Saurabh Payal: ఇప్పుడు నా వల్ల నువ్వు గర్వపడేలా చేస్తాను.. హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కోసం పాట పాడిన హీరో సౌరభ్ ధింగ్రా

Saurabh Dhingra On Payal Rajput At First Time Event: సౌరభ్ ధింగ్రా హీరోగా పరిచయం అవుతున్న లేటెస్ట్ తెలుగు సినిమా ఫస్ట్ టైమ్. ఇందులో అనికా విక్రమన్ హీరోయిన్‌గా చేసింది. తాజాగా ఫస్ట్ టైమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో పాయల్ రాజ్‌పుత్‌పై హీరో సౌరభ్ ధింగ్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Published on: May 19, 2026, 12:54:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Saurabh Dhingra On Payal Rajput At First Time Event: హేమంత్ ఇప్పలపల్లి కథ రాసుకుని తానే దర్శక నిర్మాతగా వ్యవహరించిన సినిమా ఫస్ట్ టైమ్. తక్కువ బడ్జెట్‌తో హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాతో సౌరభ్ ధింగ్రా హీరోగా పరిచయం అవుతుండగా.. బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సార్థక్ సెకండ్ హీరోగా చేశాడు.

ఇప్పుడు నా వల్ల నువ్వు గర్వపడేలా చేస్తాను.. హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కోసం పాట పాడిన హీరో సౌరభ్ ధింగ్రా
ఇప్పుడు నా వల్ల నువ్వు గర్వపడేలా చేస్తాను.. హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కోసం పాట పాడిన హీరో సౌరభ్ ధింగ్రా

ఫస్ట్ టైమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్

అలాగే, ఫస్ట్ టైమ్ మూవీలో అనికా విక్రమన్ హీరోయిన్‌గా చేసింది. మైమ్ గోపి, శివ, భూపాల్ రాజు, గాయత్రి గుప్త, అన్నపూర్ణమ్మ, అజయ్ రత్నం, ఢీ పండు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

తాజాగా ఫస్ట్ టైమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌తోపాటు ఈ పిల్ల నేను అనుకోనేలేదు సాంగ్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా తన గర్ల్‌ఫ్రెండ్, హీరోయిన్ పాయల్ రాజ్‌‌పుత్‌పై హీరో సౌరభ్ ధింగ్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

సౌరభ్ ధింగ్రా కామెంట్స్

హీరో సౌరభ్ ధింగ్రా మాట్లాడుతూ : "ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ థాంక్స్. మాకు వెన్నుండి మా సినిమాను మార్కెట్‌లోకి తీసుకుని వెళ్లిన మా స్పందన గారికి స్పెషల్ థాంక్స్. ఈ సినిమా కోసం మా దర్శకుడు తమ కుటుంబానికి దూరంగా ఉండి ఎంతో కష్టపడ్డారు" అని అన్నారు.

గర్వపడేలా చేస్తాను

"ఈ కార్యక్రమానికి వచ్చి అతిధులుగా వచ్చి మా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వెళ్లేందుకు తోడ్పడినందుకు చాలా థాంక్స్. నాకు ప్రతి విషయంలో నాకు అండగా నిలబడి నన్ను ప్రోత్సహిస్తూ వచ్చిన పాయల్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంతకాలం నీ వల్ల నేను గర్వపడ్డాను, ఇప్పుడు నా వల్ల నువ్వు గర్వపడేలా చేస్తాను" అని హీరో సౌరభ్ ధింగ్రా తెలిపాడు.

హత్తుకున్న పాయల్

అనంతరం ఆర్ఎక్స్ 100 మూవీలోని సూపర్ హిట్ సాంగ్ పిల్లా రా అనే పాటను పాయల్ కోసం పాడి వినిపించాడు హీరో సౌరభ్ ధింగ్రా. దాంతో స్టేజీపైన ప్రియుడు సౌరభ్ ధింగ్రాను హత్తుకుంది పాయల్ రాజ్‌పుత్.

సర్వం పెట్టీ పని చేశారు

హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. ఈ కార్యక్రమానికి వచ్చి మా సినిమాకు సపోర్ట్ చేస్తున్న మీడియా వారికి థాంక్స్. ముందుగా దర్శకులు హేమంత్ గారికి ఆల్ ది బెస్ట్. ఆయన ఈ సినిమా కోసం సర్వం పెట్టీ పని చేశారు. విడుదల తర్వాత ఈ సినిమాలో ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ గురించి మాట్లాడతారు" అని చెప్పుకొచ్చారు.

పాయల్ రాజ్‌పుత్ కామెంట్స్

"ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి రికార్డు సృష్టిస్తుంది. అలాగే చిత్రంలో నటించిన నటీనటులకు మంచి గుర్తింపు వస్తుంది అని అర్థం అవుతుంది. సౌరభ్ గురించి చెప్పాలి అంటే సినిమా అనేది ఒక ప్రతిజ్ఞలా తీసుకుని ఈ సినిమా కోసం పని చేశారు. చాలా ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను" అని హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తన స్పీచ్ ముగించారు.

హీరోయిన్ అనికా కామెంట్స్

ఫస్ట్ టైమ్ మూవీ హీరోయిన్ అనికా విక్రమన్.. "మా సినిమాకు ముందు నుంచి అండగా నిలబడిన పాయల్‌కు ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన అందరికీ థాంక్స్. సినిమాను అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను" అని పేర్కొన్నారు.

దర్శకుడు ఏమన్నాడంటే

"ఈ సినిమాకు వెనుక ఉండి మాకు దైర్యం ఇచ్చిన వ్యక్తి పాయల్. ఈ కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థాంక్స్. అందరూ ఈ సినిమాను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాను అందరూ సినిమా థియేటర్‌లో చూడాలి" అని ఫస్ట్ టైమ్ మూవీ డైరెక్టర్ హేమంత్ ఇప్పలప్లలి కోరారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More