Sourabh Dhingra First Time: హీరోగా పాయల్ రాజ్‌పుత్ బాయ్‌ఫ్రెండ్ ఎంట్రీ- రేపే సౌరభ్ ధింగ్రా ఫస్ట్ టైమ్ మూవీ ట్రైలర్!

Payal Rajput Lover Sourabh Dhingra First Time Movie: టాలీవుడ్ బ్యూటిపుల్ హీరోయిన్ పాయల్ రాజ్‌ఫుత్ లవర్ సౌరభ్ ధింగ్రా హీరోగా తెలుగులో ఎఁట్రీ ఇస్తున్నాడు. ఆ సినిమాకు ఫస్ట్ టైమ్ అని టైటిల్ పెట్టారు. రేపు అంటే ఏప్రిల్ 28న ఫస్ట్ టైమ్ ట్రైలర్‌ను పాయల్ రాజ్‌పుత్ చేతుల మీదుగానే విడుదల చేయనున్నారు.

Updated on: Apr 27, 2026, 14:10:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Payal Rajput Lover Sourabh Dhingra First Time Movie: టాలీవుడ్‌లో తొలి సినిమా ఆర్ఎక్స్ 100తో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న బ్యూటిపుల్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. ఈ మూవీ తర్వాత మంగళవారం మూవీతో అంతటి హిట్ సాధించింది. తెలుగులో అనేక సినిమాలతోపాటు ఓటీటీ సిరీస్ 3 రోజెస్‌తో అలరించింది. అలాంటి పాయల్ రాజ్‍‌పుత్ బాయ్‌ఫ్రెండ్ ఇప్పుడు హీరోగా టాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.

హీరోగా పాయల్ రాజ్‌పుత్ బాయ్‌ఫ్రెండ్ ఎంట్రీ- రేపే సౌరభ్ ధింగ్రా ఫస్ట్ టైమ్ మూవీ ట్రైలర్!
హీరోగా పాయల్ రాజ్‌పుత్ బాయ్‌ఫ్రెండ్ ఎంట్రీ- రేపే సౌరభ్ ధింగ్రా ఫస్ట్ టైమ్ మూవీ ట్రైలర్!

బుల్లితెర షోపై పరిచయం

పాయల్ రాజ్‌పుత్ బాయ్‌ఫ్రెండ్ పేరు సౌరభ్ ధింగ్రా. ఓ బుల్లితెర షో ద్వారా తన ప్రియుడు సౌరభ్ ధింగ్రాను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది పాయల్ రాజ్‌పుత్. వీరిద్దరు కలిసి జీ మహోత్సవం కార్యక్రమంలో ఓ పాటకు రొమాంటిక్ డ్యాన్స్ కూడా చేశారు. ఇప్పుడు సౌరభ్ ధింగ్రా తెలుగులో హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.

తక్కువ బడ్జెట్‌తో

సౌరభ్ ధింగ్రా హీరోగా తెరకెక్కుతున్న సినిమా పేరు ఫస్ట్ టైమ్. ఈ సినిమాకు హేమంత్ ఇప్పనపల్లి కథ రాసుకుని తానే దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అతి తక్కువ బడ్జెట్‌తో నిర్మిస్తున్న సినిమా అయినప్పటికీ భారతదేశంలోనే అతిపెద్ద ప్రతిష్టాత్మక వీఎఫ్ఎక్స్ మూవీగా నిర్మిస్తున్నారు దర్శకనిర్మాతలు.

బిగ్ బాస్ అఖిల్ సార్థక్ కూడా

అయితే, ఫస్ట్ టైమ్ మూవీ ట్రైలర్‌ను ఏప్రిల్ 28న అంటే రేపు పాయల్ రాజ్‌పుత్ చేతుల మీదుగా లాంచ్ చేయనున్నారు. ఈ సినిమాలో సౌరబ్ ధింగ్రాతోపాటు 'బిగ్ బాస్' ఫేమ్ అఖిల్ సార్థక్ సెకండ్ లీడ్‌గా చేస్తున్నాడు. అలాగే, అనిక్క విక్రమన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైమ్ గోపి, శివ, భూపాల్ రాజు, గాయత్రి గుప్త, అన్నపూర్ణమ్మ, అజయ్ రత్నం, ఢీ పండు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

కాంప్రమైజ్ కాకుండా

ఫస్ట్ టైమ్ సినిమాకు శ్రీ వెంకట్, సూరజ్ ఎస్ కురుప్ సంగీతాన్ని అందిస్తుండగా.. వేణు మురళీధర్, రామ్ సినిమాటోగ్రాఫర్లుగా పనిచేశారు. చెప్పుకోడానికి చిన్న బడ్జెట్ సినిమా అయినా టెక్నికాలిటీస్, విజువల్స్ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా గ్రాండ్‌గా ఫస్ట్ టైమ్ మూవీని తెరకెక్కిస్తున్నారు హేమంత్ ఇప్పనపల్లి.

హై రేంజ్ గ్రాఫిక్స్‌తో

ఏఐ టెక్నాలజీని ఎక్కడ ఇన్వాల్వ్ చేయకుండా హెచ్ఐ (హ్యూమన్ ఇంటలిజెన్స్)తో హై రేంజ్ గ్రాఫిక్స్‌తో ఫస్ట్ టైమ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే, పాయల్ రాజ్‌పుత్ బాయ్‌ఫ్రెండ్ సౌరభ్ ధింగ్రా హీరోగా టాలీవుడ్ ఆడియెన్స్‌ను ఎంతమేరకు మెప్పిస్తాడో వేచి చూడాలి.

పాయల్ రాజ్‌పుత్ సినిమాలు

ఇక ఆర్ఎక్స్ 100తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన బ్యూటిఫుల్ పాయల్ రాజ్‌పుత్ ఆ తర్వాత ఆర్‌డీఎక్స్ లవ్, వెంకీ మామ, డిస్కో రాజా, జిన్నా, తీస్‌మార్ ఖాన్, మంగళవారం, రక్షణ, మాయా పేటిక, లీడర్ (2026) వంటి సినిమాలతో మెప్పించింది. అయితే, వీటిలో ఆర్ఎక్స్ 100, మంగళవారం సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాయి.

ఓటీటీ సినిమాలతో

వీటితోపాటు అనగనగా ఓ అతిథి, 3 రోజెస్ వంటి ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌తో సైతం అట్రాక్ట్ చేసింది ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్. ప్రస్తుతం పంజాబీలో కామెడీ డ్రామాగా తెరకెక్కుతోన్న ఖుష్‌కబరీ మూవీతో బిజీగా ఉంది పాయల్.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More