OTT: ఓటీటీ సిరీస్‌ను కేవలం 17 రోజుల్లోనే పూర్తి చేశాం, చాలా ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది: సినిమాటోగ్రాఫర్ కిషోర్

Memu Copulam OTT Series Cinematographer Kishore Boyidapu Comments: ఇటీవల ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ కామెడీ వెబ్ సిరీస్ మేము కాప్‌లం. నాగబాబు, గెటప్ శ్రీను ప్రధాన పాత్రలు పోషించిన ఈ ఓటీటీ సిరీస్‌కు సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేసిన కిషోర్ బోయిడాపు ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపారు. అవేంటో చూద్దాం.

Published on: May 25, 2026, 09:30:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Memu Copulam OTT Series Cinematographer Kishore Boyidapu Comments: ద‌ర్శ‌కుడు ఆలోచ‌న‌ను వెండితెర‌పై అద్భుతంగా ఆవిష్క‌రించే బ్ర‌హ్మ సినిమాటోగ్రాఫ‌ర్‌. అంతే కాదు.. నిర్మాత పెట్టే బ‌డ్జెట్ వాల్యూని కూడా ప‌దింత‌లు చేసి చూపించే మాయాజాలీకుడు కూడా.

ఓటీటీ సిరీస్‌ను కేవలం 17 రోజుల్లోనే పూర్తి చేశాం, చాలా ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది: సినిమాటోగ్రాఫర్ కిషోర్
ఓటీటీ సిరీస్‌ను కేవలం 17 రోజుల్లోనే పూర్తి చేశాం, చాలా ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది: సినిమాటోగ్రాఫర్ కిషోర్

పెద్ద కొడుకు అనడంలో

సినిమాకు తండ్రి నిర్మాత‌.. త‌ల్లి ద‌ర్శ‌కుడైతే.. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వ‌ర‌కు భుజం కాచే పెద్ద కొడుకు సినిమాటోగ్రాఫ‌ర్ అని అన‌టంలో సందేహం లేదు. ఇలాంటి కీల‌క శాఖ‌లో త‌న‌దైన ప్ర‌తిభ‌ను చూపిస్తున్నారు కిషోర్ బోయిడాపు. పూర్తి పేరు దుర్గ కిషోర్ కుమార్.

కెమెరా డిపార్ట్‌మెంట్‌లో చిన్న స్థాయి నుంచి త‌న ప్ర‌యాణాన్ని ప్రారంభించిన కిషోర్ తెలుగు సినిమాల‌తో పాటు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లోనూ వ‌ర్క్ చేసి త‌నేంటో ప్రూవ్ చేసుకున్నారు. తాజాగా కిషోర్ బోయిడాపు సినిమాటోగ్రాఫర్‌గా పని చేసిన తెలుగు ఓటీటీ సిరీస్ మేము కాప్‌లం.

జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్

తెలుగులో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన మేము కాప్‌లం ఓటీటీ సిరీస్‌లో నాగబాబు, గెటప్ శ్రీను, రవితేజ నన్నిమాల ప్రధాన పాత్రలు పోషించారు. డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించారు. మే 22 నుంచి జీ5లో మేము కాప్‌లం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ ఓటీటీ సిరీస్‌లో కిషోర్ అందించిన విజువల్స్‌కు ప్రశంసలు వస్తున్నాయి. ఈ ఓటీటీ సిరీస్‌ను కేవలం 17 రోజుల్లోనే తెరకెక్కించ‌టంలో కీల‌క పాత్ర‌ను పోషించిన‌ కిషోర్ బోయిడాపు వెబ్ సిరీస్‌కు సంబంధించిన ఎన్నో విశేషాల్ని పంచుకున్నారు.

17 రోజుల్లో పూర్తి చేశాం

"‘మేము కాప్‌లం’ మొత్తం షూటింగ్‌ను కేవలం 17 రోజుల్లో పూర్తి చేశాం. మంచి ప్రీ-ప్రొడక్షన్ ప్లానింగ్ వల్ల, అలాగే ప్రతి డిపార్ట్‌మెంట్ ఎంతో కష్టపడి పనిచేసినందువల్లే అది సాధ్యమైంది. ప్లానింగ్ నుంచి ఎగ్జిక్యూషన్ వరకు అందరూ తమ బెస్ట్ ఇచ్చి సజావుగా పూర్తయ్యేలా సపోర్ట్ చేశారు. ఈ ప్రయాణంలో ఎప్పుడూ క్లారిటీతో, సపోర్ట్‌తో ముందుండిన డైరెక్టర్ ప్రదీప్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు" అని కిషోర్ అన్నారు.

"మా మీద నమ్మకం ఉంచి ఈ ప్రాజెక్ట్‌కు అండగా నిలిచిన ప్రొడ్యూసర్ బీవీఎస్ రవి గారికి, అలాగే మొత్తం ప్రొడక్షన్ టీంకి హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే నాగబాబు గారు, శ్రీను గారు, రవి గారు, మొత్తం నటీనటులు, టెక్నీషియన్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అందరి సహకారం, టీమ్‌వర్క్ వల్ల షూట్‌ను సమయానికి విజయవంతంగా పూర్తి చేయగలిగాం" అని సినిమాటోగ్రాఫర్ కిషోర్ తెలిపారు.

రెక్కీ సమయంలోనే

"ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ రెక్కీ చేస్తున్న సమయంలోనే ఏ సీన్‌ని ఎలా తీయాలి.. ఎంతలో తీయాలి.. అనే దాన్ని నేను, ప్రదీప్ కలిసి డిస్కస్ చేసుకున్నాం. మేం ఆఫీస్‌లోనే ఎక్కువగా చర్చించుకున్నాం. ప్రీ ప్రొడక్షన్‌లోనే మేం ఓ క్లారిటీతో ఉన్నాం. అలా కో ఆర్డినేషన్‌తోనే ఓటీటీ సిరీస్‌ని అనుకున్న ముందుగానే ఫినిష్ చేశాం" అని దుర్గ కిషోర్ కుమార్ చెప్పుకొచ్చారు.

దర్శకత్వ ఆలోచనలు

"కెమెరామెన్ టు డైరెక్టర్ అనేది అంత సులభమైన పని కాదు. డైరెక్షన్ అనేది చాలా రెస్పాన్సిబుల్ జాబ్. చాలా ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. నాక్కూడా కొన్ని ఆలోచనలున్నాయి. కానీ, ఇప్పట్లో మాత్రం అటు సైడ్ వెళ్లను. ప్రస్తుతం నేను ఏఐ టెక్నాలజీని నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాను" అని కిషోర్ బోయిడాపు పేర్కొన్నారు.

ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్‌లు

"‘ప్రేమకు నమస్కారం’ రిలీజ్‌కు రెడీగా ఉంది. షణ్ముక్ జస్వంత్, బిగ్ బాస్ శివాజీ గారు, భూమిక గారు ఇందులో న‌టించారు. అలాగే రాజీవ్ కనకాల గారు ప్ర‌ధాన పాత్ర‌లో ‘మ‌న డాక్ట‌ర్ బాబు’ అనే మ‌రో మూవీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంటోంది. మ‌రికొన్ని రెండు, మూడు సినిమాలు డిస్క‌ష‌న్ స్టేజ్‌లో ఉన్నాయి" అని వెల్లడించారు సినిమాటోగ్రాఫర్ కిషోర్.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More