Harish Kumar: ఆ హీరోయిన్ నా ప్రాణాలు కాపాడింది, ఆమె బట్టలు పట్టుకుని బతికిపోయా.. ప్రేమ ఖైదీ హీరో హరీష్ కుమార్ కామెంట్స్

Harish Kumar Reveals Who Saved Him: ప్రేమ ఖైదీ, ఓహో నా పెళ్లంట వంటి హిట్ సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న అలనాటి హీరో హరీష్ కుమార్ తన ప్రాణాలతో బయటపడిన విషయాన్ని తాజాగా గుర్తు చేసుకున్నారు. అప్పుడే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ తన ప్రాణాలను కాపాడిందని హరీష్ కుమార్ తెలిపారు.

Published on: Apr 19, 2026, 11:11:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Harish Kumar Reveals Who Saved Him: అప్పట్లో తెలుగు, తమిళ సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో హరీష్ కుమార్. తెలుగులో ప్రేమ ఖైదీ, ఓహో నా పెళ్లంట, ప్రేమ విజేత, క్రాంతి క్షేత్ర సినిమాల్లో హీరోగా మెప్పించాడు. ఆంధ్రకేసరి మూవీతో బాల నటుడిగా కెరీర్ ప్రారంభించి తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో మొత్తం దాదాపు 280 సినిమాల్లో నటించాడు హరీష్ కుమార్.

ఆ హీరోయిన్ నా ప్రాణాలు కాపాడింది, ఆమె బట్టలు పట్టుకుని బతికిపోయా.. ప్రేమ ఖైదీ హీరో హరీష్ కుమార్ కామెంట్స్
ఆ హీరోయిన్ నా ప్రాణాలు కాపాడింది, ఆమె బట్టలు పట్టుకుని బతికిపోయా.. ప్రేమ ఖైదీ హీరో హరీష్ కుమార్ కామెంట్స్

కపూర్ వంశం నుంచి వెండితెరకు

అలాంటి హరీష్ కుమార్ ప్రాణాలను రియల్ లైఫ్‌లో ఓ హీరోయిన్ కాపాడిందని తాజాగా ఆయన చెప్పుకొచ్చారు. కపూర్ వంశం నుంచి వెండితెరకు పరిచయమైన బ్యూటీ కరిష్మా కపూర్. 1991లో 'ప్రేమ ఖైదీ' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కరిష్మా కపూర్.

తెలుగులో సూపర్ హిట్ అయిన 'ప్రేమ ఖైదీ'కి ఇది హిందీ రీమేక్. అదే టైటిల్‌తో వచ్చిన ఈ చిత్రంలో కరిష్మా సరసన తెలుగులో హీరోగా చేసిన హరీష్ కుమార్ నటించాడు. ఈ సినిమాలో కరిష్మా కపూర్ స్విమ్మింగ్ పూల్‌లో కావాలని పడిపోతే హీరో రక్షించే సీన్ ఉంటుంది. కానీ, షూటింగ్ స్పాట్‌లో మాత్రం కథ పూర్తిగా అడ్డం తిరిగింది. ఈ ఘటన గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో హరీష్ గుర్తు చేసుకుంటూ ఆశ్చర్యకరమైన విషయాలు పంచుకున్నారు.

స్విమ్మింగ్ పూల్‌లో ఆ గంటల భయం

ఆ సీన్ చిత్రీకరణ కోసం కరిష్మా పూల్‌లోకి దూకగా, ఆమెను రక్షించేందుకు హరీష్ కూడా దూకాల్సి వచ్చింది. అయితే హరీష్‌కు ఈత రాదన్న విషయం యూనిట్‌లో ఎవరికీ తెలియదు. లోతుగా ఉన్న నీళ్లలోకి వెళ్లగానే ఆయన ఊపిరాడక మునిగిపోవడం మొదలుపెట్టారు.

"కరిష్మాను కాపాడటానికి నేను పూల్‌లోకి దూకాను. కానీ, నిజానికి కరిష్మానే నన్ను కాపాడింది. నాకు ఈత రాకపోవడంతో నేను లోపలికి మునిగిపోతున్నాను. కానీ, అక్కడ ఉన్నవారంతా నేను ఏదో ప్రాంక్ చేస్తున్నానని అనుకున్నారు" అని హరీష్ కపూర్ నాటి భయానక అనుభవాన్ని వివరించారు.

కరిష్మా చూపిన తెగువ

హరీష్ కుమార్ నిజంగానే ప్రాణాపాయంలో ఉన్నారని గ్రహించిన కరిష్మా కపూర్ వెంటనే స్పందించారు. ఆయన నీటిలో గల్లంతవుతుంటే తన చేతులతో పట్టుకుని పైకి లాగారు. భయంతో వణికిపోయిన హరీష్ కుమార్.. కరిష్మా కపూర్ దుస్తులను గట్టిగా పట్టుకుని ప్రాణాలు నిలబెట్టుకున్నారు. 90వ దశకంలో భద్రతా ప్రమాణాలు ఇప్పుడున్నంత పకడ్బందీగా లేవని, ఆ సమయంలో కరిష్మా చూపిన చొరవ వల్లే తాను ఈరోజు బతికి ఉన్నానని హరీష్ కృతజ్ఞతగా చెప్పుకొచ్చారు.

'ప్రేమ ఖైదీ' ఘనత

కె. మురళీ మోహన్ రావు దర్శకత్వంలో వచ్చిన ప్రేమ ఖైదీ సినిమా అప్పట్లో పెద్ద సెన్సేషన్. కరిష్మా కపూర్ అప్పుడు కేవలం 17 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీకి రాగా, హీరో హరీష్ ఆమెకంటే ఒక ఏడాది చిన్నవాడు కావడం విశేషం. పరేష్ రావల్, దలీప్ తాహిల్ వంటి దిగ్గజ నటులు నటించిన ఈ చిత్రం కరిష్మా కెరీర్‌కు గట్టి పునాది వేసింది. 30 ఏళ్ల క్రితం జరిగిన ఈ షూటింగ్ ముచ్చట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More