Shraddha Kapoor: విజయ్, రష్మిక తరహాలోనే శ్రద్ధా కపూర్-రాహుల్ మోడీ పెళ్లి- హీరోయిన్ పిన్ని తేజస్విని రియాక్షన్ ఇదే!

Tejaswini Kolhapure On Shraddha Kapoor Rahul Mody Wedding: బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్, రాహుల్ మోడీల పెళ్లి గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా ఈ వార్తలపై శ్రద్ధా కపూర్ పిన్ని తేజస్విని కొల్హాపురే స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Published on: Mar 18, 2026, 11:38:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ స్టార్ హీరోయిన్, సాహో బ్యూటీ శ్రద్ధా కపూర్ ప్రేమాయణం ఇండస్ట్రీలో గత కొంత కాలంగా హాట్ టాపిక్ అవుతోంది. రాహుల్ మోడీతో శ్రద్ధా కపూర్ లవ్ ట్రాక్ నడిపిస్తోందని వస్తోన్న వార్తలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా శ్రద్ధా కపూర్, రాహుల్ మోడీల బంధం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

విజయ్, రష్మిక తరహాలోనే శ్రద్ధా కపూర్-రాహుల్ మోడీ పెళ్లి- హీరోయిన్ పిన్ని తేజస్విని రియాక్షన్ ఇదే!
విజయ్, రష్మిక తరహాలోనే శ్రద్ధా కపూర్-రాహుల్ మోడీ పెళ్లి- హీరోయిన్ పిన్ని తేజస్విని రియాక్షన్ ఇదే!

శ్రద్ధా కపూర్, రాహుల్ మోడీ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారని, ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ప్లాన్ చేస్తున్నారని గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రద్ధా కపూర్ పిన్ని, నటి తేజస్విని కొల్హాపురే (శ్రద్ధా తల్లి శివంగి కపూర్‌కి చెల్లి) ఈ పుకార్లపై తనదైన శైలిలో స్పందించారు.

నాకు అసలు ఆ విషయమే తెలియదు!

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో శ్రద్ధా కపూర్ పెళ్లి గురించి ఎదురైన ప్రశ్నకు తేజస్విని నవ్వుతూ బదులిచ్చారు. "నిజంగానా? నాకైతే ఆ విషయం గురించి అస్సలు తెలీదు. పెళ్లి వార్తలపై నాకు ఎలాంటి అవగాహన లేదు" అని తేజస్విని కొల్హాపురే స్పష్టం చేశారు.

గర్వపడిన శ్రద్ధా కపూర్ పిన్ని

అయితే, శ్రద్ధా కపూర్ తన కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న తీరు పట్ల తేజస్విని గర్వపడ్డారు. పద్మిని కొల్హాపురే (శ్రద్ధా తల్లి శివంగి కపూర్‌కి చెల్లి) ఆ కాలంలో సంపాదించిన స్టార్‌డమ్ వేరని, ఇప్పుడు శ్రద్ధా కపూర్ కూడా అదే స్థాయిలో కుటుంబాన్ని గర్వపడేలా చేస్తోందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.

శ్రద్ధా కపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్ కూడా ఈ పెళ్లి వార్తలను గతంలోనే కొట్టిపారేశారు. "ఇది నాకే కొత్తగా ఉంది" అంటూ సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్‌లపై ఆయన సెటైర్లు వేశారు.

రాహుల్ మోడీతో ప్రేమాయణం.. వాస్తవమెంత?

ఇకపోతే 2024 ఆరంభంలో ముంబైలో డిన్నర్ డేట్‌కు వెళ్లినప్పుడు శ్రద్ధా కపూర్, రాహుల్ మోడీల గురించి మొదటిసారి వార్తలు మొదలయ్యాయి. అప్పటి నుంచి వీరిద్దరూ తరచుగా కలిసి కనిపిస్తూనే ఉన్నారు. మధ్యలో వీరిద్దరూ విడిపోయారనే ప్రచారం కూడా జరిగింది.

కానీ, గతేడాది డిసెంబర్‌లో రాహుల్‌తో కలిసి వడాపావ్ డేట్‌కు వెళ్లిన ఫోటోను శ్రద్ధా కపూర్ షేర్ చేయడంతో ఆ పుకార్లకు చెక్ పడింది. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ, ఈ జంట మధ్య ఏదో ఉందనేది అభిమానుల గట్టి నమ్మకం.

వరుస సినిమాలతో శ్రద్ధా బిజీ..

వృత్తిపరంగా చూస్తే శ్రద్ధా కపూర్ ప్రస్తుతం కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నారు. 'స్త్రీ 2' బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత ఆమెకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. తుంబాడ్ డైరెక్టర్ రాహి అనిల్ బార్వే దర్శకత్వం వహిస్తున్న పహాడ్ పంగిర సినిమాలో శ్రద్ధా కపూర్ నటిస్తోంది.

హార్రర్ సినిమాలతో

అలాగే, స్త్రీ 3, భేడియా 2 వంటి సూపర్ హిట్ హర్రర్ కామెడీ యూనివర్స్‌లో, సూపర్ నేచురల్ డ్రామాలో నాగిన్‌లో శ్రద్ధా కపూర్ నటిస్తోందని సమాచారం. వీటితోపాటు మరాఠీ జానపద కళాకారిణి విఠాబాయి నారాయణ్‌గావ్‌కర్ బయోపిక్‌ ఈతలో శ్రద్ధా ప్రధాన పాత్ర పోషించనున్నారు.

విజయ్, రష్మిక తరహాలో

ఇదిలా ఉంటే, ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న శ్రద్ధా కపూర్ తన రూమర్ బాయ్‌ఫ్రెండ్ రాహుల్ మోడీతో సేమ్ విజయ్ దేవరకొండ, రష్మిక తరహాలోనే ఉదయ్‌పూర్‌లో వివాహం చేసుకోనున్నట్లు వార్తలు రావడం, వాటిపై ఆమె పిన్ని తేజస్విని స్పందించడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More