TV : ఓటీటీలో 200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్- ఇవాళ టీవీలోకి వస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా- ఇక్కడ చూసేయండి!
OTT Telugu Romantic Family Comedy Drama TV Premiere: ఓటీటీ రిలీజ్ అయిన ఆరు రోజుల్లోనే ఏకంగా 200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించిన తెలుగు రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా ఇవాళ టీవీ ప్రీమియర్ కానుంది. ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన 9 రోజుల్లోనే బుల్లితెరపై ఆ సినిమా సందడి చేయడం ఆసక్తికరం.
థియేటర్లలో సినిమాలు హిట్ అయిన ఫ్లాప్ అయినా ఓటీటీలోకి దాదాపుగా 20 నుంచి 2, 3 నెలల్లోపు స్ట్రీమింగ్‌కు వస్తాయి. అలాగే, ఓటీటీ రిలీజ్ అనంతరం సుమారు నెల దాటిన తర్వాతే టీవీ ప్రీమియర్ అవుతుంటాయి. అలాంటిది ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన 9 రోజుల్లోనే తెలుగు రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా బుల్లితెరపై సందడి చేయనుంది.

ఓటీటీ రిలీజైన 6 రోజులకు
అది కూడా ఓటీటీ రిలీజ్ అయిన ఆరు రోజుల్లో ఏకంగా 200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించిన మూవీ అవడం మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఆ సినిమా మరేదో కాదు మాస్ మహరాజా రవితేజ ఇద్దరు హీరోయిన్లతో కలిసి నటించిన ఫ్యామిలీ కామెడీ సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి.
ఇద్దరు హీరోయిన్స్
కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బ్యూటిఫుల్ డింపుల్ హయాతి, ఆషిక రంగనాథ్ ఇద్దరు హీరోయిన్స్‌గా యాక్ట్ చేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో విడుదలైంది. ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై చెరుకూరి సుధాకర్ నిర్మించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా బాగానే టాక్ తెచ్చుకుంది.
స్పెయిన్‌లో లవ్ ఎఫైర్
రామ్ (రవితేజ) వైన్ కంపెనీ ఓనర్. తన భార్య బాలామణి (డింపుల్ హయాతి)తో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. రామ్ కంపెనీ పని మీద స్పెయిన్ వెళ్తాడు. అక్కడ రామ్‌కి మానస శెట్టి (ఆషికా రంగనాథ్) పరిచయం అవుతుంది. రామ్, మానస దగ్గర సత్యగా పరిచయం అవుతాడు. ఇద్దరూ ఒక్కటవుతారు.
సత్య లైఫ్ ఎలా మారింది
అనుకోకుండా జరిగిన ఆ తప్పు రామ్ అలియాస్ సత్య లైఫ్‌ను ఎలా మార్చింది?, రామ్ జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి?, మానస విషయం బాలామణికి తెలిసిందా? చివరకు రామ్ ఇద్దర్ని ఎలా హ్యాండిల్ చేశాడు? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే భర్త మహాశయులకు విజ్జప్తి సినిమా చూడాల్సిందే.
ఓటీటీ ట్రెండింగ్‌లో
సునీల్, సత్య, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీలో ప్రస్తుతం ట్రెండింగ్‌లోనే ఎంటర్‌టైన్ చేస్తుంది. మార్చి 13న జీ5లో భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీ రిలీజ్ అయింది. ఆ తర్వాత 6 రోజుల్లో 200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించింది.
భర్త మహాశయులకు విజ్ఞప్తి టీవీ ప్రీమియర్
ఇప్పుడు కేవలం తొమ్మిది రోజుల్లోనే భర్త మహాశయులకు విజ్ఞప్తి టీవీ ప్రీమియర్ కానుంది. ఇవాళ అంటే మార్చి 22న జీ తెలుగు ఛానెల్‌లో భర్త మహాశయులకు విజ్ఞప్తి బుల్లితెరపై సందడి చేయనుంది. సాయంత్రం 6 గంటలకు తెలుగు ఆడియెన్స్‌కు భర్త మహాశయులకు విజ్ఞప్తి జీ తెలుగులో అందుబాటులోకి రానుంది.
జీ తెలుగు ఛానెల్‌లో
ఆసక్తికరమైన కథాంశం, ఊహించని ట్విస్ట్‌లతో ప్రేక్షకులను మెప్పించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాని తప్పకుండా చూసేయండి అంటూ జీ తెలుగు ఛానెల్ అధికారికంగా ప్రకటించింది. థియేటర్, ఓటీటీలో మిస్ అయిన వారు ఇంట్లో కూర్చుని ఎంచక్కా టీవీలో ఈ సినిమాను జీ తెలుగు ఛానెల్‌లో చూసేయండి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


