First Time Review: ఫస్ట్ టైమ్ రివ్యూ- కొత్త సృష్టి కోసం పరితపించే ఏలియన్స్- సౌరభ్ ధింగ్రా హీరో డెబ్యూ మూవీ ఎలా ఉందంటే?
First Time Movie Review In Telugu: తక్కువ బడ్జెట్‌తో భారీ విజువల్ వండర్‌గా తెరకెక్కిన తెలుగు సైన్స్ ఫిక్షన్ చిత్రం 'ఫస్ట్ టైమ్'. సౌరభ్ ధింగ్రా హీరోగా డెబ్యూట్ చేసిన ఈ సినిమాలో అనికా విక్రమన్ హీరోయిన్‌గా చేసింది. హేమంత్ ఇప్పలపల్లి తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో నేటి ఫస్ట్ టైమ్ రివ్యూలో తెలుసుకుందాం.
First Time Review And Rating: తెలుగు చిత్రసీమలో వినూత్న ప్రయోగాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. వైవిధ్యమైన కథాంశాలతో వచ్చే చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద సంచలనాలు సృష్టించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అదే బాటలో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) బ్యాక్‌డ్రాప్‌తో హేమంత్ ఆర్ట్స్ పతాకంపై రూపొందిన తాజా చిత్రమే 'ఫస్ట్ టైమ్'.

మానవ మేథస్సుకు
కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పైనే ఆధారపడకుండా, మానవ మేథస్సుకు (Human Intelligence) విజువల్ పవర్‌ను జోడించి దర్శకుడు హేమంత్ ఇప్పలపల్లి ఈ ఫస్ట్ టైమ్ సినిమాను తెరకెక్కించారు. హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ లవర్ సౌరభ్ ధింగ్రా హీరోగా ఈ సినిమాతో అరంగేట్రం చేశాడు. అనికా విక్రమన్ హీరోయిన్‌గా నటించింది.
ఫస్ట్ టైమ్ రివ్యూ
అలాగే, బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సార్థక్ సెకండ్ లీడ్‌గా యాక్ట్ చేశాడు. తెలుగు సైన్స్ ఫిక్షన్ లవ్ రొమాంటిక్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఫస్ట్ టైమ్ మూవీ ఇవాళ (మే 22) థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి ఫస్ట్ టైమ్ రివ్యూలో చూద్దాం.
కథ:
ఈ సినిమా కథ క్రీస్తు శకం 2304 (2304 AD)లో ప్రారంభమవుతుంది. అసలు కలియుగం ఎలా అంతమైంది? ఆ తర్వాత నూతన సృష్టి, సరికొత్త భారతదేశం ఎలా ఆవిర్భవించాయి? అనే ఆసక్తికరమైన పాయింట్‌తో దర్శకుడు కథను నడిపించారు. భూమిపైకి వచ్చిన ఏలియన్లకు (గ్రహాంతరవాసులు) గతంలో జరిగిన సంఘటనలను వివరిస్తూ.. ఒక పవిత్రమైన స్త్రీ నూతన సృష్టికి ఎలా కారణమైందో కథలో చూపిస్తారు.
ఈ క్రమంలో హీరోయిన్ అనికా విక్రమన్‌ను దక్కించుకోవడానికి ఆమె బావ భూపాల్ రాజు, మరో విలన్ శివకుమార్ రామచంద్రవరపు, అలాగే అఖిల్ సార్థక్ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి అనికా ఎలా తప్పించుకుంది? ఆమెకు సౌరభ్ ధింగ్రా ఎలా పరిచయమయ్యాడు? చివరకు నూతన భారత ప్రపంచం ఎలా ఏర్పడింది? కొత్త సృష్టికి అనికా విక్రమన్‌కు ఉన్న సంబంధం ఏంటీ? అనేది తెలియాలంటే ఫస్ట్ టైమ్ మూవీని చూడాల్సిందే.
విశ్లేషణ:
ఫస్ట్ టైమ్ మూవీ ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్. కొత్తగా ఒక ప్రపంచాన్ని సృష్టించేందుకు ఏలియన్స్, మానవులు ఏ విధంగా ఆలోచించారు, అందుకోసం ఏం చేశారు. దానికి ఎవరు కావాల్సి వచ్చింది అనే అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్. సినిమా ప్రారంభం నుంచి కథలోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత అనికా విక్రమన్ పరిచయం, ఆమెతో సృష్టికి ముడిపడి ఉన్న సంబంధం వంటి విషయాలు ఇంట్రెస్ట్ కలిగిస్తాయి.
మరోవైపు భారత దేశాన్ని కాకుండా భారత ప్రపంచాన్ని సృష్టించాలని మానవాళి చేసే ప్రయత్నం సైతం ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు, విజువల్స్ మంచి థ్రిల్ ఇస్తాయి. కొన్ని సీన్స్ డైరెక్టర్ ఊహను ప్రశంసించేలా ఉన్నాయి. అయితే, ప్రథమార్ధంలో కొన్ని సాగదీత సీన్లు మైనస్‌గా అనిపిస్తాయి.
మంచి ట్విస్టుతో క్లైమాక్స్
ఇంటర్వెల్ ట్విస్ట్ పర్వాలేదు. సెకండాఫ్‌లో వచ్చే ఉత్కంఠభరిత సన్నివేశాలు ప్రేక్షకుడిని సీట్లకు కట్టిపడేస్తాయి. క్లైమాక్స్ మంచి ట్విస్టుతో ముగుస్తుంది. నిజానికి ఇది ఒక సరికొత్త ప్రయోగం అని చెప్పుకోవచ్చు. ఆ ప్రయోగాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా తెరకెక్కించడంలో దర్శకుడు హేమంత్ ఇప్పలపల్లి దాదాపుగా సక్సెస్ అయ్యారనే చెప్పుకోవచ్చు.
మానవ మేధస్సుతో రూపొందించిన విజువల్స్ అదిరిపోయాయి. గ్రాఫిక్స్ సరికొత్త మాయజాలాన్ని చూపించాయి. ఎడిటింగ్ ఇంకాస్తా బెటర్‌గా చేసి ఉండాల్సింది. బీజీఎమ్ సన్నివేశానికి తగినట్లుగా మూడ్ సెట్ చేసింది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. చిన్న బడ్జెట్‌లో ఇలాంటి అవుట్‌పుట్ రావడం మెచ్చుకోదగిన విషయమే.
కథకు బలం చేకూర్చిన నటీనటులు
తొలి చిత్రమే అయినా హీరో సౌరభ్ ధింగ్రా తెరపై చక్కని పరిణతితో నటించాడు. యాక్షన్, ఎమోషనల్ సీన్లలో మెప్పించాడు. అలాగే, హీరోయిన్ అనికా విక్రమన్ గ్లామర్‌తోనే కాకుండా తన నటనతోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కథను మలుపు తిప్పే కీలక పాత్రలో బిగ్ బాస్ అఖిల్ సార్థక్ ఒదిగిపోయాడు.
ఫైనల్‌గా చెప్పాలంటే?
విలన్లుగా భూపాల్ రాజు, శివకుమార్ తమ నటనతో మెప్పించారు. సీనియర్ నటీనటులు అన్నపూర్ణమ్మ, మైమ్ గోపి, అజయ్ రత్నం, గాయత్రి గుప్త తమ అనుభవంతో పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. 'ఢీ' పండు డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ మాస్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఫైనల్‌గా చెప్పాలంటే కొత్త తరహా సినిమాలను, విజువల్ ఎఫెక్ట్స్‌ను ఇష్టపడే వారికి 'ఫస్ట్ టైమ్' ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది.
రేటింగ్: 2.75/5
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


