Vijay Trisha: దళపతి విజయ్, త్రిష జంటగా.. భార్యతో విడాకుల ట్రోలింగ్ నేపథ్యంలో రిసెప్షన్‌కు కలిసి వెళ్లిన స్టార్ కపుల్

దళపతి విజయ్, త్రిష జంటగా ఓ ప్రొడ్యూసర్ కొడుకు రిసెప్షన్ కు వెళ్లడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. భార్యతో విడాకుల ట్రోలింగ్ నేపథ్యంలో విజయ్ ఈ బోల్డ్ మూవ్ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. త్రిషతో తన రిలేషన్షిప్ ను అతడు కన్ఫమ్ చేసినట్లే అని భావిస్తున్నారు.

Mar 5, 2026, 22:21:51 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తమిళ సూపర్ స్టార్, 'తమిళగ వెట్రి కళగం' (TVK) అధినేత దళపతి విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ తన భార్య సంగీత నుండి విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి కారణమని భావిస్తున్న నటి త్రిషతో కలిసి ఓ వెడ్డింగ్ రిసెప్షన్ కు వెళ్లడం గమనార్హం.

Vijay Trisha: దళపతి విజయ్, త్రిష జంటగా.. భార్యతో విడాకుల ట్రోలింగ్ నేపథ్యంలో రిసెప్షన్‌కు కలిసి వెళ్లిన స్టార్ కపుల్
Vijay Trisha: దళపతి విజయ్, త్రిష జంటగా.. భార్యతో విడాకుల ట్రోలింగ్ నేపథ్యంలో రిసెప్షన్‌కు కలిసి వెళ్లిన స్టార్ కపుల్

విజయ్, త్రిష జంటగా.. చెన్నైలో సందడి

భార్య సంగీత స్వర్ణలింగంతో విడాకుల వివాదం నడుస్తుండగానే, గురువారం (మార్చి 5) రాత్రి చెన్నైలో జరిగిన ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాత కల్పతి ఎస్. సురేష్ కుమారుడి వివాహ విందుకు దళపతి విజయ్, త్రిష జంటగా హాజరయ్యారు.

కలర్ కోఆర్డినేటెడ్ లుక్ లో వీళ్లు కనిపించారు. విజయ్ పట్టు చొక్కా, పంచె ధరించగా.. త్రిష అదే రంగులో ఉన్న పట్టుచీరలో మెరిసిపోయింది. వీరిద్దరూ ఒకే కారులో రావడం, కలిసి వేదికపైకి వెళ్లడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. విడాకుల వార్తలు నిజమని వీరు పరోక్షంగా హింట్ ఇస్తున్నారా? లేక ఇది కేవలం స్నేహపూర్వక ప్రయాణమా? అనే చర్చ మొదలైంది.

ప్రస్తుతం విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి, 2026 అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ వ్యక్తిగత వివాదాలు అతని ఇమేజ్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.

విజయ్ - సంగీత విడాకుల నేపథ్యం

ప్రముఖ వార్తా సంస్థల సమాచారం ప్రకారం, విజయ్ భార్య సంగీత స్వర్ణలింగం చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. విజయ్ ఒక నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని, దీనివల్ల తమ మధ్య దూరం పెరిగిందని సంగీత తన పిటిషన్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

2021 ఏప్రిల్‌లో ఈ విషయం తనకు తెలిసిందని, అప్పటి నుండి మానసిక వేదనను అనుభవిస్తున్నట్లు ఆమె ఆరోపించారు. విజయ్ తనను, పిల్లలను పట్టించుకోవడం లేదని కూడా ఆమె పేర్కొన్నట్లు సమాచారం.

ఈ విడాకుల సెటిల్‌మెంట్‌లో భాగంగా విజయ్ సుమారు 250 కోట్లు భరణంగా ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ధృవీకరణ లేదు.

త్రిషతో అనుబంధంపై ఊహాగానాలు

విజయ్, నటి త్రిష కృష్ణన్ మధ్య ఎఫైర్ ఉందనే వార్తలు చాలా కాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ గతంలో 'గిల్లి', 'కురువి' వంటి హిట్ చిత్రాల్లో నటించారు. 15 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ 'లియో' (2023) సినిమాలో జంటగా నటించడంతో ఈ రూమర్లు మళ్లీ ఊపందుకున్నాయి. త్రిష సోషల్ మీడియాలో విజయ్‌ను ఉద్దేశించి చేసే పోస్టులు కూడా అభిమానుల్లో అనుమానాలను రేకెత్తించాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More