Thalapathy Vijay: మా ఆయనకు ఆ హీరోయిన్‌తో అక్రమ సంబంధం ఉంది.. నాకు విడాకులు కావాలి: కోర్టుకెక్కిన దళపతి విజయ్ భార్య

తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు దళపతి విజయ్ (Thalapathy Vijay) వ్యక్తిగత జీవితం రచ్చకెక్కింది. అతనికి ఓ హీరోయిన్ తో అక్రమ సంబంధం ఉందంటూ అతని భార్య విడాకుల కోసం కోర్టుకెక్కింది. ఇప్పుడీ వార్త తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

Published on: Feb 27, 2026, 19:05:14 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తమిళ సూపర్ స్టార్, తమిళనాడు వెట్రి కళగం (TVK) అధినేత దళపతి విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత 27 ఏళ్లుగా అన్యోన్యంగా ఉన్న విజయ్ - సంగీత దంపతులు విడిపోతున్నారనే వార్త కోలీవుడ్‌తో పాటు రాజకీయ వర్గాల్లోనూ కలకలం రేపుతోంది. తన భర్త విజయ్ నుంచి విడాకులు కావాలంటూ సంగీత స్వర్ణలింగం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Thalapathy Vijay: మా ఆయనకు ఆ హీరోయిన్‌తో అక్రమ సంబంధం ఉంది.. నాకు విడాకులు కావాలి: కోర్టుకెక్కిన దళపతి విజయ్ భార్య
Thalapathy Vijay: మా ఆయనకు ఆ హీరోయిన్‌తో అక్రమ సంబంధం ఉంది.. నాకు విడాకులు కావాలి: కోర్టుకెక్కిన దళపతి విజయ్ భార్య

అక్రమ సంబంధం ఆరోపణలే కారణమా?

సంగీత దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం.. దళపతి విజయ్ ఒక ప్రముఖ నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఆమె ఆరోపించారు. 2021లోనే తనకు ఈ విషయం తెలిసిందని, ఆ బంధాన్ని తెంచుకుంటానని విజయ్ హామీ ఇచ్చినప్పటికీ, అది కొనసాగుతూనే ఉందని ఆమె పేర్కొన్నారు. సదరు నటి విజయ్‌తో కలిసి విదేశీ పర్యటనలు చేయడం, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వంటివి తనను, తన పిల్లలను తీవ్ర అవమానానికి గురిచేశాయని సంగీత ఆవేదన వ్యక్తం చేశారు.

మానసిక క్షోభ.. ఆర్థిక ఆంక్షలు

కేవలం అక్రమ సంబంధం మాత్రమే కాకుండా విజయ్ తనపై ఆర్థిక పరమైన ఆంక్షలు విధించారని, తన స్వేచ్ఛను హరించారని సంగీత పిటిషన్‌లో పేర్కొన్నారు.

"మా వివాహ బంధం ప్రస్తుతం కేవలం కాగితాల మీద మాత్రమే ఉంది. దీనిని మళ్లీ పునరుద్ధరించడం అసాధ్యం. ఈ బంధం నాకు మానసిక వేదనను, అవమానాన్ని తప్ప మరేమీ మిగల్చలేదు" అని ఆమె పేర్కొన్నారు.

స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, 1954లోని సెక్షన్ 27(1)(a), 27(1)(d) ప్రకారం వ్యభిచారం (Adultery), వేధింపుల (Cruelty) ప్రాతిపదికన ఆమె ఈ విడాకుల పిటిషన్ వేశారు. ప్రస్తుతం ఈ కేసు జిల్లా కోర్టులో విచారణలో ఉంది.

అభిమానిగా మొదలై.. భార్యగా మారి..

తమిళ పారిశ్రామికవేత్త కుమార్తె అయిన సంగీత.. ఒకప్పుడు విజయ్‌కి వీరాభిమాని. 1999 ఆగస్టు 25న వీరి వివాహం హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం అంగరంగ వైభవంగా జరిగింది. వీరికి జేసన్ సంజయ్, దివ్య సాషా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కీలక సమయంలో ఈ విడాకుల వ్యవహారం బయటకు రావడం గమనార్హం.

నిజానికి తమిళనాడు ఎన్నికలు, సొంత పార్టీ ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్లే ముందు విజయ్ కు ఏదీ కలిసి రావడం లేదు. అతని ర్యాలీల్లో తొక్కిసలాటలు జరిగి అభిమానులు చనిపోవడం, చివరి సినిమా జన నాయగన్ ఇప్పటికీ రిలీజ్ కు నోచుకోకపోవడం, తాజాగా భార్య ఇచ్చిన విడాకుల షాక్ తో విజయ్ సతమతమవుతున్నాడు. మరి ఈ అడ్డంకులు అతడు ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More