఉపయోగపడ్డాయనేది కథ.
5. సుఖమానో సుఖమన్ (మలయాళం) - రొమాంటిక్ ఫాంటసీ కామెడీ
మలయాళ సినిమాలకు ఉండే ప్రత్యేకమైన ఫీల్ గుడ్ టచ్‌తో వచ్చిన రొమాంటిక్ ఫాంటసీ మూవీ 'సుఖమానో సుఖమన్'. అరుణ్ లాల్ రామచంద్రన్ ఈ క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించారు.
స్టోరీ: మలయాళ యంగ్ టాలెంట్ మాథ్యూ థామస్, దేవిక సంజయ్ జంటగా నటించిన ఈ సినిమా ఒక విభిన్నమైన ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌తో సాగుతుంది. ఒక యువ జంట మధ్య జరిగే అద్భుతమైన సంఘటనలు, ప్రేమ, కుటుంబ విలువలు, కామెడీ మేళవింపుతో ఈ వీకెండ్‌కు ఒక పర్‌ఫెక్ట్ ఛాయిస్‌గా నిలుస్తుంది.
6. ది లాస్ట్ వైకింగ్ (ఇంగ్లీష్) - క్రైమ్ కామెడీ డ్రామా
హాలీవుడ్ స్టార్ నటుడు మ్యాడ్స్ మిక్కెల్సన్ ప్రధాన పాత్రలో డానిష్, స్వీడిష్ కోణంలో వచ్చిన ఇంటర్నేషనల్ క్రైమ్ కామెడీ డ్రామా 'ది లాస్ట్ వైకింగ్'. ఆండర్స్ థామస్ జెన్సన్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేశారు.
ప్లాట్: దాదాపు 15 ఏళ్ల జైలు శిక్ష తర్వాత బయటకు వచ్చిన అంకర్ (నికోలాయ్ లీ కాస్), గతంలో తన సోదరుడు మన్‌ఫ్రెడ్ (మ్యాడ్స్ మిక్కెల్సన్) అడవిలో దాచిపెట్టిన దొంగతనం సొమ్మును తిరిగి దక్కించుకోవాలని ప్లాన్ చేస్తాడు. కానీ, ఒకే ఒక సమస్య.. ఆ సొమ్ము ఎక్కడ దాచాడో సోదరుడు మన్‌ఫ్రెడ్‌కు అస్సలు గుర్తుండదు. మతిమరుపు ఉన్న సోదరుడిని తీసుకుని ఆ డబ్బు కోసం అంకర్ చేసే ప్రయాణం, అందులో జరిగే హాస్యాస్పద సంఘటనల సమాహారమే ఈ సినిమా.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


