Mehreen Pirzada: సడెన్‌గా హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా పెళ్లి? నెట్టింట్లో వైరల్ అవుతున్న ఫొటోలు- ఆమె భర్త ఎవరంటే?
Mehreen Pirzada Got Married Photos: తెలుగు హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన మెహ్రీన్ పెళ్లి పిక్స్ హాట్ టాపిక్‌గా మారాయి. అలాగే, మెహ్రీన్ ఎవరిని వివాహం ఆడిందనే వివరాలు మరింత ఇంట్రెస్టింగ్‌గా మారాయి.
Mehreen Pirzada Married Photos: టాలీవుడ్ బ్యూటిపుల్ హీరోయిన్లలో మెహ్రీన్ పిర్జాదా ఒకరు. నాని కృష్ణగాడి వీర ప్రేమకథ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమైన మెహ్రీన్ ఎఫ్ 2 చిత్రంలో హనీగా మంచి క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా మెహ్రీన్ ఫిర్జాదా పెళ్లి చేసుకుని టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్ద షాక్ ఇచ్చింది.

అర్ష్ ఔలక్ అనే వ్యక్తితో
అర్ష్ ఔలక్ అనే వ్యక్తిని హీరోయిన్ మెహ్రీన్ వివాహం చేసుకుంది. నేడు ఆదివారం (ఏప్రిల్ 26) తన సోషల్ మీడియా ఖాతాలో తన పెళ్లి ఫొటోలను షేర్ చేసింది మెహ్రీన్ పిర్జాదా. ఈ అద్భుతమైన ఫోటోల్లో మెహ్రీన్ లేత గులాబీ రంగు (సాఫ్ట్ పింక్) బ్రైడల్ డ్రెస్ ధరించి, సాంప్రదాయ ఆభరణాలతో మెరిసిపోయింది.
మ్యాచింగ్ అవుట్‌ఫిట్‌లో
ఇక మెహ్రీన్ భర్త అర్ష్ ఔలక్ మ్యాచింగ్ అవుట్‌ఫిట్‌లో కనిపించారు. ఈ ఫోటోలలో ఇద్దరూ ఎంతో సంతోషంగా, సన్నిహితంగా కనిపిస్తున్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయిపోయాయి. పాయల్ రాజ్‌పుత్ తదితర సెలబ్రిటీలు అభినందనలు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే, మెహ్రీన్ పిర్జాదా పెళ్లి చేసుకున్న అర్ష్ ఔలక్ ఏం చేస్తాడు అనే వివరాలు ఇంకా క్లారిటీ లేదు. అలాగే, వీరిద్దరిది లవ్ మ్యారేజా, పెద్దలు కుదిర్చిన వివాహమా అనేది తెలియాల్సి ఉంది. రష్మిక మందన్నా తర్వాత పెళ్లి చేసుకున్న హీరోయిన్‌గా మెహ్రీన్ పిర్జాదా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
పాత జ్ఞాపకాలను చెరిపివేస్తూ..
ఇదిలా ఉంటే, మెహ్రీన్ గతంలో హర్యానాకు చెందిన యువ రాజకీయ నాయకుడు భవ్య బిష్ణోయ్‌తో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. 2021 మార్చిలో ఎంతో వైభవంగా వీరి నిశ్చితార్థం జరిగింది. అయితే కొన్ని నెలలకే వ్యక్తిగత కారణాల వల్ల ఆ బంధానికి స్వస్తి పలికారు.
"పరస్పర అంగీకారంతోనే మేము విడిపోతున్నాం. భవిష్యత్తులో ఆయనతో కానీ, ఆయన కుటుంబంతో కానీ నాకు ఎలాంటి సంబంధం ఉండదు" అని అప్పట్లో మెహ్రీన్ ఫిర్జాదా కుండబద్దలు కొట్టినట్లు ప్రకటించారు. ఆ చేదు జ్ఞాపకాల తర్వాత ఆమె పూర్తిగా సినిమాలపైనే దృష్టి సారించింది.
మోడలింగ్ నుంచి వెండితెర వరకు
పంజాబీ కుటుంబానికి చెందిన మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా, మోడల్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. నాని సరసన 'కృష్ణగాడి వీరప్రేమ గాథ' చిత్రంతో టాలీవుడ్‌లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత 'మహానుభావుడు', 'ఎఫ్-2', 'ఎఫ్-3' వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకుంది.
అలాగే, హిందీలో 'ఫిల్లౌరీ' సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను కూడా పలకరించింది బ్యూటిపుల్ మెహ్రీన్ ఫిర్జాదా. తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే, ఇప్పుడు తన జీవితంలో మెహ్రీన్ మ్యారేజ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.
క్లారిటీ రావాల్సి ఉంది
ఇదిలా ఉంటే ఈ ఫోటోలు వైరల్ కావడంతో అభిమానులు, సెలబ్రిటీలు మెహ్రీన్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే, ఇది కేవలం నిశ్చితార్థమా లేదా పెళ్లి జరిగిపోయిందా అనే విషయంపై మెహ్రీన్ ఇంకా అధికారికంగా స్పష్టత ఇవ్వలేదు. కేవలం తేదీని మాత్రమే క్యాప్షన్ ఇచ్చి ఆమె సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఏదేమైనా, ఒక విఫలమైన బంధం నుంచి బయటపడి, మెహ్రీన్ మళ్లీ సంతోషంగా కనిపించడం చూసి ఆమె ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


