Virosh: తెలుగు, కొడవ పద్ధతుల్లో విరోష్ వెడ్డింగ్- 3 కేజీల బంగారం- విజయ్, రష్మిక పెళ్లికి ఎన్ని కోట్లు ఖర్చు అయిందంటే?
Vijay Devarakonda Rashmika Mandanna Wedding Expenditure: ఉదయ్‌పూర్ నుంచి హైదరాబాద్ దాకా అట్టహాసంగా జరిగిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల వివాహ వేడుకలు ముగిశాయి. ఇప్పుడు విరోష్ వెడ్డింగ్ ఖర్చుకు సంబంధించిన వివరాలు హాట్ టాపిక్‌గా మారాయి. మరి వీరి పెళ్లికి ఎన్ని కోట్లు ఖర్చు అయ్యాయో ఓ లుక్కేద్దాం.
గత కొన్ని రోజులుగా యావత్ సోషల్ మీడియాను ఊపేసిన ‘విరోష్’ (Vijay & Rashmika) వివాహ వేడుకలు గ్రాండ్‌గా ముగిశాయి. ఫిబ్రవరి 24న క్రికెట్ మ్యాచ్‌తో మొదలైన వీరి ప్రీ-వెడ్డింగ్ సందడి.. 26న ఉదయ్‌పూర్ వేదికగా జరిగిన డ్రీమ్ వెడ్డింగ్‌తో పతాక స్థాయికి చేరింది.

సినీ ప్రముఖులు, బంధువుల కోసం
ఇక మార్చి 4న హైదరాబాద్‌లో సినీ ప్రముఖులు, బంధువుల కోసం ఏర్పాటు చేసిన గ్రాండ్ రిసెప్షన్‌తో విరోష్ వెడ్డింగ్ వేడుకలు అధికారికంగా ముగిశాయి. ప్రస్తుతం ఈ నూతన జంట ‘అండర్ గ్రౌండ్’కు వెళ్తున్నట్లు సరదాగా ప్రకటించింది.
రెండు సాంప్రదాయ పద్ధతుల్లో
అటు తెలుగు, ఇటు కొడవ సాంప్రదాయ పద్ధతుల్లో విజయ్, రష్మికల పెళ్లి, వారి దుస్తులు, సంగీత్ సెటప్, పెళ్లి తర్వాత వారు తమ సొంత ఊర్లకు వెళ్లి నిర్వహించిన సంప్రదాయ పూజలు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
విరోష్ వెడ్డింగ్ బడ్జెట్
ఈ క్రమంలోనే ఈ విరోష్ వెడ్డింగ్ బడ్జెట్ ఎంత ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ప్రస్తుత సమాచారం ప్రకారం.. విజయ్, రష్మికల వివాహ వేడుకల కోసం సుమారు రూ. 15 నుంచి 25 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మ్యారేజ్ కోసం ప్రత్యేకంగా 3 కేజీల బంగారు ఆభరణాలు చేయించారట.
విరోష్ వెడ్డింగ్ ఓటీటీ రైట్స్
ఈ మొత్తం ఈవెంట్‌ను ప్రముఖ ప్రైవేట్ ఈవెంట్ సంస్థ ఆర్గనైజ్ చేసింది. అలాగే, విజయ్, రష్మికల పెళ్లి ఓటీటీ స్ట్రీమింగ్ హక్కుల కోసం ప్రముఖ డిజిటల్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రూ. 60 కోట్లు ఆఫర్ చేసింది. కానీ, ఈ జంట ఆ డీల్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఓటీటీ డీల్ ఒప్పుకుంటే
పెళ్లి అనేది వ్యక్తిగతమైన వేడుకగా ఉండాలనే ఉద్దేశంతోనే వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఒకవేళ ఆ డీల్ ఒప్పుకుంటే పెళ్లి ద్వారా రూ. 60 కోట్లు వచ్చినట్లే. ఈ ఓటీటీ రైట్స్ వల్ల పెళ్లి ఖర్చులు పోను రూ. 35 కోట్లకుపైగా లాభం వచ్చే అవకాశం ఉంది.
రాచ మర్యాదలు.. విలాసవంతమైన వేదికలు
ఉదయ్‌పూర్‌లోని అత్యంత విలాసవంతమైన 5-స్టార్ ప్రాపర్టీ ‘ఐటిసి మెమెంటోస్’లో వీరి ప్రధాన వేడుకలు జరిగాయి. ఆ తర్వాత దేశవ్యాప్తంగా తమ అభిమానుల కోసం ఉచిత భోజనాలు, స్వీట్ల పంపిణీ చేపట్టి తమ ఉదారతను చాటుకున్నారు. చివరిగా హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ‘తాజ్ కృష్ణ’ హోటల్‌లో రిసెప్షన్ నిర్వహించారు. టాలీవుడ్‌లో అత్యంత ఖరీదైన వివాహాల్లో ఒకటిగా ఇది నిలిచిపోనుంది.
గీత గోవిందం టు రణబాలి
పెళ్లి వేడుకల తర్వాత విజయ్, రష్మిక మందన్నా తమ సొంత ఊర్లకు వెళ్లి సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించుకున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. గీత గోవిందం సినిమాతో పరిచయమైన వీరి స్నేహం ప్రేమగా మారి భార్యాభర్తలను చేసింది. ఇప్పుడు వీరిద్దరు కలిసి నటించిన రణబాలి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper












