Ameesha Patel Bhumika Chawla: అమీషా పటేల్ ప్లేసులో భూమిక.. పశ్చాత్తాపపడుతున్న స్టార్ హీరోయిన్.. ఏమైందంటే?
Ameesha Patel Regrets To Rejecting And Bhumika Get Chance: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అమీషా పటేల్ స్థానంలోకి అప్పుడే ఎంట్రీ ఇచ్చిన భూమిక చావ్లా ఎంట్రీ ఇచ్చింది. కట్ చేస్తే ఆ సినిమా, ఆ పాత్రకు విపరీతమైన క్రేజ్ లభించింది. ఆ పాత్రను వదులుకున్నందుకు ఇప్పుడు అమీషా పటేల్ పశ్చాత్తాపపడుతున్నట్లు తెలిపింది.
Ameesha Patel Regrets Of Bhumika Role: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రాల్లో 'తేరే నామ్' ఒకటి. 2003లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం. రాధే పాత్రలో సల్మాన్ ఖాన్ నటన, ఆ హెయిర్ స్టైల్, హిట్ సాంగ్స్ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తే.

తొలి హిందీ సినిమా
అయితే, ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన భూమిక చావ్లాకు అది తొలి హిందీ సినిమా. కానీ, నిజానికి ఈ పాత్ర కోసం సల్మాన్ ఖాన్ మొదట అనుకున్నది భూమికను కాదు. అప్పట్లో స్టార్ ఇమేజ్‌తో తెగ క్రేజ్‌లో ఉన్న అమీషా పటేల్‌ను. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అమీషా పటేల్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆ సినిమాను వదులుకున్నందుకు ఇప్పటికీ పశ్చాత్తాపపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఆఫర్ వచ్చినప్పుడు ఏమైందంటే?
అమీషా పటేల్ మాట్లాడుతూ.. "తేరే నామ్ సినిమాను మిస్ చేసుకోవడం నా కెరీర్‌లో ఒక పెద్ద వెలితి. సల్మాన్ నాకు కథ చెప్పినప్పుడు కేవలం పాటలు మాత్రమే రికార్డ్ అయ్యాయి. సినిమా గురించి ఒక స్పష్టమైన ఐడియా ఉంది కానీ, షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? ఎవరు దర్శకత్వం వహిస్తారు? అనే విషయాలపై అప్పట్లో స్పష్టత లేదు. అంతా గాల్లో దీపంలా ఉన్న సమయంలో సల్మాన్ నాకు కథ వినిపించి, పాటలు కూడా వినిపించారు. నాకు కథ బాగా నచ్చింది, కానీ డేట్స్ ఖరారు కాలేదు" అని వివరించారు.
సతీష్ కౌశిక్ ఎంట్రీ ఇచ్చేసరికి ఆలస్యం
సాధారణంగా పెద్ద ప్రాజెక్టులు పట్టాలెక్కేటప్పుడు దర్శకుడు, షెడ్యూల్స్ ముందే సిద్ధంగా ఉంటాయి. కానీ, 'తేరే నామ్' విషయంలో అది జరగలేదు. దర్శకుడిగా దివంగత సతీష్ కౌశిక్ పేరు ఖరారయ్యే సరికి చాలా సమయం పట్టింది. అప్పటికే అమీషా పటేల్ ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల తన డేట్స్ సర్దుబాటు చేయలేకపోయారు.
"సల్మాన్ ఖాన్ పూర్తి ప్లానింగ్‌తో వచ్చి ఉంటే కచ్చితంగా ఆ సినిమా చేసేదాన్ని. నేను అప్పటికే ఇతర నిర్మాతలకు మాట ఇచ్చి ఉండటం వల్ల వెనక్కి తగ్గాల్సి వచ్చింది" అని అమీషా పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు.
తమిళ రీమేక్‌గా వచ్చి సంచలనం
'తేరే నామ్' చిత్రం 1999లో చియాన్ విక్రమ్ కథానాయకుడిగా వచ్చిన తమిళ సూపర్ హిట్ 'సేతు'కు రీమేక్. ఒక మొండి ఘటం, కాలేజ్ డ్రాపవుట్ అయిన యువకుడు ఒక అమాయకపు అమ్మాయి ప్రేమలో పడి, చివరికి పిచ్చోడిగా మారే ఈ విషాద గాథ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
భూమిక చావ్లా ఈ పాత్రలో ఒదిగిపోయి నటించడంతో ఆమెకు బాలీవుడ్‌లో మంచి బ్రేక్ లభించింది. అమీషా పటేల్ వంటి స్టార్ హీరోయిన్ నటించి ఉంటే ఫలితం ఎలా ఉండేదో కానీ, ఇప్పటికీ 'తేరే నామ్' అంటే సల్మాన్-భూమిక జోడీనే అందరికీ గుర్తొస్తుంది. అలా అమీషా పటేల్ ప్లేసులోకి భూమిక వచ్చి మంచి క్రేజ్ తెచ్చుకుంది.
తెలుగులో రాజశేఖర్ హీరోగా
కాగా, ఇదే సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేశారు. ఆ సినిమానే శేషు. ఈ మూవీలో హీరోగా యాంగ్రీ స్టార్ రాజశేఖర్ చేయగా.. హీరోయిన్‌గా కావేరి చేసింది. అయితే, ఈ సినిమాకు రాజశేఖర్ భార్య జీవిత దర్శకత్వం వహించడం విశేషం. రాజశేఖర్ నటనకు ప్రశంసలు వచ్చిన శేషు సినిమా తెలుగులో మాత్రం ఫ్లాప్‌గా మిగిలింది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. తేరే నామ్ సినిమా ఏ చిత్రానికి రీమేక్?
తేరే నామ్ చిత్రం 1999లో విడుదలైన తమిళ సినిమా 'సేతు'కు అధికారిక రీమేక్. తమిళంలో విక్రమ్ హీరోగా నటించారు.
2. అమీషా పటేల్ ఈ సినిమాను ఎందుకు వదులుకున్నారు?
సినిమా షూటింగ్ డేట్స్ మరియు దర్శకుడు సతీష్ కౌశిక్ రాక ఆలస్యం కావడంతో, అప్పటికే ఇతర సినిమాలతో బిజీగా ఉన్న అమీషా పటేల్ తన డేట్స్ సర్దుబాటు చేయలేక ఈ ప్రాజెక్టును వదులుకున్నారు.
3. తేరే నామ్ సినిమా ఎప్పుడు విడుదలైంది?
ఈ చిత్రం 2003లో థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. సల్మాన్ ఖాన్ కెరీర్‌లో ఇది ఒక బిగ్గెస్ట్ మైల్‌స్టోన్.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


