త్రిష సీరియస్ వార్నింగ్.. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదంటూ బీజేపీ నేతకు లీగల్ స్టేట్‌మెంట్‌తో స్ట్రాంగ్ రిప్లై
ప్రముఖ నటి త్రిష కృష్ణన్ తన వ్యక్తిగత జీవితంపై, నటుడు, టీవీకే (TVK) అధినేత విజయ్‌తో లింక్ చేస్తూ వచ్చిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. తమిళనాడు బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆమె లీగల్ స్టేట్‌మెంట్‌ను విడుదల చేసింది.
సౌత్ టాప్ హీరోయిన్లలో ఒకరైన త్రిష కృష్ణన్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి తన సినిమాల వల్ల కాదు.. తన వ్యక్తిగత జీవితంపై వచ్చిన కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యల కారణంగా ఆమె సీరియస్ అయింది. కొన్ని రోజుల కిందట తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్.. టీవీకే (TVK) పార్టీ అధినేత విజయ్, త్రిషను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన త్రిష.. సోమవారం (ఫిబ్రవరి 16) తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఒక బహిరంగ లేఖను విడుదల చేసింది.

త్రిష లీగల్ స్టేట్‌మెంట్‌లో ఏముందంటే?
త్రిష తరఫు న్యాయవాది విడుదల చేసిన ఈ ప్రకటనలో బీజేపీ నేత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. "ఇండియన్ సినీ నటి, నా క్లయింట్ త్రిష కృష్ణన్ ఆదేశాల మేరకు నేను ఈ విషయాన్ని రికార్డు చేస్తున్నాను. మీడియాలో నా క్లయింట్ గురించి ప్రచారంలో ఉన్న అసభ్యకరమైన వ్యాఖ్యల పట్ల మేము తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాము" అని అందులో ఉంది.
ఇంకా కొనసాగిస్తూ.. "రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత పదవిలో ఉన్న ఒక వ్యక్తి నుంచి ఇంతటి నీచమైన, అనుచిత వ్యాఖ్యలు వస్తాయని నా క్లయింట్ అస్సలు ఊహించలేదు" అని త్రిష తరఫు న్యాయవాది అందులో పేర్కొన్నారు.
"నా క్లయింట్ త్రిషకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు. భవిష్యత్తులో కూడా చేరాలనే ఉద్దేశం లేదు. గతంలో చెప్పినట్లుగానే, ఆమె రాజకీయాల విషయంలో ఎప్పుడూ తటస్థ వైఖరినే అవలంబిస్తున్నారు" అని అందులో స్పష్టం చేశారు.
నా పేరు లాగొద్దు
"త్రిషను ఆమె నటన ద్వారానే గుర్తించాలి తప్ప, ఆరోపించబడిన రాజకీయ సంబంధాలతో కాదు. అన్నింటికంటే ముఖ్యంగా, వ్యక్తిగత జీవితాలను బహిరంగ చర్చలకు వస్తువుగా మార్చకూడదు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు హుందాగా ప్రవర్తించాలి. ఆమెకు సంబంధం లేని విషయాల్లోకి ఆమె పేరును లాగవద్దు" అని ఆ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు త్రిష "అగౌరవాన్ని ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉండాలి" అని క్యాప్షన్ జోడించింది.
విజయ్ - త్రిష బంధంపై రూమర్స్..
త్రిష, దళపతి విజయ్ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీకి మంచి క్రేజ్ ఉంది. 'గిల్లి' (Ghilli), 'లియో' (Leo) వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. ఇటీవల వచ్చిన 'ది గోట్' సినిమాలో కూడా త్రిష అతిథి పాత్రలో మెరిసింది. వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ సోషల్ మీడియాలో తరచూ రూమర్స్ వస్తుంటాయి.
అయితే విజయ్ 1999లోనే సంగీతను వివాహం చేసుకున్నాడు. వారికి సంజయ్, దివ్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. విజయ్ ఇటీవల 'తమిళగ వెట్రి కజగం' (TVK) పార్టీని స్థాపించి, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
కెరీర్ పరంగా త్రిష ఫుల్ స్వింగ్‌లో ఉంది. గతేడాది ఆమె నటించిన ‘విడాముయర్చి’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, మణిరత్నం 'థగ్ లైఫ్' సినిమాలు విడుదలయ్యాయి. త్వరలో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘విశ్వంభర’, 'కరుప్పు' చిత్రాల్లో ఆమె కనిపించనుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


