Trikala Review: త్రికాల రివ్యూ- భూమిని శాసించేందుకు మేల్కొనే అసుర రాజు- శ్రద్ధా దాస్ ఫాంటసీ హారర్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

Trikala Movie Review In Telugu And Rating: హీరోయిన్ శ్రద్దా దాస్, హీరో మాస్టర్ మహేంద్రన్ నటించిన మైథలాజికల్ సైకలాజికల్ ఫాంటసీ హారర్ థ్రిల్లర్ మూవీ త్రికాల. పునర్జన్మ, కర్మ సిద్ధాంతం, తాంత్రిక శక్తుల నేపథ్యంలో మణి తెల్లగూటి తెరకెక్కించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి త్రికాల రివ్యూలో తెలుసుకుందాం.

Published on: May 28, 2026, 21:14:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Trikala Review And Rating: తెలుగు సినీ పరిశ్రమలో హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు కొదవలేదు. కానీ, పౌరాణిక అంశాలకు సైకలాజికల్ హారర్‌ను జోడించి ‘డార్క్ ఫాంటసీ’ జోనర్‌లో సినిమాలు రావడం చాలా అరుదు. సరిగ్గా ఇదే విభిన్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే ‘త్రికాల’. ‘ఎ స్క్రిప్ట్ ఆఫ్ గాడ్’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్.

త్రికాల రివ్యూ- భూమిని శాసించేందుకు మేల్కొనే అసుర రాజు- శ్రద్ధా దాస్ ఫాంటసీ హారర్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
త్రికాల రివ్యూ- భూమిని శాసించేందుకు మేల్కొనే అసుర రాజు- శ్రద్ధా దాస్ ఫాంటసీ హారర్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

తుంబాడ్, కాంతార తరహాలో

బ్యూటిఫుల్ శ్రద్ధా దాస్ ప్రధాన పాత్ర పోషించిన త్రికాల సినిమాకు డైరెక్టర్ మణి తెల్లగూటి దర్శకత్వం వహించారు. హీరో మాస్టర్ మహేంద్రన్, అజయ్, ఆమని, సాహితి అవాంచ, నంద దొరై, రోబో శంకర్, రౌడీ రోహిణి (జబర్దస్త్) తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం.. టీజర్లు, ట్రైలర్లతోనే ‘తుంబాడ్’, ‘కాంతార’ వంటి చిత్రాల తరహా ఒక కొత్త మిస్టిక్ ప్రపంచాన్ని పరిచయం చేసింది.

చాగంటి ప్రొడక్షన్ సమర్పణలో నిర్మాత రాధికా శ్రీనివాస్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన మైథలాజికల్ సైకలాజికల్ ఫాంటసీ హారర్ థ్రిల్లర్ త్రికాల చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇవాళ (మే 28 థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో నేటి త్రికాల రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

శతాబ్దాల క్రితం “కుమారి ఖండం” అనే ఒక పౌరాణిక భూభాగంలో ఈ కథ మొదలవుతుంది. అక్కడి ప్రాచీన మునులు అత్యంత శక్తివంతమైన తాంత్రిక గ్రంథాలను, రహస్యాలను అసురుల (రాక్షసుల) చేతికి చిక్కకుండా కాపాడటానికి “శక్తి ఏథా” అనే దైవిక ఆయుధాన్ని సృష్టిస్తారు. దానిని వీరరాజు త్రికాల వర్మకు అప్పగిస్తారు. అసుర శక్తులతో పోరాడుతూ త్రికాల వర్మ మరణించగా, మునులు అతని ఆత్మను ఒక ‘మాయా అండం’లో బంధిస్తారు. కలియుగంలో ప్రపంచానికి ముప్పు వచ్చినప్పుడు ఆ ఆత్మ మళ్లీ మేల్కొంటుందని చెబుతారు.

ప్రస్తుత కాలానికి వస్తే.. శివ (మాస్టర్ మహేంద్రన్) మిస్ అయిన తన లవర్ నిధి (సాహితి) కోసం నగరానికి వస్తాడు. ఈ క్రమంలోనే అతనికి వైతరణ్ (అజయ్) అనే విచిత్రమైన వ్యక్తి గురించి తెలుస్తుంది. సూర్యరశ్మిని అస్సలు తట్టుకోలేని ‘పోర్ఫిరియా’ అనే అరుదైన వ్యాధితో బాధపడే వైతరణ్ గత జన్మలో త్రికాల వర్మ.

మానసిక ఒత్తిడి వల్ల అతను తన కన్నతండ్రిని, పినతల్లి (ఆమని)ని చంపి, తాను కూడా ఆత్మహత్య చేసుకుంటాడు. కానీ అతని ఆత్మ తన పాత బంగ్లాలోనే తిరుగుతుంటుంది. ఆ ఇంట్లోకి సైకియాట్రిస్ట్ మాయ (శ్రద్ధా దాస్) ఓ పని మీద వచ్చి చిక్కుకుపోతుంది. మరోవైపు భూమిని శాసించడానికి అసుర రాజు మేల్కొంటాడు. ఆ తర్వాత ఏమైంది? ఆ మాయా అండం ఎలా యాక్టివేట్ అయింది? త్రికాల వర్మ ఆత్మను ఎలా మేల్కొల్పారు? ఈ కథలోకి శివ ఎలా వచ్చాడు? ఈ క్రమంలో మాయ పాత్ర ఏంటీ? చివరకు దైవిక శక్తులు గెలిచాయా లేదా? అనేదే మిగతా సినిమా.

విశ్లేషణ:

ఈ సినిమాకు ప్రధాన బలం దీని విలక్షణమైన కాన్సెప్ట్. కర్మ సిద్ధాంతాన్ని కేవలం మాటల్లో చెప్పకుండా పాత్రల పునర్జన్మలు, వారి మానసిక సంఘర్షణల ద్వారా దర్శకుడు చూపించిన తీరు అద్భుతంగా ఉంది. వైతరణ్ పాత్రలో నటుడు అజయ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సూర్యకాంతిని చూడలేని ఒక మనిషిలోని భయం, అంతర్మథనాన్ని ఆయన కళ్లలోనే పలికించారు.

ఆయన కోసం డిజైన్ చేసిన మాస్క్‌లు, కాస్ట్యూమ్స్ చాలా కొత్తగా ఉన్నాయి. ఇక హీరోగా మాస్టర్ మహేంద్రన్ అమాయకత్వం, ప్రేమ, భయం వంటి నవరసాలను చాలా సహజంగా పండించారు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో ఆయన నటన హృదయాలను కదిలిస్తుంది.

సైకియాట్రిస్ట్ మాయ పాత్రలో శ్రద్ధా దాస్ గ్లామర్‌కు దూరంగా, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో ఒదిగిపోయారు. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ఒక ప్రత్యేకమైన డార్క్ టోన్‌ను తీసుకొచ్చింది. సీనియర్ హీరోయిన్ ఆమని తల్లిగా, భయంతో కూడిన భావోద్వేగాలను తన నటనతో మరో స్థాయికి తీసుకెళ్లారు.

సాంకేతిక విభాగాల మ్యాజిక్

దర్శకుడు మణి తెల్లగూటిని కేవలం కథకుడిగా కాకుండా ఒక ‘టెక్నికల్ ఫిల్మ్ మేకర్’గా అభినందించాలి. ప్రతి ఫ్రేమ్‌ను విజువలైజ్ చేసిన విధానం స్క్రీన్‌పై స్పష్టంగా కనిపిస్తుంది. నీడలు, మసక వెలుతురు, నెమ్మదిగా కదిలే కెమెరాతో ఆయన సృష్టించిన డార్క్ మిస్టిక్ యూనివర్స్ ప్రేక్షకుడిని థియేటర్ సీట్లో కూర్చోబెడుతుంది. పునర్జన్మ, కర్మ సిద్ధాంతం, తాంత్రిక శక్తుల అంశాలతో థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా తెరకెక్కించారు.

సినిమాటోగ్రాఫర్ పవన్ చెన్నా అందించిన విజువల్స్ ఈ సినిమాకు ప్రాణంగా నిలిచాయి. చీకటి ఇంక్-బ్లాక్ టోన్స్ మధ్య నుంచి వచ్చే గోల్డెన్ లైట్ బీమ్స్ లైటింగ్ స్టైల్ హాలీవుడ్ డార్క్ ఫాంటసీ సినిమాలను తలపించింది. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్‌లా ఉంది. హర్షవర్ధన్ రామేశ్వరం, షాజిత్ హుమాయన్ అందించిన సౌండ్ డిజైన్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ థియేటర్లలో రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి.

ఇంటర్వెల్ గ్రాఫిక్స్

ఇక వీఎఫ్ఎక్స్, సీజీఐ (CGI) వర్క్ చాలా రిచ్‌గా ఉంది. ఇంటర్వెల్ బ్లాక్‌లో వచ్చే గ్రాఫిక్స్ సీక్వెన్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా నిర్మాత రాధికా శ్రీనివాస్ ఎక్కడా రాజీ పడకుండా సినిమాను అత్యున్నత ప్రమాణాలతో నిర్మించారు.

ఫైనల్‌గా చెప్పాలంటే?

‘త్రికాల’ అనేది రెగ్యులర్ దెయ్యం కథలతో వచ్చే రొటీన్ హారర్ సినిమా కాదు. ఇది మైథలాజికల్ రహస్యాలు, సైకాలజికల్ థ్రిల్లర్, డార్క్ ఫాంటసీల అద్భుత కాంబినేషన్‌తో మెప్పిస్తుంది. కొత్త తరహా కథలను, హాలీవుడ్ స్థాయి విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇష్టపడే సినీ ప్రియులకు త్రికాల మంచి ఆప్షన్.

రేటింగ్: 2.75/5

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More