Wedding: ప్రియురాలిని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ స్టార్ రజత్ దలాల్- హింట్ ఇచ్చి మరి! కానీ వధువు ఎవరనేది ఇంకా సస్పెన్సే!

Bigg Boss Rajat Dalal Wedding With Girlfriend: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, బిగ్ బాస్ 18 ఫేమ్ రజత్ దలాల్ ఒక ఇంటివారయ్యారు. ఆదివారం తన ప్రేయసితో వైభవంగా జరిగిన వివాహ వేడుక ఫోటోలను పంచుకుంటూ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. పలువురు సినీ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Published on: Mar 29, 2026, 23:20:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బిగ్ బాస్ 18, 'ది 50' ఓటీటీ రియాలిటీ షోల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న రజత్ దలాల్ తన జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న రజత్ దలాల్ ఆదివారం (మార్చి 29) తన గర్ల్‌ఫ్రెండ్‌ను వివాహం చేసుకున్నారు. అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను రజత్ దలాల్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

Wedding: ప్రియురాలిని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ స్టార్ రజత్ దలాల్- హింట్ ఇచ్చి మరి! కానీ వధువు ఎవరనేది ఇంకా సస్పెన్సే!
Wedding: ప్రియురాలిని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ స్టార్ రజత్ దలాల్- హింట్ ఇచ్చి మరి! కానీ వధువు ఎవరనేది ఇంకా సస్పెన్సే!

కలల సుందరితో కొత్త ప్రయాణం

ఇన్‌స్టాగ్రామ్‌లో రజత్ షేర్ చేసిన ఫోటోలలో ఈ జంట ఎంతో అన్యోన్యంగా కనిపిస్తోంది. ఒక ఫోటోలో రజత్ తన భార్య చేతిని పట్టుకుని మురిసిపోతుండగా, మరో ఫోటోలో ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ రొమాంటిక్ పోజులిచ్చారు. ఇక పూలమాలలు మార్చుకున్న సమయంలో రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగుల్లో రజత్ వివాహ వేదిక మెరిసిపోయింది.

"జీవితంలో ఒక కొత్త దశను ప్రారంభిస్తున్నాను" అని హిందీలో రాస్తూ ఈ మధుర క్షణాలను రజత్ దలాల్ పోస్ట్ చేశారు. అయితే తన భార్య పేరును గానీ, ఆమె పూర్తి వివరాలను గానీ ఆయన ఎక్కడా వెల్లడించలేదు. అంటే, పెళ్లి తర్వాత కూడా తన గర్ల్‌ఫ్రెండ్ వివరాలను సస్పెన్స్‌గా ఉంచారు బిగ్ బాస్ స్టార్ రజత్ దలాల్.

అందరి ఆశీస్సులు కావాలి: రజత్

పెళ్లికి ముందు రజత్ దలాల్ ఒక ఎమోషనల్ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశారు. "నా జీవితంలో మరో ముఖ్యమైన ఘట్టం మొదలవుతోంది. మీరంతా నన్ను ఎంతగానో ప్రేమించారు, సపోర్ట్ చేశారు.. అందుకే ఈ స్థాయికి రాగలిగాను. నా చిన్న తమ్ముళ్లు, అన్నలు.. అందరూ నన్ను దీవించండి" అని రజత్ దలాల్ కోరారు.

శుభాకాంక్షల వెల్లువ

రజత్ వివాహ వార్త తెలిసిన వెంటనే 'ది 50' షోలో ఆయనతో కలిసి నటించిన సహచరులు శుభాకాంక్షలు కురిపించారు. ఫైజల్ షేక్ (మిస్టర్ ఫైజు) స్పందిస్తూ "తమ్ముడూ.. నీకు చాలా చాలా అభినందనలు" అని కామెంట్ చేయగా, శ్రుతికా అర్జున్ "మా అన్నయ్యకు పెళ్లి శుభాకాంక్షలు. నిన్న రాత్రి మేము వదినతో మాట్లాడాము, ఆమె చాలా మంచి వ్యక్తి. ఆమెను బాగా చూసుకో" అని సరదాగా కామెంట్ చేశారు.

బాలీవుడ్ బ్యూటీలు నిక్కీ తంబోలి, ఉర్వశి ధోలాకియా, కాశిష్ కపూర్ వంటి సెలబ్రిటీలు కూడా ఈ నూతన దంపతులపై ప్రేమను కురిపించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తాను ఒక సీరియస్ రిలేషన్‌లో ఉన్నానని, త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకోబోతున్నానని రజత్ దలాల్ హింట్ ఇచ్చారు. చెప్పినట్లుగానే ఇప్పుడు ఆమె మెడలో మూడు ముళ్లు వేసి తన జీవిత భాగస్వామిని చేసుకున్నారు.

'ది 50' లో రజత్ ప్రస్థానం

ఇకపోతే ఇటీవలే ముగిసిన 'ది 50' ఓటీటీ రియాలిటీ షోలో రజత్ దలాల్ అత్యంత బలమైన కంటెస్టెంట్‌గా నిలిచారు. టాస్క్‌లు గెలవడమే కాకుండా, ప్రత్యర్థులను ఎలిమినేట్ చేసే వ్యూహాల్లోనూ ఆయన ముందున్నారు. సెమీ ఫైనల్ వరకు చేరుకున్న రజత్.. ఫైనల్ టాస్క్‌కు ముందు శివ్ ఠాక్రే, కృష్ణా ష్రాఫ్ చేతిలో ఓడిపోయారు. కాగా, ఈ షో టైటిల్‌ను ఫైజల్ షేక్‌ను ఓడించి శివ్ ఠాక్రే గెలుచుకున్న సంగతి తెలిసిందే.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More