సినీ జీవితాన్ని మార్చేసిన ఫేస్‌బుక్ రిక్వెస్ట్- బిగ్ బాస్‌లో లవ్, ఓటీటీ షోలో ప్రపోజ్- తేజస్వి, కరణ్ ఏజ్ గ్యాప్ ఎంతంటే?

Bigg Boss Tejasswi Prakash Karan Reveals Age Gap: బిగ్ బాస్ క్రేజీ కపుల్ కరణ్ కుంద్రా, తేజస్వి ప్రకాష్ తమ కెరీర్, రిలేషన్‌షిప్‌లోని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కరణ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు తేజస్వి ఇంకా స్కూల్ చదువుతోందని చెప్తూ ఇద్దరి మధ్య ఉన్న వయసు వ్యత్యాసాన్ని గుర్తుచేసుకున్నారు.

Published on: May 24, 2026, 15:04:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bigg Boss Tejasswi Prakash Karan Reveals Age Gap: బుల్లితెరపైనే కాకుండా ఓటీటీ వేదికలపైనా విశేష ఆదరణ సొంతం చేసుకున్న లవ్ బర్డ్స్ కరణ్ కుంద్రా, తేజస్వి ప్రకాష్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ అయిన రియాలిటీ షో 'దేశీ బ్లింగ్' వీరికి మరింత పాపులారిటీ తెచ్చిపెట్టింది. అయితే, ఈ క్రేజీ జంట మధ్య దాదాపు తొమ్మిదేళ్ల వయసు వ్యత్యాసం ఉంది.

సినీ జీవితాన్ని మార్చేసిన ఫేస్‌బుక్ రిక్వెస్ట్- బిగ్ బాస్‌లో లవ్, ఓటీటీ షోలో ప్రపోజ్- తేజస్వి, కరణ్ ఏజ్ గ్యాప్ ఎంతంటే?
సినీ జీవితాన్ని మార్చేసిన ఫేస్‌బుక్ రిక్వెస్ట్- బిగ్ బాస్‌లో లవ్, ఓటీటీ షోలో ప్రపోజ్- తేజస్వి, కరణ్ ఏజ్ గ్యాప్ ఎంతంటే?

ఏజ్ గ్యాప్ గురించి

ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ జంట తమ ఏజ్ గ్యాప్, అలాగే కెరీర్ ప్రారంభంలో ఎదురైన అనుభవాలను సరదాగా పంచుకున్నారు. 'నాగిని' సిరీస్ ద్వారా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన తేజస్వి.. తన పార్ట్‌నర్ గురించి చెప్పిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నటుడు అంగద్ బేడీ, నేహా ధూపియా నడుపుతున్న యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో కరణ్, తేజస్వి సందడి చేశారు. ఈ సందర్భంగా కరణ్ కుంద్రా తన నటన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, ఒకే ఒక్క ఫేస్‌బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ తన జీవితాన్ని ఎలా మార్చేసిందో వివరించారు.

ఒకే ఒక్క ఫేస్‌బుక్ రిక్వెస్ట్.. కరణ్ లైఫ్ టర్నింగ్ పాయింట్

"మాది పంజాబ్‌లోని జలంధర్ అనే చిన్న టౌన్. ముంబై, ఢిల్లీలతో పోలిస్తే అక్కడ జీవితం చాలా సింపుల్‌గా సాగిపోతుంది. మేము 90ల కాలం నాటి పిల్లలం కావడంతో అప్పట్లో మాకు బయటి ప్రపంచం గురించి అంతగా అవగాహన ఉండేది కాదు. ఇంటర్నెట్ రాకతోనే అంతా మారిపోయింది" అని కరణ్ కుంద్రా తెలిపారు.

"నేను మా నాన్నతో కలిసి ఒక కాల్ సెంటర్ నడుపుతున్న రోజుల్లో.. సరదాగా 2008లో ఫేస్‌బుక్‌లో ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్‌కు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాను. దానికి ఆమె స్పందిస్తూ వెంటనే ముంబై వచ్చేయ్ అని రిప్లై ఇచ్చారు" అని కరణ్ కుంద్రా తన ఇండస్ట్రీ ఎంట్రీని గుర్తుచేసుకున్నారు. ఆ ఒక్క మెసేజ్ కరణ్ సినీ కెరీర్‌ను మలుపు తిప్పింది.

కరణ్ హీరో అయినప్పుడు తేజస్వి స్కూల్లోనే!

కరణ్ తన గతాన్ని చెబుతుండగా పక్కనే ఉన్న తేజస్వి ప్రకాష్ గట్టిగా నవ్వుతూ మధ్యలో ఒక ఆసక్తికర ట్విస్ట్ ఇచ్చారు. కరణ్ ముంబైలో అడుగుపెట్టిన 2008వ సంవత్సరంలో తాను ఇంకా స్కూలు చదువుతున్నానని తేజస్వి ప్రకాష్ సరదాగా పేర్కొన్నారు. అసలు నటన వైపు రావడం తన ప్రణాళికల్లోనే లేదని తేజస్వి స్పష్టం చేశారు.

కేవలం వార్తాపత్రికల్లో 'ఫ్రెష్ ఫేస్'గా తన ఫోటోలు రావడం, ఆ గుర్తింపు చూసి ఆడిషన్స్ అవకాశాలు వెతుక్కుంటూ రావడంతోనే రంగుల ప్రపంచంలోలోకి అడుగుపెట్టానని చెప్పారు. అంతేకాకుండా, కరణ్‌తో పరిచయం కాకముందు అతని గురించి తనకు పెద్దగా తెలియదని తేజస్వి ఒప్పుకున్నారు.

"కరణ్ చేసిన షోలలో నేను కేవలం 'లవ్ స్కూల్' మాత్రమే చూశాను. అతని వ్యక్తిత్వం భిన్నంగా అనిపించింది. నిజానికి నేను ఎప్పుడూ నటులను డేట్ చేయకూడదని అనుకునేదాన్ని. పని చేసే చోట వృత్తిపరంగానే ఉండటం నాకిష్టం. కానీ కరణ్ విషయంలో నా ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి" అని తేజస్వి చెప్పుకొచ్చారు.

బిగ్ బాస్ హౌస్ టు దుబాయ్.. 'తేజ్రాన్' లవ్ స్టోరీ

సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించిన 'బిగ్ బాస్ సీజన్ 15' హౌస్‌లో 2021లో తేజస్వి ప్రకాష్, కరణ్ కుంద్రా పరిచయం ప్రేమగా మారింది. అప్పటి నుంచి వీరిద్దరూ కలిసే ఉంటున్నారు. అభిమానులు ఈ జంటను ప్రేమగా 'తేజ్రాన్' (TejRan) అని పిలుచుకుంటారు.

ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ షో 'దేశీ బ్లింగ్' లో వీరి మధ్య జరిగిన కొన్ని చిన్న చిన్న గొడవల వల్ల విడిపోతున్నారంటూ నెట్టింట పుకార్లు వచ్చాయి. అయితే వాటన్నింటికీ కరణ్ కుంద్రా దుబాయ్‌లో గట్టి సమాధానమిచ్చారు.

పంజాబీ స్టైల్‌లో లవ్ ప్రపోజ్

ఓటీటీ షో చివరి ఎపిసోడ్‌లో దుబాయ్‌లో ఒక రోమాంటిక్ వాతావరణాన్ని ప్లాన్ చేసి, మోకాళ్లపై కూర్చుని పంజాబీ స్టైల్‌లో తేజస్వికి ప్రపోజ్ చేశారు కరణ్. భారీ డైమండ్ రింగ్ చూపిస్తూ పెళ్లి చేసుకుంటావా అని అడగడంతో తేజస్వి ఎమోషనల్ అయ్యారు.

జరిగిన నిశ్చితార్థం- పెళ్లి ఎప్పుడు?

ఆ సర్‌ప్రైజ్‌కు కళ్లల్లో నీళ్లతో ఒళ్లు వణుకుతోందంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు తేజస్వి ప్రకాష్. ప్రస్తుతానికి నిశ్చితార్థం ముగిసినా, పెళ్లి తేదీని మాత్రం తేజస్వి-కరణ్ జంట ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. కరణ్ కుంద్రా, తేజస్వి ప్రకాష్ మధ్య వయసు వ్యత్యాసం ఎంత?

కరణ్ కుంద్రా, తేజస్వి ప్రకాష్ మధ్య దాదాపు తొమ్మిదేళ్ల వయసు వ్యత్యాసం (Age Gap) ఉంది. కరణ్ నటుడిగా ఎంట్రీ ఇచ్చిన 2008లో తేజస్వి ఇంకా స్కూల్ చదువుతున్నారు.

2. కరణ్ కుంద్రాకు సినీ పరిశ్రమలో అవకాశం ఎలా వచ్చింది?

2008లో కరణ్ కుంద్రా ఫేస్‌బుక్‌ ద్వారా ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్‌కు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాను. దానికి ఆమె స్పందించి ముంబైకి పిలవడంతో అతని నటన ప్రస్థానం ప్రారంభమైంది.

3. తేజస్వి ప్రకాష్, కరణ్ కుంద్రా ఎప్పుడు ప్రేమలో పడ్డారు?

వీరిద్దరూ 2021లో ప్రసారమైన 'బిగ్ బాస్ 15' రియాలిటీ షోలో కలుసుకున్నారు. హౌస్‌లోనే వీరి స్నేహం ప్రేమగా మారింది. అభిమానులు వీరిని 'తేజ్రాన్' అని పిలుస్తారు.

4. కరణ్ కుంద్రా తేజస్వికి ఎక్కడ ప్రపోజ్ చేశారు?

నెట్‌ఫ్లిక్స్ షో 'దేశీ బ్లింగ్' చివరి ఎపిసోడ్‌లో భాగంగా దుబాయ్‌లో ఒక ప్రత్యేకమైన సెటప్‌లో కరణ్ కుంద్రా మోకాళ్లపై కూర్చుని తేజస్వికి డైమండ్ రింగ్‌తో ప్రపోజ్ చేశారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More