Leesa: ఉదయం 7 నుంచి తెల్లారి 3 గంటల వరకు షూటింగ్, హీరోయిన్స్‌గా మాకు ఇలాంటి చిత్రాలు అరుదుగా దక్కుతుంటాయి: అనన్య నాగళ్ల
Ananya Nagalla Speech Leesa First Look Poster Launch: టాలీవుడ్ బ్యూటిపుల్ హీరోయిన్ అనన్య నాగళ్ల నటించిన లేటెస్ట్ మూవీ లీసా. జవహర్ లాల్ రాజు దర్శకత్వం వహించిన లీసా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా ఇవాళ విడుదల చేశారు. ఈ సందర్భంగా అనన్య నాగళ్ల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
Ananya Nagalla At Leesa First Look Poster Release: తెలుగు బ్యూటి అనన్య నాగళ్ల హీరోయిన్‌గా నటిస్తున్న మూవీ "లీసా". ఈ చిత్రాన్ని వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ), రామకృష్ణ ఐలా (యూఎస్ఏ) నిర్మిస్తున్నారు. సౌజన్య సతీష్ రెడ్డి మాసం కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. డీవోపీ సతీష్ రెడ్డి మాసం ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే సమకూర్చడం విశేషం.

లీసా టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్
లీసా సినిమాకు జవహర్ లాల్ రాజు దర్శకత్వ వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఆదివారం (ఏప్రిల్ 12) నాడు లీసా మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్ అనన్య నాగళ్ల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
డిఫరెంట్‌గా ఉంటేనే
హీరోయిన్ అనన్య నాగళ్ల మాట్లాడుతూ.. "నేను ఏ మూవీ స్క్రిప్ట్ విన్నా.. అందులో నేను చేయడానికి కొత్తగా ఏముంటుంది అనేది చూసుకుంటాను. కొత్తగా, డిఫరెంట్‌గా ఉంటేనే ఆ మూవీ అంగీకరిస్తాను. లీసా కథ విన్నప్పుడు ఇలాంటి రోల్ నేను ఎప్పుడూ చేయలేదు అనిపించింది. ఈ సినిమాలో అవకాశం దక్కడం సంతోషంగా ఉంది" అని అన్నారు.
ఉదయం 7 గంటల నుంచి
"లీసా మూవీలో నటిస్తున్నప్పుడు నటిగా ఆ ఫ్రెష్‌నెస్‌ను ఫీలయ్యా. హీరోయిన్స్‌గా మాకు అరుదుగా ఇలాంటి చిత్రాలు దక్కుతుంటాయి. డైరెక్టర్ జవహర్ లాల్ రాజు గారు ఉదయం 7 గంటల నుంచి తెల్లవారి 3 గంటల వరకు కూడా షూట్ చేసేవారు" అని అనన్య నాగళ్ల తెలిపింది.
ఇంతగా ఎగ్జైట్ కాలేదు
"సతీష్ రెడ్డి గారు బ్యూటిపుల్ విజువల్స్ అందించారు. గతంలో నేను నటించిన ఏ చిత్రంలోని విజువల్స్ కోసం కూడా ఇంతగా ఎగ్జైట్ కాలేదు. ఆయన క్యాప్చర్ చేసిన కొన్ని సీన్స్ చూస్తుంటే ఇంకా వర్క్ చేయాలనే ఇన్స్‌పిరేషన్ కలిగింది. లీసా నా కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది.ఆ నమ్మకం నాకు ఉంది" అని తన స్పీచ్ ముగించింది హీరోయిన్ అనన్య నాగళ్ల.
మరింత పేరు తీసుకురావాలని
ఇదే ఈవెంట్‌లో ప్రముఖ డాక్టర్ ఎఎమ్ రెడ్డి మాట్లాడుతూ.. "లీసా మూవీ పోస్టర్ చూస్తుంటేనే ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం కలుగుతోంది. అనన్య నాగళ్ల ఈ మూవీలో ఆకట్టుకునేలా కనిపిస్తున్నారు. ఆమెకు ఈ మూవీ మరింత పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా. లీసా మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్" అని అన్నారు.
ఇప్పటికీ 3 సినిమాలు చేశారు
డా. నిరంజన్ మాట్లాడుతూ.. "వెంకట్ నాకు మంచి మిత్రుడు. చాలాకాలంగా తెలుసు. వెంకట్ ఇప్పటికి మూడు చిత్రాలు చేశారు. ఈ సినిమా కూడా ఆయనకు మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా" అని ఆకాంక్షించారు.
వకీల్ సాబ్ గుర్తొస్తుంది
ప్రొడక్షన్ డిజైనర్ తుమ్మల మధు మాట్లాడుతూ.. "లీసా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ బాగుంది. అనన్య నాగళ్లను చూడగానే వకీల్ సాబ్ సినిమా గుర్తొస్తుంది. ఈ సినిమా కూడా ఆమెకు మంచి పేరు తీసుకొస్తుంది. లీసా చిత్రం విజయవంతం కావాలి. ప్రొడ్యూసర్స్‌కు లాభాలు తీసుకురావాలి. అప్పుడే వారు మరిన్ని మంచి మూవీస్ చేయగలరు" అని పేర్కొన్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


