Rayavalasa: హీరోగా మారిన సింగర్, రైటర్, డ్యాన్సర్ కార్తీక్- దర్శకురాలిగా ఎన్ఆర్ఐ మహిళా రాధిక- రాయవలస ఫస్ట్ లుక్ రిలీజ్!

Rayavalasa Movie First Look Released: రాయసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో తెరకెక్కుతున్న రాయవలస సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఎన్ఆర్ఐ మహిళ దర్శకురాలిగా పరిచయం అవుతున్న రాయవల సినిమాలో నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ లుక్ ఆకట్టుకుంటోంది. మరిన్ని విశేషాల్లోకి వెళితే!

Published on: Apr 5, 2026, 06:36:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాయసన్ ప్రొడక్షన్స్ తమ తొలి చిత్రమైన “రాయవలస” ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ఊరి జీవితం, నిజ సంఘటనల ఆధారంగా మనసును తాకే కథతో వస్తున్న ఈ చిత్రం తెలుగు సినీ రంగంలో ఓ తొలి ప్రయత్నంగా నిలుస్తోంది. గోపీ కృష్ణ జె నిర్మించిన ఈ సినిమా, కొత్త ప్రతిభను ప్రోత్సహించాలనే ఆయన విజన్‌కు నిదర్శనం.

హీరోగా మారిన సింగర్, రైటర్, డ్యాన్సర్ కార్తీక్- దర్శకురాలిగా ఎన్ఆర్ఐ మహిళా రాధిక- రాయవలస ఫస్ట్ లుక్ రిలీజ్!
హీరోగా మారిన సింగర్, రైటర్, డ్యాన్సర్ కార్తీక్- దర్శకురాలిగా ఎన్ఆర్ఐ మహిళా రాధిక- రాయవలస ఫస్ట్ లుక్ రిలీజ్!

దర్శకురాలిగా ఎన్ఆర్ఐ మహిళా

డెబ్యూట్ ప్రొడ్యూసర్ అయినప్పటికీ గోపీ కృష్ణ తన నిబద్ధత, ప్రణాళికా సామర్థ్యం, కట్టుబాటుతో మొత్తం ప్రొడక్షన్‌ను సజావుగా నడిపారు. అమెరికా నుంచి వచ్చిన ఎన్‌ఆర్‌ఐ మహిళా దర్శకురాలు రాధిక , చిన్న గ్రామీణ కథలు, ఊరి జీవితం, మనుషుల మధ్య భావోద్వేగాలను ప్రతిబింబించే కథను తెచ్చే లక్ష్యంతో భారతదేశానికి వచ్చి సినిమా తీర్చిదిద్దారు.

ఒకే షెడ్యూల్‌లో షూటింగ్ పూర్తి కావడం, ఆమె టీమ్ కృషి, నిబద్ధతకు ఉదాహరణ. అవార్డు విజేత దర్శకురాలిగా రాధిక, గ్లోబల్ టచ్‌తో నేటివిటీని మిళితం చేసి కథను మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. డీఓపీ కిట్టు అద్భుత విజువల్స్ అందించగా, రాఖీ నిజజీవిత సంఘటనల ఆధారంగా, గ్రామీణ నేపథ్యంతో శక్తివంతమైన కథను రూపొందించారు

హీరోగా మారిన సింగర్, రైటర్

కార్తిక్‌ని హీరోగా పరిచయం చేసి “నవ యువ కథానాయకుడు”గా ఆవిష్కరించడం ప్రేక్షకులలో మంచి స్పందన తెచ్చింది. అమెరికాలో పెరిగిన కార్తిక్, సింగర్‌గా ఎన్నో వేదికలపై ప్రదర్శనలు ఇచ్చాడు. సింగర్ మాత్రమే కాక, ఓటీటీ వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్స్, ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్‌లలో నటించి, రైటర్, లిరిసిస్ట్, డ్యాన్సర్‌గా ప్రతిభ చాటిన యువ ప్రతిభావంతుడిని ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు పూర్తి ప్రతిభతో తీసుకురావడం ఒక ప్రత్యేక ప్రయత్నంగా చెప్పుకోవచ్చు.

“Love Tied by Fate” అనే సినిమా ట్యాగ్‌లైన్ కథలోని భావోద్వేగాలను అద్భుతంగా ప్రతిబింబించనున్నట్లు చూపిస్తుంది. టైటిల్ డిజైన్ ప్రత్యేకతతో ఆకట్టుకుంటుంది. హీరో, టైటిల్‌ను విద్యార్థుల మధ్య ఒక కాలేజీలో గ్రాండ్‌గా లాంచ్ చేయడం, డెబ్యూ హీరో కార్తిక్ జయంతి పవర్‌ఫుల్, ఇంటెన్స్ లుక్‌తో ప్రజలు, సినీ ప్రముఖుల దృష్టిని వెంటనే ఆకర్షించింది.

రైస్ మిల్ యజమాని చుట్టూ

నిజ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం, ఒక రైస్ మిల్ యజమాని రాజు జీవితం చుట్టూ తిరుగుతుంది. కుటుంబం, స్నేహితులు, గ్రామ పిల్లలతో సాగుతున్న అతని జీవితంలో హీరోయిన్ ప్రవేశంతో అనూహ్య మలుపులు తీసుకువస్తుంది. భావోద్వేగం, యాక్షన్, సంగీతం కలగలిపిన కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా “రాయవలస” ప్రేక్షకులను అలరించనుంది.

హీరోయిన్ శ్రీషా నూలు ఇతర ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి, ఈ సినిమాలో కార్తిక్ జయంతితో జోడీగా కనిపిస్తూ అలరించబోతున్నారు. ఆమె కథలో ఒక ముఖ్యమైన, గుర్తుండిపోయే పాత్రను పోషించారు అలాగే, రాయవలస సినిమాలో అన్నపూర్ణమ్మ, అనిత చౌదరి, జయప్రకాశ్, రవి వర్మ, కాశీ విశ్వనాథ్ వంటి సీనియర్ నటులు, త్రినాధ్ రావు, సుహాస్, కంచరపాలెం రాజు వంటి ప్రతిభావంతులు కూడా చిత్రంలో కీలక పాత్రల్లో కనిపిస్తారు.

రాయవలస సింగర్స్

ఈ చిత్రానికి సంగీత దర్శకుడు అర్జున్ బాలా (కెనడా) కొత్త బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పాటు అద్భుతమైన పాటలను అందిస్తూ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. పూర్ణ చారి, కార్తిక్ జయంతి, తరుణ్ సైదులు లిరిక్స్ అందించగా, ప్రముఖ గాయకులు రాహుల్ సిప్లిగంజ్, ధనుంజయ్, రోహిత్ పరిటాల, రమ్య బెహరా, సాహితి చాగంటి, సౌజన్య భాగవతుల, వాగ్దేవి, అర్జున్, కార్తిక్ జయంతి పాటలను ఆలపించారు.

రాయవలస ఫస్ట్ లుక్‌తోనే మంచి అంచనాలు రేకెత్తించిన ఈ చిత్రం దర్శకురాలు రాధిక జయంతి, హీరో కార్తిక్ జయంతి ఇద్దరినీ తెలుగు సినీ రంగంలో ప్రామెసింగ్ ట్యాలెంట్‌గా నిలబెట్టనుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More