Vihari OTT: తొలి తెలుగు ట్రావెల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ విహారి- కేన్స్‌లో బిగ్ బాస్ శ్రీ సత్యతో లాంచ్- స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Vihari OTT Platform Launch At Cannes By Bigg Boss Sri Satya: తెలుగు ఓటీటీ వినోద రంగంలో సరికొత్త విప్లవానికి తెర లేచింది. గత 18 ఏళ్లుగా బుల్లితెరపై అద్భుతమైన ట్రావెల్ షోలతో అలరించిన విహారి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా రానుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి తెలుగు ట్రావెల్ ఓటీటీగా విహారి స్ట్రీమింగ్ కానుంది.

Published on: May 25, 2026, 11:21:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Vihari OTT Platform Launch At Cannes By Bigg Boss Sri Satya: ఇప్పటికే డిజిటల్ వినోద రంగంలో ఎన్నో రకాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ నుంచి తెలుగు ప్లాట్‌ఫామ్స్ ఈటీవీ విన్, ఆహా వరకు అన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు, సీరియల్, న్యూస్ వంటి కంటెంట్‌ను అందిస్తున్నాయి.

తొలి తెలుగు ట్రావెల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ విహారి- కేన్స్‌లో బిగ్ బాస్ శ్రీ సత్యతో లాంచ్- స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తొలి తెలుగు ట్రావెల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ విహారి- కేన్స్‌లో బిగ్ బాస్ శ్రీ సత్యతో లాంచ్- స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఓటీటీ రంగంలో వినూత్నంగా

అయితే, తెలుగు ప్రేక్షకులకు సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేయడానికి ఓటీటీ రంగంలో వినూత్న ప్రయోగం సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ప్రియులను (ట్రావెల్ లవర్స్), సాహస యాత్రికులను ఆకట్టుకునేలా ఒక ప్రత్యేక ఓటీటీ వేదిక అందుబాటులోకి వస్తోంది. గత దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు టెలివిజన్ రంగంలో పర్యాటక కథనాలతో తనదైన ముద్ర వేసిన 'విహారి' బ్రాండ్, ఇప్పుడు పూర్తిస్థాయి అంతర్జాతీయ ట్రావెల్ ఓటీటీ ( Travel OTT) ప్లాట్‌ఫామ్‌గా అవతరించింది.

విహారి ఓటీటీ లాంచ్

ఫ్రాన్స్ దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా ఈ 'విహారి ఓటీటీ' గ్లోబల్ విజన్‌ను అధికారికంగా ఆవిష్కరించారు. బిగ్ బాస్ ఫేమ్, ప్రముఖ టాలీవుడ్ నటి శ్రీ సత్య చేతుల మీదుగా ఈ విహారి ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రత్యేక ప్రివ్యూను విడుదల చేశారు.

అరుదైన మైలురాయిగా

ఒక ప్రాంతీయ భాషకు చెందిన ట్రావెల్ కంటెంట్ అంతర్జాతీయ వేదికపై ఆవిష్కృతం కావడం తెలుగు డిజిటల్ మీడియా చరిత్రలోనే ఒక అరుదైన మైలురాయిగా నిలిచిపోతుంది. ప్రపంచ దేశాల సంస్కృతులు, సరికొత్త పర్యాటక ప్రాంతాలను తెలుగు వారి స్మార్ట్‌ ఫోన్ స్క్రీన్లపైకి తెచ్చేందుకు ఈ వేదిక ఉపయోగపడనుంది.

18 ఏళ్ల నమ్మకం.. ఇప్పుడు సరికొత్త రూపంలో

దాదాపు 18 సంవత్సరాల క్రితం బుల్లితెరపై ఒక చిన్న ప్రయాణంగా ప్రారంభమైన 'విహారి' కార్యక్రమం తెలుగు రాష్ట్రాల్లోని లక్షలాది మంది ఇళ్లల్లో ఒక భాగంగా మారింది. అప్పట్లో కేవలం టీవీలకే పరిమితమైన ఈ షో ద్వారా ఎన్నో దేశాల అందాలు, చారిత్రక కట్టడాలు, స్థానిక రుచులు, విభిన్న సంస్కృతులను విహారి బృందం తెలుగు ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్లు చూపించింది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా, నేటి తరం ప్రేక్షకుల అభిరుచులను దృష్టిలో ఉంచుకుని ఈ కంటెంట్‌ను మరింత రిచ్‌గా, విశ్లేషణాత్మకంగా ఓటీటీ రూపంలో డిజైన్ చేశారు.

జూన్ నుంచి ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్

ఈ జూన్ నెలలో ఈ విహారి ఓటీటీ ప్లాట్‌ఫామ్ అధికారికంగా తన సేవలను ప్రారంభించనుంది. కేవలం వినోదం మాత్రమే కాకుండా ప్రయాణాల పట్ల ఆసక్తి ఉన్న వారికి, కొత్త ప్రదేశాలను అన్వేషించే వారికి ఇదొక గైడ్‌లా పనిచేస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు.

బిగ్ బాస్ శ్రీ సత్య కామెంట్స్

"తెలుగు భాషలో కేవలం ప్రయాణాలు, పర్యాటకం కోసమే ఒక ప్రత్యేక ఓటీటీ రావడం చాలా గర్వంగా ఉంది. ఈ ప్లాట్‌ఫామ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఎంతగానో అలరిస్తుంది" అని కేన్స్ వేదికపై ప్రివ్యూను లాంచ్ చేసిన సందర్భంగా శ్రీ సత్య ఆనందం వ్యక్తం చేశారు.

ట్రావెల్ కంటెంట్‌తో తొలిసారిగా ఓటీటీ

ప్రస్తుతం మార్కెట్లో సినిమాలు, వెబ్ సిరీస్‌ల కోసం వందలాది ఓటీటీలు ఉన్నప్పటికీ, కేవలం ట్రావెల్ కంటెంట్ కోసమే ఒక ప్రత్యేక ప్లాట్‌ఫామ్ రావడం ఇదే తొలిసారి. ఈ సరికొత్త ప్రయత్నం తెలుగు ఓటీటీ రంగాన్ని నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More