OTT Trending: ఓటీటీ ట్రెండింగ్‌లో టాప్ 1గా దూసుకుపోతున్న తెలుగు రొమాంటిక్ డ్రామా- హీరో నటనకు ప్రశంసలు- 8.7 రేటింగ్!

Drinker Sai OTT Trending In Top 1 Place: ఓటీటీ ట్రెండింగ్‌లో టాప్ 1 స్థానంలో తెలుగు రొమాంటిక్ డ్రామా మూవీ డ్రింకర్ సాయి దూసుకుపోతోంది. హీరో ధర్మ మహేష్ నటనకు ప్రశంసలు వస్తున్న ఈ సినిమాకు ఐఎమ్‌డీబీలో 8.7 రేటింగ్ ఉంది. ఇలాంటి డ్రింకర్ సాయి ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: May 31, 2026, 14:30:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telugu Romantic Drama Drinker Sai OTT Trending: హీరోగా ధర్మ మహేష్ నటించిన తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రం డ్రింకర్ సాయి. “బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్” అనేది ట్యాగ్‌లైన్. ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్ర్కీన్ ఎంటర్‌‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ ఈ సినిమాను నిర్మించారు.

ఓటీటీ ట్రెండింగ్‌లో టాప్ 1గా దూసుకుపోతున్న తెలుగు రొమాంటిక్ డ్రామా- హీరో నటనకు ప్రశంసలు- 8.7 రేటింగ్!
ఓటీటీ ట్రెండింగ్‌లో టాప్ 1గా దూసుకుపోతున్న తెలుగు రొమాంటిక్ డ్రామా- హీరో నటనకు ప్రశంసలు- 8.7 రేటింగ్!

డ్రింకర్ సాయి ఐఎమ్‌డీబీ రేటింగ్

డ్రింకర్ సాయి మూవీకి తిరుమలశెట్టి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ధర్మ మహేష్‌కు జోడీగా హీరోయిన్ ఐశ్వర్య శర్మ నటించింది. 2024 డిసెంబర్ 27న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా యూత్, మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా ఐఎమ్‌డీబీలో పదికి ఏకంగా 8.7 రేటింగ్‌ను దక్కించుకుంది.

ఇప్పుడు డ్రింకర్ సాయి ఓటీటీలోనూ తన విజయయాత్రను కొనసాగిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో ధర్మ మహేష్ కనబరిచిన అద్భుత నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది. భావోద్వేగాలు, ప్రేమ, ఆవేశం, బాధ, తిరుగుబాటు స్వభావం వంటి విభిన్న కోణాలను ఆయన ఎంతో సహజంగా పండించారని ఆడియెన్స్ అభిప్రాయపడుతున్నారు.

ధర్మ మహేష్ నటనకు ప్రశంసలు

సినిమా మొత్తం తన భుజాలపై మోస్తూ పాత్రలో పూర్తిగా లీనమైన ధర్మ మహేష్ నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాలో ఒక సాధారణ యువకుడి జీవితంలో జరిగే పరిణామాలను, అతని ప్రేమ, ఆత్మగౌరవం, భావోద్వేగ సంఘర్షణలను ధర్మ మహేష్ ఎంతో నేచురల్‌గా నటించారు.

కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన ఎక్స్‌ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. అందుకే థియేటర్లలో మంచి పేరు తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో మరింత పెద్ద స్థాయిలో ఆదరణ పొందుతోంది. అలాగే ఈ చిత్రంతో బెస్ట్ డెబ్యూ యాక్టర్‌‌గా దుబాయ్‌లో జరిగిన గామా అవార్డ్ అందుకున్నారు ధర్మ మహేష్.

ఐశ్వర్య శర్మ అందం, అభినయం

హీరోయిన్‌గా నటించిన ఐశ్వర్య శర్మ తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఆమెకు ధర్మ మహేష్‌తో ఉన్న కెమిస్ట్రీ సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అలాగే రీతూ చౌదరి, పోసాని కృష్ణ మురళీ, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, భద్రం, బిగ్ బాస్ కిర్రాక్ సీత, ఫన్ బకెట్ రాజేష్, రాజ ప్రజ్వల్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసి కథను మరింత బలపరిచారు.

టెక్నికల్‌గా కూడా ‘డ్రింకర్ సాయి’ మంచి మార్కులు సాధించింది. దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి కథను నేటి యువతకు కనెక్ట్ అయ్యే విధంగా తెరకెక్కించడంలో విజయం సాధించారు. ముఖ్యంగా భావోద్వేగాలు, ప్రేమ కథ, వినోదం వీటన్నింటినీ బ్యాలెన్స్ చేశారు. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా నిర్మాణ విలువలను మెరుగ్గా అందించారు.

జీ5 ఓటీటీలో

ఇక సంగీత దర్శకుడు శ్రీవసంత్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్రత్యేక బలం అయ్యాయి. విడుదలైనప్పటి నుంచి ఈ చిత్రంలోని పాటలు సంగీత ప్రియులను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. కథలోని భావోద్వేగాలను మరింత ప్రభావవంతంగా ప్రేక్షకులకు చేరవేయడంలో సంగీతం కీలక పాత్ర పోషించింది.

ఇలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో ఉన్న డ్రింకర్ సాయి ఓటీటీ ట్రెండింగ్‌లో టాప్ 1 స్థానంలో దూసుకుపోతోంది. జీ5లో డ్రింకర్ సాయి ఓటీటీ రిలీజ్ అయింది. మే 27 నుంచి జీ5లో డ్రింకర్ సాయి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

ఓటీటీ ట్రెండింగ్‌లో

జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ఫ్రీ ఆన్ జీ5 విభాగంలో టాప్-1 ట్రెండింగ్ మూవీగా దూసుకుపోతూ ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంటోంది. రిలీజ్ నుంచే మంచి ఆదరణ తెచ్చుకుంటున్న డ్రింకర్ సాయి జీ5 ఓటీటీ ట్రెండింగ్‌లో టాప్ 1 ప్లేసులో సత్తా చాటుతోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More