OTT Crime: ఓటీటీలోకి వచ్చేసిన రాశీ ఖన్నా యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్- రాప్ వర్సెస్ డ్రగ్ మాఫియా- తెలుగు సబ్ టైటిల్స్‌తో!

Raashii Khanna Lukkhe OTT Release: ఓటీటీలోకి రాశీ ఖన్నా మ్యూజికల్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ లుఖ్కే స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్రముఖ రాపర్ కింగ్ నటుడిగా పరిచయం అయిన ఈ ఓటీటీ సిరీస్ పంజాబ్ అండర్ గ్రౌండ్ రాప్ సంస్కృతి, డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో సాగుతుంది. మరి లుఖ్కే ఓటీటీ రిలీజ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: May 9, 2026, 05:51:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Raashii Khanna Crime Thriller Lukkhe OTT Streaming: ఓటీటీలోకి మ్యూజికల్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ వచ్చేసింది. అండర్ గ్రౌండ్ రాప్ సంగీతం, గ్యాంగ్ వార్స్, ప్రతీకారం.. ఈ మూడింటి కలయికతో రూపొందిన హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీసే లుఖ్కే. ప్రముఖ ఇండియన్ రాపర్ కింగ్ ఈ ఓటీటీ సిరీస్‌తో వెండితెరకు నటుడిగా పరిచయమయ్యారు.

ఓటీటీలోకి వచ్చేసిన రాశీ ఖన్నా యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్- రాప్ వర్సెస్ డ్రగ్ మాఫియా- తెలుగు సబ్ టైటిల్స్‌తో!
ఓటీటీలోకి వచ్చేసిన రాశీ ఖన్నా యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్- రాప్ వర్సెస్ డ్రగ్ మాఫియా- తెలుగు సబ్ టైటిల్స్‌తో!

రాప్ కల్చర్ చీకటి కోణాలు

ఈ లుఖ్కే వెబ్ సిరీస్‌కు డైరెక్టర్ హిమాంక్ గౌర్ దర్శకత్వం వహించారు. పంజాబ్, చండీగఢ్ ప్రాంతాల్లోని రాప్ కల్చర్ వెనుక ఉన్న చీకటి కోణాలను ఆవిష్కరిస్తూ దర్శకుడు హిమాంక్ గౌర్ ఈ సిరీస్‌ను ఆవిష్కరించారు. మ్యూజిక్, సస్పెన్స్, ఎమోషనల్ కాన్‌ఫ్లిక్ట్‌తో సాగే ఓటీటీ సిరీస్ ఇది. ఇందులో మొత్తంగా 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సిరీస్ మొత్తం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

కథా నేపథ్యం: రాప్ వర్సెస్ డ్రగ్ మాఫియా

చండీగఢ్ నగరంలోని అండర్ గ్రౌండ్ రాప్ సంగీత ప్రపంచంలోకి లక్కీ అనే యువ అథ్లెట్ అడుగుపెడతాడు. అయితే అతను అక్కడికి వచ్చింది కేవలం సంగీతం కోసం మాత్రమే కాదు. నగరాన్ని వణికిస్తున్న 'డెమన్' అనే ప్రమాదకరమైన డ్రగ్ నెట్‌వర్క్ గుట్టు రట్టు చేయడం అతని అసలు లక్ష్యం. ఈ క్రమంలోనే అండర్ గ్రౌండ్ మ్యూజిక్ వరల్డ్‌లో చక్రం తిప్పుతున్న ఇద్దరు ప్రభావవంతమైన రాపర్లు 'ఎంసీ బద్నామ్' (కింగ్), 'ఓజీ' మధ్య సాగే ఆధిపత్య పోరులో లక్కీ చిక్కుకుంటాడు.

సంగీత ప్రపంచంలో ఉండే విరోధాలు, కుటుంబ బాధ్యతలు, వ్యవస్థీకృత నేరాల మధ్య లక్కీ తన మిషన్‌ను ఎలా పూర్తి చేశాడన్నదే ఈ ఓటీటీ సిరీస్ ప్రధానాంశం. మధ్యలో సా నోబర్ అనే మ్యూజిషియన్‌తో ప్రేమకథ, గుర్బానీ అనే అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ చేసే ఇన్వెస్టిగేషన్ కథను మరిన్ని మలుపులు తిప్పుతాయి.

తారాగణం, సాంకేతిక నిపుణులు

ఈ ఓటీటీ సిరీస్ లుఖ్కేలో ఎంసీ బద్నామ్‌గా రాపర్ కింగ్ తనదైన శైలిలో మెప్పించారు. అండర్ కవర్ ఆఫీసర్ గుర్బానీ పాత్రలో బ్యూటిఫుల్ రాశీ ఖన్నా ఆకట్టుకుంది. సా నోబర్‌గా పాలక్ తివారీ నటించారు. వీరితో పాటు లక్ష్యవీర్ సింగ్ సరన్, శివాంకిత్ సింగ్ పరిహార్, యోగరాజ్ సింగ్, అయేషా రజా మిశ్రా వంటి భారీ తారాగణం ఇందులో ఇతర కీలక పాత్రలు పోషించారు.

లుఖ్కే ఓటీటీ స్ట్రీమింగ్

హిమాంక్ గౌర్ తెరకెక్కించిన ఈ సిరీస్‌లో రాప్ బ్యాటిల్స్, యాక్షన్ సీక్వెన్స్ హైలైట్‌గా నిలుస్తాయని మేకర్స్ చెబుతున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన లుఖ్కే ఓటీటీలోకి వచ్చేసింది. మే 8 అంటే నిన్నటి నుంచి లుఖ్కే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

మే 8 అర్థరాత్రి 12 గంటలకు అమెజాన్ ప్రైమ్‌లో లుఖ్కే ఓటీటీ రిలీజ్ అయింది. అయితే, అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆడియో లాంగ్వెజ్‌లో నాలుగు భాషలు చూపిస్తున్నప్పటికీ సిరీస్ మాత్రం కేవలం హిందీ భాషలోనే ఓటీటీ ప్రీమియర్ అవుతోంది. కానీ, ఈ లుఖ్కే సిరీస్‌కు తెలుగు సబ్‌టైటిల్స్ ఉండటం విశేషం.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

అంటే, అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో లుఖ్కే సిరీస్‌ను తెలుగులో కూడా వీక్షించవచ్చు. అండర్‌వరల్డ్, మ్యాజిక్, డ్రగ్స్, సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు రాశీ ఖన్నా పోలీస్‌గా చేసిన లుఖ్కే ఓటీటీ సిరీస్ మంచి ఆప్షన్

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More