Kajol: కోల్‌కతా టచ్‌తో ముంబై ఇల్లు- చెక్కులపై సంతకాలు పెట్టింది కాజోలే- బయటపడిన బిగ్ బాస్ 7 బ్యూటీ తనీషా ఇంటి రహస్యం

Tanishaa Mukerji About Kajol Pay Cheques: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ తన సోదరి తనీషా ముఖర్జీ ముంబై లగ్జరీ హౌస్ కోసం భారీగా ఖర్చు చేసినట్లు తాజాగా తేలింది. ఫరా ఖాన్ యూట్యూబ్ టాక్ షోలో పాల్గొన్న తనీషా.. తన వింటేజ్ హోమ్ విశేషాలతో పాటు అక్క కాజోల్ అందించిన ఆర్థిక సాయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Published on: May 30, 2026, 12:07:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Tanishaa Mukerji About Kajol Pay Cheques: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా దశాబ్దాల పాటు అలరించిన నటి కాజోల్.. తన సోదరి తనీషా ముఖర్జీపై ఉన్న ప్రేమను మరోసారి చాటుకుంది. ముంబై నగరంలో ఉన్న తనీషా వింటేజ్ హోమ్‌కు సంబంధించిన ఆర్థిక బాధ్యతలన్నీ కాజోల్ చూసుకున్నట్లు వెల్లడైంది.

కోల్‌కతా టచ్‌తో ముంబై ఇల్లు- చెక్కులపై సంతకాలు పెట్టింది కాజోలే- బయటపడిన బిగ్ బాస్ 7 బ్యూటీ తనీషా ఇంటి రహస్యం
కోల్‌కతా టచ్‌తో ముంబై ఇల్లు- చెక్కులపై సంతకాలు పెట్టింది కాజోలే- బయటపడిన బిగ్ బాస్ 7 బ్యూటీ తనీషా ఇంటి రహస్యం

ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో తనీషా ముఖర్జీ ఈ విషయాలను పంచుకుంది. అక్కాచెల్లెళ్ల మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కోల్‌కతా టచ్‌తో ముంబై ఇల్లు

ఫరా ఖాన్ తన వంటవాడు దిలీప్‌తో కలిసి తనీషా ముఖర్జీ నివాసానికి వెళ్లినప్పుడు ఈ ఇంటి విశేషాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఇల్లు పాతకాలపు కోల్‌కతా వైబ్‌తో పాటు టర్కిష్ డిజైన్ల కలయికతో అద్భుతంగా ఉంది. పెద్ద పెద్ద మెట్లు, గోతిక్ ఆర్ట్ వర్క్స్, సాయంత్రం వేళల్లో వెలిగించే కొవ్వొత్తుల వెలుగులు ఈ ఇంటికి ఒక వింటేజ్ లుక్‌ను తీసుకొచ్చాయి.

ఈ ఇంటి అందాన్ని చూసి ఫిదా అయిన ఫరా ఖాన్.. ముంబైలో ఇలాంటి ఇల్లు దొరకడం చాలా కష్టమని, అసలు తనీషా ఇల్లు చూస్తుంటే కోల్‌కతా నగరానికి వచ్చినట్లు ఉందని ప్రశంసించింది. ఈ ఇల్లు కొనడానికి, దాన్ని డిజైన్ చేయడానికి కాజోల్ ఎంత సాయం చేసిందని ఫరా ఖాన్ సరదాగా అడిగిన ప్రశ్నకు తనీషా నవ్వుతూ సమాధానమిచ్చింది.

చెక్కులపై సంతకాలు పెట్టింది కాజోలే!

"ఈ ఇంటికి మొత్తం డబ్బులు కాజోలే కట్టింది. తనే చెక్ బుక్స్ మీద సంతకాలు పెడుతుంది" అని తనీషా వెల్లడించింది. దీనిపై ఫరా ఖాన్ స్పందిస్తూ.. ప్రతి ఒక్కరూ కోరుకునే పర్ఫెక్ట్ సోదరి కాజోల్ అంటూ అభినందించింది. ఫరా ఖాన్ యూట్యూబ్ టాక్ షోలో క్యాండిడ్‌గా చెబుతూ తన ఇంటి సీక్రెట్‌ను బయటపెట్టేసింది తనీషా ముఖర్జీ.

తన తండ్రికి ఇల్లు సర్దడం పెద్దగా ఇష్టం లేకపోవడంతో, తన తల్లి తనుజ పాత ఇంట్లో ఉన్న ఫర్నిచర్‌నే ఈ కొత్త ఇంటికి వాడుకున్నట్లు తనీషా తెలిపింది. దాదాపు 14 ఏళ్ల క్రితమే తాను ఈ ఇంట్లోకి మారానని, అప్పటి నుంచి ముంబై నగరం, అందునా సీ లింక్ వచ్చిన తర్వాత చాలా మారిపోయిందని గుర్తు చేసుకుంది.

రియాలిటీ షోలతో పాపులారిటీ

ప్రముఖ సీనియర్ నటి తనుజ కుమార్తె అయిన తనీషా ముఖర్జీ.. 2003లో 'ష్...' (Sssshhh) సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ నటించిన 'సర్కార్', 'నీల్ అండ్ నిక్కీ' చిత్రాల్లో మెరిసింది. అలాగే తమిళంలో విజయవంతమైన 'ఉన్నాలే ఉన్నాలే' సినిమాలో నటించి ప్రశంసలు దక్కించుకుంది.

సినిమాల కంటే 2013లో వచ్చిన 'బిగ్ బాస్ సీజన్ 7' రియాలిటీ షోతో తనీషా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఈ షోలో రన్నరప్‌గా నిలిచిన ఆమె.. ఆ తర్వాత 'ఖత్రోన్ కే ఖిలాడీ 7', 'ఝలక్ దిఖ్లా జా 11' వంటి పాపులర్ రియాలిటీ షోలలో కంటెస్టెంట్‌గా సందడి చేసింది. చివరగా 2024లో విడుదలైన 'లవ్ యు శంకర్' చిత్రంలో స్క్రీన్‌పై కనిపించింది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. తనీషా ముఖర్జీ ముంబై ఇంటికి కాజోల్ ఎలాంటి సాయం చేసింది?

తనీషా ముఖర్జీ ముంబైలో కొనుగోలు చేసిన లగ్జరీ వింటేజ్ హోమ్‌కు సంబంధించిన పూర్తి ఆర్థిక బాధ్యతలను కాజోలే చూసుకుంది. ఈ విషయాన్ని ఫరా ఖాన్ షోలో తనీషా స్వయంగా వెల్లడించింది.

2. తనీషా ముఖర్జీ ఇల్లు ఏ శైలిలో డిజైన్ చేశారు?

ఈ నివాసం పాతకాలపు కోల్‌కతా సంస్కృతి, టర్కిష్ డిజైన్ల కలయికతో వింటేజ్ లుక్‌లో ఉంటుంది. ఇందులో గోతిక్ ఆర్ట్ వర్క్, విలక్షణమైన మెట్లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

3. తనీషా ముఖర్జీ సినీ కెరీర్‌లో ముఖ్యమైన చిత్రాలు ఏవి?

తనీషా ముఖర్జీ 'సర్కార్', 'నీల్ అండ్ నిక్కీ' చిత్రాలతో పాటు తమిళ హిట్టయిన 'ఉన్నాలే ఉన్నాలే' సినిమాలో నటించింది. అంతేకాకుండా బిగ్ బాస్ 7, ఖత్రోన్ కే ఖిలాడీ లాంటి రియాలిటీ షోల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More