Rashmika Vijay Honeymoon: థాయ్‌లాండ్ తీరంలో రష్మిక మందన్నా విజయ్ దేవరకొండ హనీమూన్- వైరల్ అవుతోన్న హగ్గింగ్ ఫొటో!

Vijay Deverakonda Rashmika Mandanna Honeymoon In Thailand: ఉదయ్‌పూర్‌లో అట్టహాసంగా వివాహం చేసుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు. పచ్చని ప్రకృతి నడుమ ఈ కొత్త జంట ఏకాంతంగా గడుపుతున్న ఒక క్యూట్, రొమాంటిక్, హగ్గింగ్ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Published on: Mar 21, 2026, 19:25:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా జరిగిన వివాహ వేడుకల అనంతరం, టాలీవుడ్ సెన్సేషనల్ జంట విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా తమ మధుర క్షణాలను ఆస్వాదించేందుకు థాయ్‌లాండ్ చెక్కేశారు. థాయ్‌లాండ్‌ తీరంలోని కో సముయి (Koh Samui) ద్వీపంలో ఈ కొత్త జంట ప్రస్తుతం సేద తీరుతోంది. తాజాగా విజయ్ రష్మిక హనీమూన్ ట్రిప్‌కు సంబంధించిన ఒక రొమాంటిక్ ఫోటో బయటకు రావడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.

థాయ్‌లాండ్ తీరంలో రష్మిక మందన్నా విజయ్ దేవరకొండ హనీమూన్- వైరల్ అవుతోన్న హగ్గింగ్ ఫొటో!
థాయ్‌లాండ్ తీరంలో రష్మిక మందన్నా విజయ్ దేవరకొండ హనీమూన్- వైరల్ అవుతోన్న హగ్గింగ్ ఫొటో!

ప్రకృతి ఒడిలో ఏకాంతంగా..

సాధారణంగా సెలబ్రిటీలు లగ్జరీ రిసార్ట్‌లను ఎంచుకుంటారు. కానీ, విజయ్, రష్మిక మాత్రం అందుకు భిన్నంగా ఒక ప్రైవేట్ ఎయిర్ బీఎన్‌బీ (Airbnb) విల్లాను ఎంచుకున్నారు. సముద్రపు ఒడ్డున, పచ్చని చెట్ల మధ్య ఉన్న ఈ విశాలమైన విల్లాలో విరోష్ ఏకాంతంగా గడుపుతున్నారు.

రొమాంటిక్‌గా హగ్

విజయ్ దేవరకొండను రష్మిక రొమాంటిక్‌గా హగ్ చేసుకున్న ఫొటోను నెట్టింట్లో షేర్ చేశారు. ఈ వైరల్ అవుతున్న ఫోటోలో.. సూర్యకాంతి పడుతున్న మెట్లపై విజయ్, రష్మిక ఒకరినొకరు హత్తుకుని (హగ్గింగ్) చిరునవ్వుతో చూసుకుంటున్న దృశ్యం ఎంతో రొమాంటిక్‌గా ఉంది. రష్మిక పసుపు రంగు ఫ్లోరల్ డ్రెస్సులో మెరిసిపోతుండగా, విజయ్ క్యాజువల్ టీ షర్ట్‌లో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు.

రొటీన్ లగ్జరీ రిసార్ట్స్ కంటే

"విజయ్, రష్మిక తమ వ్యక్తిత్వానికి తగ్గట్టుగానే ఈ ట్రిప్‌ను ప్లాన్ చేసుకున్నారు. రొటీన్ లగ్జరీ రిసార్ట్స్ కంటే కూడా తమకు నచ్చినట్లుగా, ఎంతో సహజంగా ఉండేలా ఈ ప్రైవేట్ విల్లాను ఎంచుకున్నారు" అని ఈ జంటకు సన్నిహితంగా ఉండేవారు తెలిపారు.

రెండు సంప్రదాయాల కలయికగా వివాహం

ఇకపోతే ఫిబ్రవరి 26, 2026న ఉదయ్‌పూర్‌లోని ఐటిసి మెమెంటోస్‌లో వీరి వివాహం అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. విజయ్ తెలుగు సాంప్రదాయాలు, రష్మిక మందన్నా కొడవ (కూర్గ్) ఆచారాల కలయికతో వీరి పెళ్లి వేడుక వెరైటీగా సాగింది. ప్రముఖ డిజైనర్ అనామికా ఖన్నా ఈ జంట కోసం పెళ్లి దుస్తులను డిజైన్ చేశారు. పెళ్లి తర్వాత మార్చి 4న హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఇచ్చారు.

అత్యంత రహస్యంగా

కాగా 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' చిత్రాల ద్వారా వెండితెరపై మ్యాజిక్ చేసిన ఈ జంట నిజ జీవితంలోనూ ఒక్కటవ్వడం విశేషం. గతేడాది అక్టోబర్‌లోనే వీరికి నిశ్చితార్థం జరిగినప్పటికీ, పెళ్లి ప్రకటన వచ్చే వరకు తమ బంధాన్ని వీరు అత్యంత రహస్యంగా ఉంచింది విరోష్ జంట.

తిరిగి షూటింగ్‌లోకి..

హనీమూన్ నుంచి రాగానే రష్మిక మందన్నా మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న 'మైసా' (Mysaa) చిత్ర షూటింగ్‌లో ఆమె బిజీ అయిపోయారు. మరో విశేషమేమిటంటే, విజయ్, రష్మిక కలిసి 'రణబాలి' (Ranabaali) చిత్రంలో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న విషయం తెలిసిందే.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More