Bhumi: వయసు పెరుగుతోంది, అందుకే నా శరీరంపై ఫోకస్ పెట్టాను.. వెయిట్ లాస్ ట్రోల్స్‌పై స్టార్ హీరోయిన్ భూమి కామెంట్స్

Bhumi Pednekar About Weight Loss And Fitness: ఢిల్లీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (IFFD) 2026లో స్టార్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ సందడి చేశారు. తను బరువు తగ్గడంపై వస్తున్న వార్తలకు స్పందిస్తూ.. వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యం పట్ల ప్రాధాన్యతలు మారుతాయని వివరించారు భూమి పెడ్నేకర్.

Published on: Mar 31, 2026, 10:35:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ వెర్సటైల్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ తన కెరీర్ ఆరంభం నుంచి బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. తొలి సినిమా 'దమ్ లగా కే హయిషా' కోసం భారీగా బరువు పెరిగిన భూమి ఆ తర్వాత స్లిమ్ లుక్‌లోకి మారి అందరినీ ఆశ్చర్యపరిచారు.

వయసు పెరుగుతోంది, అందుకే నా శరీరంపై ఫోకస్ పెట్టాను.. వెయిట్ లాస్ ట్రోల్స్‌పై స్టార్ హీరోయిన్ భూమి కామెంట్స్
వయసు పెరుగుతోంది, అందుకే నా శరీరంపై ఫోకస్ పెట్టాను.. వెయిట్ లాస్ ట్రోల్స్‌పై స్టార్ హీరోయిన్ భూమి కామెంట్స్

అయితే, ఇటీవల భూమి పెడ్నేకర్ మరింతగా బరువు తగ్గడంపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న 'ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఢిల్లీ' (IFFD) 2026 వేడుకల్లో పాల్గొన్న భూమి పెడ్నేకర్ తన ఫిట్‌నెస్ ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆరోగ్యానికే నా తొలి ప్రాధాన్యత!

బరువు తగ్గడం గురించి అడిగిన ప్రశ్నకు భూమి పెడ్నేకర్ ఎంతో పరిణతితో సమాధానమిచ్చారు. "చాలా ఏళ్లుగా సినిమాల కోసం బరువు పెరగడం, తగ్గడం చేస్తూనే ఉన్నాను. కానీ ఇప్పుడు నా శరీరంపై నాకు శ్రద్ధ పెరిగింది. మహిళల్లో వయసు పెరుగుతున్న కొద్దీ, మన శరీరం ఈ బరువు హెచ్చుతగ్గులను తట్టుకునే శక్తిని కోల్పోతుంది. అందుకే ఇప్పుడు పాత్రల కంటే నా ఆరోగ్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను. ప్రతి మహిళ ఒక వయసు వచ్చాక తన శరీరం గురించి ఇలా ఆలోచించాల్సిందే" అని భూమి పెడ్నేకర్ స్పష్టం చేశారు.

క్రేజ్ ముఖ్యం కాదు.. కళ ముఖ్యం!

యశ్ రాజ్ ఫిల్మ్స్‌లో కాస్టింగ్ అసిస్టెంట్‌గా కెరీర్ మొదలుపెట్టి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన తన ప్రయాణాన్ని భూమి గుర్తు చేసుకున్నారు. "ప్రస్తుత కాలంలో 'రెలవెంట్' (పాపులారిటీలో)గా ఉండటం కంటే మన పని పట్ల మనం నిజాయితీగా ఉండటం ముఖ్యం. క్రేజ్ అనేది చాలా తక్కువ కాలం ఉంటుంది, దాన్ని కాపాడుకోవాలని తాపత్రయపడటం అలసటను కలిగిస్తుంది. మనలోని అసలైన కళాకారుడిని గుర్తించి, నిరంతరం సాధన (రియాజ్) చేస్తూ ఉండటమే అసలైన విజయం" అని భూమి పెడ్నేకర్ వివరించారు.

ఢిల్లీకి ఇది గర్వకారణం..

మార్చి 25న ప్రారంభమైన ఐఎఫ్ఎఫ్డి (IFFD) వేడుకల గురించి భూమి ప్రశంసలు కురిపించారు. "ఢిల్లీ లాంటి నగరానికి ఇలాంటి ఒక అంతర్జాతీయ స్థాయి చలనచిత్ర వేడుక ఎంతో అవసరం. ఇక్కడ జరుగుతున్న చర్చలు, సెమినార్లు, ప్రదర్శిస్తున్న సినిమాలు చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. మొదటి ఏడాదే ఈ స్థాయిలో ఈ వేడుకలు జరగడం విశేషం" అని ఆమె పేర్కొన్నారు.

కెరీర్ అప్‌డేట్స్..

గతేడాది 'మేరే హస్బెండ్ కీ బీవీ' సినిమాతో అలరించిన భూమి పెడ్నేకర్, నెట్‌ఫ్లిక్స్ సిరీస్ 'ది రాయల్స్'తో ఓటీటీలో రికార్డు వ్యూయర్ షిప్ సాధించారు. ఇక 2026 ఏడాదిని భూమి పెడ్నేకర్ పవర్‌ఫుల్ నోట్‌తో మొదలుపెట్టారు. అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ రిలీజ్ అయిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్ దల్‌దల్‌లో ముంబై పోలీస్ ఆఫీసర్‌గా భూమి చేసిన నటనకు విమర్శకుల ప్రశంసలు అందాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More