TV Heroine: బుల్లితెర హీరోయిన్‌కు లివర్ క్యాన్సర్- మానసికంగా కుంగదీస్తున్న పరీక్షలు- ఎమ్ఆర్ఐ స్కాన్‌లో ఏడ్చేసిన దీపికా!
TV Actress Dipika Kakar Crying In MRI Scan: లివర్ క్యాన్సర్ నుంచి కోలుకుంటున్న ప్రముఖ బుల్లితెర హీరోయిన్ దీపికా కక్కర్ తాజాగా తన తాజా ఎమ్‌ఆర్‌ఐ స్కాన్ అనుభవాలను పంచుకున్నారు. పరీక్ష సమయంలో తీవ్ర ఆందోళనకు గురై కన్నీరు పెట్టుకున్నట్లు వెల్లడించిన ఆమె తన తాజా ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇచ్చారు.
TV Heroine Dipika Kakar Crying In MRI Scan: 'సిమర్'గా హిందీ బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి దీపికా కక్కర్ ప్రస్తుతం తన జీవితంలో అత్యంత కఠినమైన దశను ఎదుర్కొంటున్నారు. గత కొంతకాలంగా స్టేజ్ 2 లివర్ క్యాన్సర్ (Stage 2 Liver Cancer) తో పోరాడుతున్న దీపికా కక్కర్ తాజాగా తన ఆరోగ్యానికి సంబంధించిన కీలక అప్‌డేట్స్ ఇచ్చారు. తన భర్త షోయబ్ ఇబ్రహీం యూట్యూబ్ ఛానెల్ వేదికగా తాము ఎదుర్కొంటున్న మానసిక, శారీరక సంఘర్షణను అభిమానులతో పంచుకున్నారు.

ఎమ్ఆర్ఐ మిషన్‌లో ఏడుపు ఆగలేదు
క్యాన్సర్ చికిత్సలో భాగంగా వైద్యుల సూచన మేరకు దీపికా ప్రతి నెలా ఎమ్‌ఆర్‌ఐ (MRI) స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది. తాజాగా జరిగిన స్కాన్ సమయంలో ఆమె తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యారు.
"స్కాన్ మిషన్‌లోకి వెళ్లే ముందు, వెళ్లిన తర్వాత కూడా నా ఏడుపు ఆగలేదు. చాలా భయమేసింది. కానీ, కొన్నిసార్లు ఏడవడం వల్ల మనలోని ఆందోళన బయటకు పోతుంది. ఆ తర్వాత మనం మరింత బలంగా తయారవుతామని నేను నమ్ముతాను" అని దీపికా కక్కర్ ఎమోషనల్ అయ్యారు. సాధారణంగా ఇలాంటి పరీక్షలు క్యాన్సర్ బాధితుల్లో తీవ్రమైన మానసిక వేదనను మిగిలిస్తాయి, దీపికా కూడా అదే స్థితిని అనుభవించారు.
రిపోర్ట్స్‌లో రెండు చుక్కలు.. ఆందోళనలో కుటుంబం
ఈ నెలకు సంబంధించిన ఎమ్‌ఆర్‌ఐ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత షోయబ్ ఇబ్రహీం మరిన్ని వివరాలు వెల్లడించారు. రిపోర్ట్‌లో రెండు చిన్న చుక్కలు (Dots) కనిపించినట్లు ఆయన పేర్కొన్నారు. దీనిపై దీపికా స్పందించారు.
"ఆ చుక్కలు చాలా చిన్నవిగా ఉన్నాయి. ప్రస్తుతానికి వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెప్పారు. అయితే, వచ్చే నెల మళ్లీ స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ చుక్కలు పెరిగినా లేదా మళ్లీ కనిపిస్తే వెంటనే చికిత్స ప్రారంభించాలి" అని వివరించారు. ఈ వారం నుండే దీపికాకు 'ఇమ్యునోథెరపీ' (Immunotherapy) ప్రారంభించనున్నట్లు షోయబ్ తెలిపారు.
పోరాటం ఆగదు: ఆపరేషన్ నుండి రికవరీ వరకు
దీపికా కక్కర్ ఆరోగ్య ప్రయాణం గత ఏడాది కాలంగా ఎన్నో ఒడిదుడుకులతో సాగుతోంది. ఫిబ్రవరిలో కడుపులోని తిత్తి (Stomach Cyst) తొలగింపు కోసం దీపికా కక్కర్ సర్జరీ చేయించుకున్నారు. ఆ తర్వాత జూన్ 2025లో లివర్ ట్యూమర్ తొలగింపు శస్త్రచికిత్స జరిగింది.
కీమోథెరపీ సెషన్లు, హాస్పిటల్ తిరుగుళ్లు ఉన్నప్పటికీ, దీపికా కక్కర్ తన యూట్యూబ్ వ్లాగ్స్ ద్వారా అభిమానులతో టచ్‌లోనే ఉంటున్నారు. తన కుమారుడు రుహాన్ సంరక్షణ, ఇంటి బాధ్యతలు చూసుకుంటూనే ఈ మహమ్మారితో పోరాడుతున్నారు దీపికా.
బిగ్ బాస్ విజేతగా నిలిచి
బిగ్ బాస్ సీజన్ 12 విజేతగా నిలిచిన దీపికా కక్కర్ ఇటీవల సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ షోలో కూడా కనిపించారు. అయితే ఆరోగ్య సమస్యల కారణంగా ఆ షో నుంచి మధ్యలోనే తప్పుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ, నెలకు ఒకసారి జరిగే ఈ అనారోగ్య పరీక్షలు బుల్లితెర హీరోయిన్ దీపికా కక్కర్‌ను మానసికంగా కుంగదీస్తున్నాయి. ఏది ఏమైనా, తన భర్త షోయబ్ అండతో ఆమె ఈ యుద్ధంలో గెలుస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నారు దీపికా కక్కర్ ఇబ్బహీం.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


