OTT: ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్- 8.4 రేటింగ్- భార్యకు ఓసీడీ, సీతాకోకచిలుకతో సీక్రెట్స్ బయటకు!

Oh Butterfly OTT Streaming: ఓటీటీలోకి న్యూ రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఓ బటర్‌ఫ్లై స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. నివేదితా సతీష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ వైవిధ్యభరితమైన సైకలాజికల్ థ్రిల్లర్‌కు ఐఎమ్‌డీబీలో 8.4 రేటింగ్ ఉంది. మరి ఓ బటర్‌ఫ్లై ఓటీటీ రిలీజ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: May 10, 2026, 07:49:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Oh Butterfly OTT Release Details: ప్రస్తుతం వెండితెరపై థ్రిల్లర్ సినిమాల హవా నడుస్తోంది. అందులోనూ మనిషిలోని మానసిక సంఘర్షణలను, రహస్యాలను ఇతివృత్తంగా తీసుకుని వచ్చే 'సైకలాజికల్ థ్రిల్లర్స్'కు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ సైకలాజికల్ థ్రిల్లర్‌కు రొమాంటిక్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తే.. ఆ కోవకే చెందుతుంది 'ఓ బటర్‌ఫ్లై' మూవీ.

ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్- 8.4 రేటింగ్- భార్యకు ఓసీడీ, సీతాకోకచిలుకతో సీక్రెట్స్ బయటకు!
ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్- 8.4 రేటింగ్- భార్యకు ఓసీడీ, సీతాకోకచిలుకతో సీక్రెట్స్ బయటకు!

విభిన్నమైన కథాంశం

ఇటీవలే కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారిన ఓ బటర్‌‌ఫ్లై సినిమాకు డైరెక్టర్ విజయ్ రంగనాథన్ కథ, దర్శకత్వం వహించారు. ఒక విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకులను థియేటర్లలో అలరించింది ఈ సినిమా. రీసెంట్‌గా థియేట్రికల్ రన్‌ను ముగించుకుని ఓ బటర్‌‌ఫ్లై ఓటీటీలోకి వచ్చేసింది.

కథా నేపథ్యం ఇదే..

ఓ బటర్‌‌ఫ్లై సినిమాలో గౌరీ (నివేదితా సతీష్) అనే యువతి పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది. గౌరీకి అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (OCD) ఉంటుంది. తన గతం గురించి ఒక లోతైన రహస్యాన్ని తన భర్తకు చెప్పాలని భావించిన ఆమె, అతడిని ఒక మారుమూల హిల్ స్టేషన్‌లోని ఐసోలేషన్ ప్రాంతానికి తీసుకెళ్తుంది గౌరీ.

అక్కడ ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా, ఏకాంతంగా గడపాలని వెళ్లిన ఆ జంటకు కొన్ని ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. బటర్‌ఫ్లై (సీతాకోకచిలుక) ద్వారా వారికి సంకేతాలు వస్తుంటాయి. ఆ సంకేతాలతో అక్కడున్న రహస్యాలను ఆ జంట ఎలా ఛేదించిందో చెప్పే సినిమానే ఓ బటర్‌‌ఫ్లై. అంటే సీతాకోకచిలుకతో సీక్రెట్స్ బయటకొస్తాయని తెలుస్తోంది.

నటీనటుల ప్రతిభ

బటర్‌ఫ్లై సంకేతాలను వాడుకుంటూ రహస్యాలను ఎలా కనిపెట్టారనేది సినిమాలో ఉత్కంఠభరితంగా డైరెక్టర్ చూపించారు. గతంలో పలు ఓటీటీ వెబ్ సిరీస్‌లు, సినిమాలతో మెప్పించిన నివేదితా సతీష్ ఈ సినిమాలో మెయిన్ రోల్ పోషించింది. తన నటనతో థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ వచ్చేలా చేసింది.

బిగువైన అనుభూతి

గౌరీగా నివేదితా సతీష్ పండించిన హావభావాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. గౌరీ భర్త సూర్య పాత్రలో సిబి భువన చంద్రన్ నటించగా, మరికొన్ని కీలక పాత్రల్లో సీనియర్ నటుడు నాజర్, లక్ష్మి ప్రియ చంద్రమౌళి తమదైన ముద్ర వేశారు. సాంకేతికంగా చూస్తే, సినిమాలోని కెమెరా పనితనం, నేపథ్య సంగీతం ప్రేక్షకులకు ఒక రకమైన 'క్లాస్ట్రోఫోబిక్' (బిగువైన) అనుభూతిని కలిగిస్తాయి.

రొమాంటిక్, సైకలాజికల్ ఇన్సిడెంట్స్‌తో థ్రిల్లింగ్‌గా తెరకెక్కిన ఓ బటర్‌‌ఫ్లై సినిమా మార్చి 6న థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా ఐఎమ్‌డీబీలో 10కి ఏకంగా 8.4 రేటింగ్ కూడా సాధించింది ఈ ఓ బటర్‌‌ఫ్లై మూవీ. అలాంటి ఓ బటర్‌‌ఫ్లై ఓటీటీలోకి రెండు రోజుల క్రితమే స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

ఓటీటీలో ఎప్పుడు? ఎక్కడ?

మే 8న ఓ బటర్‌‌ఫ్లై ఓటీటీ రిలీజ్ అయింది. సన్ నెక్ట్స్ ప్లాట్‌ఫామ్‌లో ఓ బటర్‌‌ఫ్లై ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ప్రస్తుతం కేవలం తమిళ భాషలో, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో మాత్రమే సన్ నెక్ట్స్‌లో ఓ బటర్‌‌ఫ్లై ఓటీటీ ప్రీమియర్ అవుతోంది. సైకలాజికల్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి సన్ నెక్ట్స్ ఓటీటీ మూవీ ఓ బటర్‌‌ఫ్లై మంచి ఆప్షన్.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More