OTT Trending Telugu: థియేటర్లలో మిక్స్‌డ్ టాక్, ఓటీటీలో టాప్ 1గా ట్రెండింగ్- తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీకి 5 రేటింగ్!

OTT Telugu Comedy Trending In 1 Place: ఓటీటీలో తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ టాప్ 1 స్థానంలో ట్రెండ్ అవుతూ దూసుకుపోతోంది. ఇదే సినిమాకు థియేటర్లలో మాత్రం మిక్స్‌డ్ టాక్, రివ్యూలు వచ్చాయి. అలా ఐఎమ్‌డీబీ నుంచి 5 రేటింగ్ సాధించిన ఈ సినిమా ఏంటీ, దాని ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏంటో తెలుసుకుందాం.

Published on: Mar 28, 2026, 18:31:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కొన్నిసార్లు బాక్సాఫీస్ ఫలితాలు, ఓటీటీ రిజల్ట్స్ రెండు వేరు వేరుగా ఉంటాయి. థియేటర్లలో బాగా ఆడిన సినిమాలు ఓటీటీలో మోస్తరు స్థాయిలో పర్ఫామెన్స్ చేస్తే మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న మూవీస్ మాత్రం ట్రెండింగ్‌లో దూసుకుపోతుంటాయి. ఇప్పుడు ఓ తెలుగు సినిమాకు కూడా అదే జరగింది.

థియేటర్లలో మిక్స్‌డ్ టాక్, ఓటీటీలో టాప్ 1గా ట్రెండింగ్- తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీకి 5 రేటింగ్!
థియేటర్లలో మిక్స్‌డ్ టాక్, ఓటీటీలో టాప్ 1గా ట్రెండింగ్- తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీకి 5 రేటింగ్!

ఓటీటీలో టాప్ 1 ట్రెండింగ్

థియేటర్లలో విడుదలైన తెలుగు రొమాంటిక్ మూవీకి థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ వస్తే ఓటీటీ స్ట్రీమింగ్ అనంతరం టాప్ 1 ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ఆ సినిమా మరేదో కాదు విష్ణు విన్యాసం. టాలీవుడ్ కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా పేరు తెచ్చుకున్న శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన సినిమానే విష్ణు విన్యాసం.

హీరోయిన్‌గా నయన్ సారిక

ఈ సినిమాలో శ్రీ విష్ణుకు జోడీగా నయన్ సారిక హీరోయిన్‌గా చేసింది. యదునాథ్ మారుతి రావు దర్శకత్వం వహించారు. సుమంత్ నాయుడు జీ నిర్మాతగా వవ్యవహరించారు. విష్ణు విన్యాసం సినిమాలో హీరో హీరోయిన్లతోపాటు బ్రహ్మాజీ, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్య, సత్యం రాజేష్, గోపరాజు రమణ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

ఫిబ్రవరి 27న థియేట్రికల్ రిలీజ్

టీజర్, ట్రైలర్‌తో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న విష్ణు విన్యాసం సినిమా ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదల అయింది. అయితే, ఊహించిన స్థాయిలో సినిమా ఆకట్టుకోలేకపోయింది. దాంతో విష్ణు విన్యాసం మూవీకి మిక్స్‌డ్ టాక్, రివ్యూస్ వచ్చాయి. అప్పటివరకు మంచి కామెడీతో ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేసిన శ్రీ విష్ణు ఈ మూవీతో నిరాశపరిచాడు.

ఐఎమ్‌డీబీలో 5 రేటింగ్

ఫలితంగా ఐఎమ్‌డీబీలో పదికి 5 రేటింగ్ మాత్రమే సాధించుకుంది విష్ణు విన్యాసం మూవీ. కానీ, టాక్ ఎలా ఉన్నా బాక్సాఫీస్ వద్ద మాత్రం బాగానే రాణించింది. అంటే, ఆడియెన్స్ టాక్ పక్కన పెడితే బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హిట్ తెచ్చుకుంది విష్ణు విన్యాసం చిత్రం.

విష్ణు విన్యాసం ఓటీటీ రిలీజ్

ఇలా మిక్స్‌డ్ టార్, మిక్స్‌డ్ ఫలితాలు తెచ్చుకున్న విష్ణు విన్యాసం ఓటీటీలోకి వచ్చేసింది. మార్చి 20 నుంచి విష్ణు విన్యాసం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌లో విష్ణు విన్యాసం ఓటీటీ రిలీజ్ అయింది. థియేటర్లలో వీక్షించిన ఈ సినిమాను ఓటీటీలో చూడటం మొదలుపెట్టారు తెలుగు ఆడియెన్స్.

ఇండియా వైడ్‌గా ట్రెండింగ్

దాంతో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది విష్ణు విన్యాసం సినిమా. ప్రస్తుతం ఇవాళ (మార్చి 28) అమెజాన్ ప్రైమ్‌లో టాప్ 1 స్థానంలో విష్ణు విన్యాసం ఓటీటీ ట్రెండింగ్ అవుతోంది. ఇండియా వైడ్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియోలోని మూవీస్‌లో అన్నిట్లోకెల్లా విష్ణు విన్యాసం నెంబర్ 1 స్థానంలో నిలిచి సత్తా చాటింది.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

జాతకాలు నమ్మే హీరోకు తన ప్రియురాలి పెళ్లితో వచ్చిన సమస్య ఏంటీ అనేది కామెడీ, రొమాంటిక్ అంశాలతో విష్ణు విన్యాసం సినిమాను తెరకెక్కించారు. సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ డైలాగ్స్‌తో సాగే విష్ణు విన్యాసం సినిమాను అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇంకా చూడనివారు ఎంచక్కా చూసేయొచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More