Sitara: అనిరుధ్ మ్యూజికల్ నైట్- నాని ఆయా షేర్ పాట, వీడియో తీసిన భార్య అంజన- జై బాబు అన్న సితార, తండ్రి ఫ్యాన్స్‌తో సందడి
Anirudh Ravichander Musical Night At Hyderabad: సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ 15 ఏళ్ల కెరీర్ వేడుకలు హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగాయి. నాని తన ఫ్యామిలీతో కలిసి ఈ కచేరీలో సందడి చేయగా, మహేశ్ బాబు గారాల పట్టి సితార ఫ్యాన్స్‌తో కలిసి ‘జై బాబు’ అన్న వీడియో సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో ఉంది.
హైదరాబాద్ గచ్చిబౌలి అవుట్‌డోర్ స్టేడియం శనివారం (మార్చి 21) సాయంత్రం యువత కేరింతలతో హోరెత్తిపోయింది. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ తన సంగీత ప్రస్థానంలో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ‘రాక్ స్టార్ అనిరుధ్ XV టూర్’ కచేరీకి వేల సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.

ఈ వేడుకకు నేచురల్ స్టార్ నాని తన భార్య అంజన, కుమారుడు అర్జున్‌తో కలిసి హాజరుకాగా, సూపర్‌స్టార్ మహేశ్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
నాని సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్..
అనిరుధ్ తన కచేరీని ముగిస్తున్న సమయంలో నాని నటిస్తున్న తాజా చిత్రం 'ది ప్యారడైజ్' (శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం) లోని 'ఆయా షేర్' సాంగ్ ప్లే చేశారు. ఆ సమయంలో స్టేడియం మొత్తం బాణాసంచా వెలుగులతో నిండిపోగా, జనం ఒక్కసారిగా ఆ పాటను అందుకోవడంతో వాతావరణం వేడెక్కింది.
ఆ సమయంలో నాని తన కుమారుడు అర్జున్‌ను ఎత్తుకుని పాటను ఎంజాయ్ చేస్తుంటే, పక్కనే ఉన్న నాని భార్య అంజన ఎంతో గర్వంగా తన భర్తను చూస్తూ ఫోన్‌లో ఆ క్షణాలను బంధించారు. ఈ వీడియో ఇప్పుడు నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.
యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహ షేర్ చేసిన ఈ వీడియోలో తండ్రి పాట వస్తుంటే చిన్నారి అర్జున్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అది నాని ఫ్యాన్స్‌ను మరెంతో ఆకట్టుకుంటుంది.
ఫ్యాన్స్‌తో సితార ‘జై బాబు’ ముచ్చట్లు!
మరోవైపు మహేశ్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని కూడా స్టేడియంలో ఫుల్ హంగామా చేసింది. అనిరుధ్ పాటలకు డాన్స్ చేస్తూ, పాడుతూ కనిపించిన సితార.. తన ముందు కూర్చున్న మహేశ్ బాబు అభిమానులతో ముచ్చటించింది.
ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా ‘జై బాబు’ అని నినాదాలు చేయగా, సితార కూడా చిరునవ్వుతో ‘జై బాబు’ అని బదులిచ్చింది. దాంతో మహేశ్ బాబు అభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. తండ్రి మహేష్ బాబు ఫ్యాన్స్‌కు సితారా హై-ఫైవ్ ఇస్తున్న వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అల్లు అర్జున్ ‘AA23’ థీమ్ మ్యూజిక్ హైలైట్..
అనిరుధ్ రవిచందర్ తన కచేరీలో ధనుష్ ‘డాను డాను’, తమన్నా ‘కావాలా’ వంటి సూపర్ హిట్ పాటలతో పాటు, అల్లు అర్జున్-లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘AA23’ థీమ్ మ్యూజిక్‌ను కూడా ప్లే చేశారు. ఈ కార్యక్రమానికి సింగర్ జోనితా గాంధీ కూడా హాజరై తన గాత్రంతో అలరించారు.
నాని తదుపరి చిత్రాలు:
ఇదిలా ఉంటే, నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో 'ది ప్యారడైజ్' చేస్తున్నారు. ఇది ఆగస్టు 21న విడుదల కానుంది. దీనితో పాటు సుజీత్ దర్శకత్వంలో 'బ్లడీ రోమియో'లో నటిస్తున్నారు నాని.
వారణాసి షూటింగ్‌లో
ఇక మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ 'వారణాసి' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇందులో గ్లోబల్ బ్యూటి ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


